* నేడు నింగిలోకి PSLVC-57 రాకెట్.. సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో.. నిన్న మొదలైన కౌంట్‌డౌన్ సవ్యంగా సాగుతోందని ప్రకటించిన శాస్త్రవేత్తలు..
* PSLVC-57 రాకెట్ ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో చర్చిస్తున్న ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్.. రాకెట్ లోకి ఇంధనం నింపుతున్న శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలో భారీ భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు.. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు తరలి వస్తున్న సందర్శకులు
* నేడు కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం.. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులర్పించనున్న సీఎం..
* కాకినాడ: నేడు కాకినాడకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జోన్ 2 పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్న బాబు.. హాజరుకానున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోని ఐదు పార్లమెంట్, 36 అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలు.. గోదావరి జిల్లాల్లో పార్టీ పరిస్థితి, క్షేత్ర స్థాయి నివేదికలపై సమావేశంలో చర్చించనున్న నేతలు
* ప్రకాశం : త్రిపురాంతకం మండలం నడిగడ్డలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ఒంగోలులో వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు..
* ప్రకాశం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్న పార్టీ శ్రేణులు, అభిమానులు..
* అనంతపురం : బుక్కరాయసముద్రం మండలంలోని ముసలమ్మ కట్ట సమీపంలో వ్తెఎస్సాఆర్ విగ్రహా ఆవిష్కరణ.
* ప్రకాశం : ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో గద్దర్ సంస్మరణ సభ, హాజరుకానున్న పలువురు విరసం నేతలు..
* అనంతపురం : శ్రావణ మాస మూడవ శనివారం సందర్భంగా గుంతకల్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
* నెల్లూరు జిల్లా: వైసీపీ జిల్లా కార్యాలయంలో వైయస్సార్ వర్ధంతి కార్యక్రమం పాల్గొననున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. పార్టీ నేతలు
* తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చెయ్యనున్న సీతా రంజీత్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ
* పశ్చిమ గోదావరి: తణుకులో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి
* ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం, ఉంగుటూరు నియోజక వర్గాలలో కొనసాగనున్న యువగళం పాదయాత్ర
* గుంటూరు: నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు, పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, స్థానిక వైసిపి క్యాడర్…
* గుంటూరు: మంగళగిరిలో నేటి నుండి రెండు రోజులపాటు, బీసీవై పార్టీ ఆధ్వర్యంలో, మెగా జాబ్ మేళా…
* గుంటూరు: నేడు అమరావతి ప్రాంతం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్నాతోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.
* నేడు ఖమ్మంలో అనుచరులతో సమావేశం కానున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం.
* నేడు ఖమ్మంలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం..
* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోంమంత్రి తానేటి వనిత పర్యటన వివరాలు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.. కొవ్వూరు టౌన్ పుంతలో ముసలమ్మ గుడి వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.. కొవ్వూరు టౌన్ మెరకవీధి లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.. కొవ్వూరు టౌన్ మెరకవీధి లో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు.. చాగల్లు మండలం నెలటూరు గ్రామంలోని సీతారామ కళ్యాణమండపంలో జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం వల్లూరులోని గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు.. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.
