NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ.. నేడు బిల్లు ఆమోదం పొందే అవకాశం.. రేపు రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. బిల్లుకు ‘నారీ శక్తి వందన్‌’ అని పేరు పెట్టిన కేంద్రం

* ఢిల్లీ: లోకసభలో ఈ రోజు మరో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. “128 వ రాజ్యాంగ సవరణ బిల్లు”, “అడ్వకేట్స్ సవరణ బిల్లు” ను ప్రవేశ పెట్టనున్న న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘవాల్.

* అమరావతి: నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశం.. రేపటి నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుపై కేబినెట్‌లో చర్చించే అవకాశం

* అమరావతి: నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ.. అంగళ్లు దాడి ఘటనలో ఏ1గా ఉన్న చంద్రబాబు

* హైదరాబాద్‌: నేటి నుండి ఉపాధ్యాయ నియామక పరీక్ష దరఖాస్తుల స్వీకరణ.. ఈ నెల 20 నుండి వచ్చే నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ

* తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడో రోజు.. ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి..

* హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌రుగులు తీయ‌నున్న “గ్రీన్ మెట్రో ల‌గ్జ‌రీ ఏసీ బ‌స్సులు” ప‌ర్యావ‌ర‌ణ‌ హిత‌మైన బ‌స్సులను అందుబాటులోకి తెస్తోన్న టీఎస్ఆర్టీసీ.. ఈ రోజు రాష్ట్ర ర‌వాణా శాఖ‌ మంత్రి పువ్వాడ‌ అజయ్‌ చేతుల మీదుగా ప్రారంభం

* ప్రకాశం : నాగులుప్పలపాడులో రైతు సంఘం ఆధ్వర్యంలో గుండ్లకమ్మ ఆయకట్టు రైతుల ప్రత్యేక సమావేశం..

* ప్రకాశం : పొదిలిలో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం..

* విశాఖ: నేడు నగరంలో సీపీఎం బహిరంగ సభ., పాల్గొననున్న రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 29వరకు ఉత్తరాంధ్ర జిల్లాల బైక్ యాత్రలు.. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర జాతా ప్రారంభ బహిరంగ సభ.

* నెల్లూరు జిల్లా: నెల్లూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

* విశాఖ: ఈనెల 24 వరకు విజయవాడ-విశాఖ-విజయవాడ మధ్య రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో భద్రతపరమైన పనులు కారణంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రద్దు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే.

* విశాఖ: నేడు అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు సమీక్ష సమావేశం.. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అమలు తీరును పరిశీలించనున్న చైర్మన్

* విశాఖ: AOBలో హై అలెర్ట్.. రేపటి నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు.. అడవులను జల్లెడ పడుతున్న భద్రత బలగాలు.. ముఖ్య నేతలను మైదాన ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచనలు జారీ.. వారోత్సవాలు విజయవంతం కోసం పిలుపు ఇచ్చిన మావోలు..

* ఏలూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటన.. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గనున్న బీజేపీ చీఫ్.. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్న పురంధేశ్వరి.

* వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం.. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు.. రాయలసీమ, కోస్తాంధ్రకు వర్ష సూచన.. తీరం వెంబడి కొనసాగుతున్న గాలుల ఉధృతి.. మత్స్యకారుల వేట నిషేధం

* తూర్పుగోదావరి జిల్లా: 11వ రోజుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ .. 9వ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు.. ఇవాళ చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ములాఖత్‌.. సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసేందుకు వెళ్ళనున్న ఆయన తరుపున న్యాయవాదులు

* కర్నూలు: నేడు కోడుమూరులో వినాయక నిమజ్జనం వేడుకలు

* అనంతపురం : జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా పటిష్ట చర్యలు. ఈ నెల 20, 22, 26 తేదీల్లో నిమజ్జన కార్యక్రమాలు.. నేడు జిల్లా వ్యాప్తంగా 2,711 విగ్రహాల నిమజ్జనం.

* అనంతపురం : తాడిపత్రి నియోజకవర్గంలోని గ్రామాలలో నేడు వినాయక నిమజ్జనం.

* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలం వెలుగు కార్యాలయంలో జగనన్నకు చెబుదాం ప్రజా స్పందన కార్యక్రమం. పాల్గొననున్న జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు.

Show comments