Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.. రేపు మాడవీధులలో ఉట్లోత్సవం.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

* విశాఖ: అరకు పర్యాటక రైలుకు బ్రేక్.. ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు కిరండోల్ ప్యాసింజర్ రద్దు.. గోరాపూర్-అరకు-సిమిలి గుడా మధ్య జరుగుతున్న ట్రాక్ మరమ్మత్తు పనులు కారణంగా ప్రకటించిన వాల్తేర్ డివిజన్..

* హైదరాబాద్‌: నేడు కంచన్‌బాగ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. హోంగార్డు రవీందర్‌ను పరామర్శించనున్న కిషన్‌రెడ్డి

* ప్రకాశం : ఒంగోలులో రాహుల్ గాంధీ జోడో యాత్రకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ..

* ప్రకాశం : గిద్దలూరు మండలం ముండ్లపాడులో వీరమ్మ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు..

* బాపట్ల : అద్దంకి మండలం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు హుండీ లెక్కింపు కార్యక్రమం..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు: ఇందుకూరుపేట మండలం మైపాడులో వైసీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ పాల్గొననున్న ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి.. బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి

* నెల్లూరు రూరల్ పరిధిలోని చైతన్యపురి కాలనీలో కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తల సమావేశం.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని క్లస్టర్ ఇంచార్జి లతో మాజీ మంత్రి నారాయణ సమావేశం

* విశాఖ: భారత్ జోడో యాత్రకు ఏడాది అయిన సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ, ర్యాలీ నిర్వహించనున్న కాంగ్రెస్.. ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రెటరీ క్రీస్టో ఫర్ తిలక్..

* విశాఖ: నేడు బీసీల సామాజిక సాధికారత సమావేశం.. తూర్పు కాపు, శిష్టకరణ, శోండి కళింగవైశ్య సామాజిక వర్గాలతో ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశం..

* తిరుమల: కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. ఐదోవ చిరుతని ట్రాప్ చేసిన అటవీశాఖ.. నరశింహస్వామి ఆలయం7వ మైలు మధ్యలో ప్రాంతంలో చిరుతని ట్రాప్ చేసిన అటవీశాఖ అధికార్లు.. ఐదో చిరుత కూడా మగ చిరుతగానే భావిస్తన్న అధికారులు.. నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమెరా ద్వారా చిరుత సంచరం గుర్తింపు.. వెంటనే బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించిన ఫారెస్ట్‌ అధికారులు

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి గోదావరి గట్టు ఇస్కాన్ వద్ద శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు.. తెల్లవారుజాము నుండ మొదలైన అభిషేకాలు.. స్వామి వారి దర్శనానికి క్యూ కడుతున్న భక్తులు.. సాయంత్రం కృష్ణష్టామి వేడుకల్లో భాగంగా ఉట్టి ఉత్సవం

* అనకాపల్లి జిల్లా: నేడు ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి గవరపాలెం నూకాంబికా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్న మంత్రి గుడివాడ అమర్నాథ్.. 8 కోట్ల రూపాయలతో అమ్మవారి ఆలయం రాతితో పునర్నిర్మాణం చేపట్టనున్న అధికారులు.. తాత్కాలికంగా భక్తులకు అమ్మవారి మూలవిరాట్ దర్శనాలు నిలిపివేత…

* అనంతపురం : నేటితో ముగియనున్న చంద్రబాబు జిల్లా పర్యటన. కళ్యాణదుర్గం , గుత్తిలలో పర్యటించనున్న చంద్రబాబు.

* అనంతపురం : తుంగభద్ర ఎగువకాలువ నుంచి హెచ్చెల్సీకి రెండు వేల క్యూసెకుల నీటి విడుదల.

* తిరుపతి: ఇస్కాన్ లో వేడుకగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు.. పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శినానికి క్యూ కట్టిన భక్తులు

* కృష్ణా జిల్లాలో నేడు మంత్రి రోజా పర్యటన.. పెనమలూరు నియోజక వర్గ సమీక్షా సమావేశంలో పాల్గొననున్న మంత్రి రోజా

* గుంటూరు: రేపు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం..

* గుంటూరు: తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ,నేడు రెండవ రోజు సిపిఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు….

* బాపట్ల: రేపల్లె పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు….

* బాపట్ల : భట్టిప్రోలులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…

* కర్నూలు: నేడు బనగానపల్లెకు చేరుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రేపు, ఎల్లుండి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన.. రేపు బనగానపల్లె లో మహిళా సదస్సులో పాల్గొననున్న చంద్రబాబు.. 9న కల్లూరులో బహిరంగ సభ

* పశ్చిమ గోదావరి: ఈ రోజు నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గంలో కొనసాగనున్న నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర

Exit mobile version