Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఆసియా కప్ 2023: నేడు పాకిస్థాన్‌-బంగ్లాదేశ్ ఢీ.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

* హైదరాబాద్‌: నేడు సచివాలయంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్స్ తో రివ్యూ చేయనున్న సీఎం కేసీఆర్‌. త్వరలోనే నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్ తోపాటు ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లపై రివ్యూ చేసే అవకాశం.

* హైదరాబాద్‌: నేడు స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం.. రాత్రికి ఢిల్లీకి స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌

* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* తిరుమల: 17వ తేదీన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంతురార్పణ.. 18న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు.. 9 రోజుల పాటు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. 26వ తేదీన ధ్వజాఅవరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

* నెల్లూరు: వెంకటాచలం, మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

* నెల్లూరు నగరం కొండాయపాలెంలోని శ్రీ అష్టలక్ష్మి సమేత కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు

* నెల్లూరు నగరంలోని అరుంధతీపాలెంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

* నెల్లూరు నగరంలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

* ప్రకాశం : పెద్దారవీడు మండలం కర్రోలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : మార్కాపురంలోని జగనన్న కాలనీలు, చెన్నరాయునిపల్లి జగనన్న లేఔట్లను పరిశీలించనున్న ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి..

* అనంతపురం జిల్లాలో రెండవ రోజు పర్యటించనున్న చంద్రబాబు. రాయదుర్గం క్యాంప్ సైట్ వద్ద “కరెంట్ కోత – చార్జీల మోత” అంశం పై ప్రజెంటేషన్.. కళ్యాణదుర్గంలో బహిరంగసభ.

* అనంతపురం : నగరంలోని సప్తగిరి కూడలిలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలకు భూమి పూజ కార్యక్రమం.

* ప్రకాశం : ఒంగోలులో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ..

శ్రీకాకుళం జిల్లాలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పర్యటన.. దయం 10 గంటలకు పొందూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బూర్జ మండలం ఏపీ పేట పంచాయతీ పరిధిలోని కే కే రాజ్ పురం, పి ఎల్ దేవి పేట గ్రామoలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీ పేట గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచి నీటి కొళాయి కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం పాల్గొంటారు

* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణంలో నూతనంగా నిర్మించిన 50 పడకల అదనపు హాస్పిటల్ భవనంను ప్రారంభించనున్న మంత్రి ఉషాశ్రీచరణ్.

* అనంతపురం : నగరంలోని ఇస్కాన్ టెంపుల్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీకృష్ణజన్మాష్టమి ఉత్సవాలు.

* తూర్పుగోదావరి జిల్లా : ఈ నెల 8వ తేదీ వరకు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల నియామకానికి గడువు పొడిగింపు.. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పలు పోస్ట్ లు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతి పై ఒక సంవత్సరం కాల పరిమితి నియమించుటకు ధరఖాస్తులు స్వీకరణ .. అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు ధరఖాస్తులను స్వీకరణ

* ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బేతపూడి క్యాంప్ సైట్ నుంచి నేడు నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం.. భీమవరం/నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనున్న పాదయాత్ర

* తిరుపతి: రేపు స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి, ఎస్వీ గోశాల‌లో గోపూజ‌.. సెప్టెంబ‌ర్‌ 9న తిరుప‌తి కోదండ‌రామాల‌యంలో ఉట్లోత్సవం

Exit mobile version