NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌ కుండపోత వర్షం.. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించిన GHMC

* తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం

* అనంతపురం : నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు. ఇవాళ రాయదుర్గంలో రోడ్డు షో , బహిరంగా సభ .

* విజయవాడ: నేడు బెజవాడలో మాతృ భాషా మహాసభ.. హాజరుకానున్న పురంధరేశ్వరి, vv లక్ష్మీ నారాయణ, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

* తిరుమల: శ్రీవారి సుప్రభాత సేవలో పాల్లొన్న బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్

* తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విగ్నేష్ దంపతలు

* విశాఖ: నేడు రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు.. ఆంధ్రా యూనివర్సిటీ సీ.ఆర్.రెడ్డి ఆడిటోరియంలో గురుపూజోత్సవం నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయ

* నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం..

* తిరుపతి: సెప్టెంబ‌ర్‌లో టీటీడీ స్థానికాల‌యాల్లో విశేష ఉత్సవాలు..7న గోకులాష్టమి, ఎస్వీ గోశాల‌లో గోపూజ‌.. 9న తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో శిక్యోత్సవం(ఉట్లోత్సవం).. 10న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి చిన్నవీధి శిక్యోత్సవం. 11న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి పెద్దవీధి శిక్యోత్సవం.. 18న వినాయ‌క చ‌వితి రోజున‌ శ్రీ క‌పిలేశ్వర‌స్వామివారి ఆల‌యంలో వినాయ‌కోత్సవం. 24 నుండి 27వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో ప‌విత్రోత్సవాలు. 26 నుండి 29వ తేదీ వ‌ర‌కు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి ప‌విత్రోత్సవాలు.

* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని జి.ఎస్.బి ఫంక్షన్ హాల్ లో చేనేత సదస్సు . హాజరుకానున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

* శ్రీకాకుళం: పలాస మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతు అప్పయ్యదొర వర్ధంతి వేడుకలు. కేటీ రోడ్డులో అప్పయ్యదొర విగ్రహానికి నివాళులర్పించనున్న మంత్రి సీదిరి అప్పలరాజు .

* ప్రకాశం : పుల్లలచెరువు మండలం పిడికిటివానిపల్లిలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : మార్కాపురం జెడ్పీ హైస్కూల్ లో బీజేపీ ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమం..

* తూర్పు గోదావరి జిల్లాలో నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. రాజమండ్రి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు జరిగి డి.ఏ.ఏ.బి & ఐ.ఏ.బి మీటింగ్ లో పాల్గొంటారు.. అనం కళాక్షేత్రం నందు జరుగు గురుపూజోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు.

* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, భీమవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

* తూర్పు గోదావరి జిల్లా : ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఆధ్వర్యంలోని ఈ నెల 8, 9, 10 తేదీలలోని రాజమండ్రిలో 4వ ఆక్వా & సీఫుడ్ ఫెస్టివల్.. నేడు ఫెస్టివల్ పురస్కారించుకుని 2కే రన్.. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నుంచి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు 2 కే రన్

* తూర్పు గోదావరి జిల్లా : నేడు రాజమండ్రి వెంకటేశ్వరా ఆనంకళాకేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత

* నేడు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని జనసేన నాయకుల డిమాండ్.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనసేన నాయకులను హౌజ్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు…

* బాపట్ల జిల్లా: భట్టిప్రోలు లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…

* విజయవాడ: దుర్గగుడిలో రెండో యాగశాల నిర్మాణానికి నిర్ణయం.. రేపు శంకుస్థాపన

* ఏలూరు జిల్లా కలపర్రు టోల్ ప్లాజా వద్ద అర్దరాత్రి ధర్నాకు దిగిన టోల్ ప్లాజా సిబ్బంది.. జీతాలు పెంచాలంటూ విధులు బహిష్కరించిన టోల్ ప్లాజా సిబ్బంది.. ఈరోజు రాత్రి 8 గంటల లోపు సమస్య పరిష్కరించకపోతే మరోసారి ఆందోళనకు దిగుతామని హెచ్చరించిన సిబ్బంది

* ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు.. నిన్న ఉదయం నుంచి కురుస్తున్న వాన.. సంగారెడ్డి, మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు.. సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు

* ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు.. మెదక్ జిల్లా మాసాయిపేటలో అత్యధికంగా 12 సెం. మీ వర్షపాతం నమోదు. చిట్కుల్ లో 11.7, నర్సాపూర్ 10, వెల్దుర్తి లో 10 సెం. మీ భారీ వర్షపాతం నమోదు.. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా లక్ష్మీ సాగర్ లో 11.7 సెం. మీ వర్షపాతం నమోదు .. సంగారెడ్డి 10, కొండాపూర్ 9.7, ఆందోల్ 9 సెం. మీ వర్షపాతం నమోదు.. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా రాఘవపూర్ లో 9.7 సెం. మీ వర్షపాతం నమోదు.. నారాయణరావుపేటలో 9.4, తొగుటలో 7.8 సెం. మీ వర్షపాతం నమోదు

* ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షం. నిర్మల్ జిల్లా ముదోల్ లో 86.3 మీమీ. కొమురం భీం జిల్లా లింగా పూర్ లో 62.5 మీమీ. మంచిర్యాల జిల్లా కుందారం లో 70 మీమీ.. ఆదిలాబాద్ జిల్లా లోకారి కే లో 39 మీమీ వర్షపాతం నమోదు.

* హైదరాబాద్‌: మరో గంట పాటు నగరవ్యాప్తంగా భారీ వర్షం.. ప్రజల్ని అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ.. అవసరమైతే తప్ప బయటికి రావొద్దు అని సూచించిన జీహెచ్ఎంసీ

Show comments