* విశాఖ: నేడు ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభం.. రూ.96 కోట్లతో పోర్టు గ్రీన్ చానల్ అనుకుని అత్యాధునిక టెర్మినల్ నిర్మించిన వీపీటీ. నేడు కేంద్రమంత్రి శర్భానంద్ సోనోవాల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం…
* రాజన్నసిరిసిల్ల జిల్లా: శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాల్లో, గ్రీవెన్స్ కార్యక్రమం.. బాధితుల నుండి అర్జీలు స్వీకరించనున్న ఉన్నతాధికారులు.
* నేడు బాపట్ల జిల్లా రాంబొట్ల పాలెం, అప్పికట్ల, జిల్లెల్లమూడి, గ్రామాల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నిక..
* బాపట్ల: నేడు భట్టిప్రోలులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.
* ప్రకాశం : పుల్లలచెరువు మండలం పిడికిటివానిపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొమనున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* బాపట్ల : చిన్నగంజాం తహశీల్దార్ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా..
ప్రకాశం : యర్రగొండపాలెంలో వైఎస్సార్ నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు సీపీఎం అధ్వర్యంలో ధర్నా.. ధర్నా చౌక్ లో ఆందోళన చేయనున్న సీపీఎం నేతలు
* విజయవాడ: అక్టోబర్ 15 నుంచి బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 15 నుంచి 23 వరకు ఉత్సవాలు జరపాలని వైదిక కమిటీ నిర్ణయం, 20వ తేదీన మూలా నక్షత్రం, 23న దసరా పండుగ, తెప్పోత్సవం.
* నేడు బెజవాడలో VHP ప్రధాన కార్యదర్శి మిలిండ్ పరాందే పర్యటన.. VHP ఎల్డర్స్ మీట్ లో పాల్గొన్న మిలింద్
* తూర్పు గోదావరి జిల్లాలో నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. కొవ్వూరు టౌన్ లిటరరీ క్లబ్ నందు జరుగు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో సహా పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* నేడు బందరు మేయర్ ఎన్నిక.. కొత్త మేయర్ గా బాధ్యతలు చేపట్టనున్న వెంకటేశ్వరమ్మ.. ఇప్పటి వరకు ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవీ కాలాలు రెండేళ్లు పూర్తి.. దీంతో కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని గతంలోనే నిర్ణయం.. నేడు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సమర భేరి “ధర్నా” కార్యక్రమం
* విశాఖ: నేడు కేంద్ర మంత్రులు శర్భానంద్ సోనోవాల్, శ్రీపాద నాయక్ పర్యటన.. నేడు పోర్టు ట్రస్ట్ విస్తరణ పనులు పరిశీలన, ఐదు ప్రాజెక్టులను ప్రారంభించనున్న మంత్రులు.. 237.51 కోట్లతో అభివృద్ధి, విస్తరణ పనులు.. నగరంలో కాలుష్య నియంత్రణ దిశగా కీలక చర్యలకు సిద్ధమైన వైజాగ్ పోర్టు.
* పశ్చిమ గోదావరి: ఉండి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా) కోలమూరు శివారు క్యాంప్ సైట్ నుంచి నేడు పాదయాత్ర ప్రారంభించనున్న నారా లోకేష్.
* అనంతపురం : జిల్లాలోకి ప్రవేశించనున్న సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం బహిరంగసభ.
* హైదరాబాద్: యెన్నం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ నుండి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ నిర్ణయం.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ సస్పెన్షన్ వేటు
* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,459 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 32,899 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు
* కర్నూలు: వర్షం కారణంగా నేడు రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా.. ఇవాళ జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు.. ఈనెల 21 తేదీకి వాయిదా
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 352 వ సప్తరథోత్సవాలు నేటితో ముగింపు.. ఉదయం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. రాత్రి పంచరథోత్సంపై ఉత్సవ మూర్తి ప్రహ్లదరాయులను ప్రాకారంలో ఉరేగింపు.
* నంద్యాల: నేడు సంగమేశ్వరంలో వరుణ సంకల్పం, వరుణ జపం, రుష్య శృంగ జపం, వరుణ యాగం
* నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రదోత్సవం
* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో నేడు ప్రత్యేక పూజలు, బిల్వార్చన , స్వామి అమ్మవార్ల కు మహా మంగళహారతి
