* హైదరాబాద్: నేటి నుండి రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు.. ఉదయం 11 గంటల తర్వాత హైదరాబాద్ రానున్న సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సీడబ్ల్యూసీ సమావేశం.
* నేడు రాత్రి హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా..
* నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. కంట్రోల్ రూమ్‌లో మోటార్ స్విచ్ ఆన్ చేయనున్న సీఎం.. సాయత్రం 4 గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గరకు కేసీఆర్
* అమరావతి: ఇవాళ వైఎస్సార్ కాపు నేస్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం.. అర్హులైన 3,57,844 మంది మహిళలకు లబ్ది.. రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనున్న ప్రభుత్వం
* ఇవాళ నిడదవోలులో కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. లండన్ పర్యటన తర్వాత మొదటి సారి బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.. తాజా రాజకీయ పరిణామాల పై సీఎం స్పందించే అవకాశం.. చంద్రబాబు అరెస్టు, జనసేన -టీడీపీ పొత్తు పై స్పందించే అవకాశం
* హైదరాబాద్: నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల.
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పటాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* నేడు ఢిల్లీలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్న ఎంపీలు.. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ నిర్వహించనున్న నారా లోకేష్.. చంద్రబాబు అరెస్టుపై పార్లమెంటులో నినదించేలా వ్యూహాలు
* ప్రకాశం : పుల్లలచెరువు మండలం నరజాముల తాండాలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : ఒంగోలు రూరల్ మండలం చింతాయగారిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* నెల్లూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం మండల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు
* తిరుమల: రేపు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రేపు సాయంత్రం 6 గంటలకు మాడవీధులలో విహరించనున్న శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు.. రాత్రి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న అర్చకులు.. బ్రహ్మోత్సవాలకు కంకణధారుడిగా ముఖ్య అర్చకులు రామకృష్ణధీక్షితులు
* తిరుమల: ఇవాళ బ్రహ్మోత్సవ ఏర్పాట్లుపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం.. భధ్రతా ఏర్పాట్లపై అధికార్లకు దిశాదిర్ధేశం చేయనున్న డీజీపీ
* ఎల్లుండి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఎల్లుండి సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
* శ్రీకాకుళం: పలాసలో రాష్ట్ర పశుసంవర్ధక, మరియు మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పర్యటన.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 27వ వార్డు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
* గుంటూరు: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు ,నాయకుల , విస్తృతస్థాయి సమావేశం , హాజరుకానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
* ఏడో రోజుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. 6వ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు .. స్నేహ బ్లాక్ లో యథావిథిగా కొనసాగుతున్న చంద్రబాబు దినచర్య.. సెంట్రల్ జైలు సమీపంలోని క్యాంపులోనే ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి
* అనంతపురం : నగరంలో ఏఐటియుసీ ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మిక వైజ్ఞానిక శిక్షణ సమ్మేళనాలు.
* అనంతపురం : కళ్యాణదుర్గంలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* విశాఖ: “అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం” స్వచ్ఛ భారత్ లో భాగంగా ఆర్కే బీచ్ వద్ద స్వచ్ఛసాగర్ – సురక్షిత సాగర్ కార్యక్రమం.. మత్స్యకార సంక్షేమ సమితి మరియు ఇన్ కాయిస్ సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమం…
