* రాజ్‌కోట్: నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
* అమరావతి: నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న అసెంబ్లీ.. సభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు -2023, ఏపీ అప్రోప్రియేషన్ (నెం.3) బిల్లు- 2023 బిల్లును ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.. మూడు అంశాల పై నేడు స్వల్ప కాలిక చర్చలు..
* అమరావతి: నేటితో ముగియనున్న శాసన మండలి సమావేశాలు.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో పెద్దల సభ ప్రారంభం.. మండలి ముందుకు రానున్న సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం పై రెండవ రోజు కొనసాగనున్న చర్చ, వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి పై స్వల్ప కాలిక చర్చలు . ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం
* హైదరాబాద్: నేడు టెట్ 2023 (TSTET-2023) ఫలితాలు.. ఉదయం 10 గంటల నుండి వెబ్‌సైట్‌లో ఫలితాలు
* ఢిల్లీ: చంద్రబాబు నాయుడు ఎస్‌ఎల్‌పీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.
* తిరుమల: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పున:రుద్ధరణ..
* ప్రకాశం : సింగరాయకొండలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం..
* ప్రకాశం : సింగరాయకొండలో ప్రసిద్ధ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు..
* బాపట్ల : చీరాలలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం..
* తిరుమల: ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు నడకదారిలో పరిశీలన జరుపనున్న వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ బృందం.. నడకదారిలో ఇనుప కంచే ఏర్పాటుకు వున్న అవకాశాలను పరిశీలించనున్న వైల్డ్ లైఫ్ కమిటీ.. ఆ కమిటీ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేయనున్న కేంద్రం..
* తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. ఈవో ఇంటి సమీపంలో చిరుత సంచారాని ట్రాప్ కెమరాలు ద్వారా గుర్తించిన అటవీశాఖ
* విశాఖ: పెంచిన విద్యుత్ ఛార్జీలు, ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురుద్వార్ వద్ద గల ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఆఫీస్ దగ్గర ధర్నా
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం మూసివేసిన అధికారులు.. ఈ రోజు ఉదయం నుండి అక్టోబర్ 26వ తేదీ వరకు మూసివేత.
* అనంతపురం : జిల్లా కేంద్రంలో టిడిపి చేపట్టిన కాగడాల ప్రదర్శనకు అనుమతి నిరాకరణ. నిబంధనాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు. 30 పోలీసు యాక్టు అమలులో ఉండటం వల్ల పోలీసుల అనుమతి లేనిదే ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు అనుమతి లేదన్న డీఎస్పీ.
* తూర్పుగోదావరి జిల్లా : నేటికి 18వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఈ నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. గడిచిన 18 రోజులుగా రాజమండ్రి టీడీపీ క్యాంప్ శిబిరంలోనే బస చేస్తున్న భువనేశ్వరీ, బ్రాహ్మణి
* తూర్పు గోదావరి జిల్లా : రాజమండ్రి జాంపేట సెయింట్ పాల్స్ లూధరన్ చర్చిలో జరిగే ప్రార్థనల్లో పాల్గొననున్న నారా భువనేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని భువనేశ్వరి సందర్శిస్తారు.
* నెల్లూరు: విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నెల్లూరులో ప్రదర్శన
* విజయనగరం: నేడు గజపతినగరంలో జగనన్నకు చెబుదాం వినతుల స్వీకరణ కార్యక్రమం.. మండల స్థాయిలో నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం వినతుల స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి..
* కర్నూలు: నేడు మాజీ సీఎం స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 22వ వర్ధంతి.. కిసాన్ ఘాట్ లో కోట్ల సమాధి వద్ద నివాళులు అర్పించనున్న అభిమానులు
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 55,747 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,774 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.11 కోట్లు
* నిర్మల్: నేడు కడెం ప్రాజెక్టుకు మరమ్మత్తుల బృందం. నిన్న 15వ నంబర్ గేటు వద్ద సమస్య.. హైదారాబాద్ టీంకు సమాచారం ఇచ్చిన అధికారులు. నిన్న తెగిన గేటు కౌంటర్ వెయిట్ రోప్.
* నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
