Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్ 2023: నేడు బంగ్లాదేశ్‌తో తలపడనున్న పాకిస్థాన్‌.. మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతాలో మ్యాచ్‌

* తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. నేడు ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి.. రేపు సాయంత్రం 6 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ.. రాజస్థాన్‌లో మిగిలిన 76 స్థానాలతో పాటు తెలంగాణలో మిగిలిన 66 స్థానాలపై చర్చ.. తెలంగాణలో ఇప్పటికే తొలి జాబితాలో 52 మంది, రెండవ జాబితాలో ఒక స్థానానికి అభ్యర్థి ప్రకటన

* సిద్దిపేట: నేడు దుబ్బాక నియోజకవర్గ బంద్‌కు బీఆర్‌ఎస్‌ పిలుపు.. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనకు నిరసనగా బంద్ కి పిలుపునిచ్చిన బీఆర్ఎస్‌ పార్టీ

* తిరుమల: ఇవాళ తిరుచానురు పద్మావతి అమ్మవారికి 60 లక్షల రూపాయలు విలువ చేసే కాసుల హారాని కానుకగా సమర్పించనున్న కంచి పిఠాధిపతి

* ప్రకాశం : గిద్దలూరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గిద్దలూరు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఐక్యతా 2కే రన్ కార్యక్రమం..

* బాపట్ల : సంతమాగులూరు మండలం ఏల్చూరు నుండి అడవిపాలెం వరకు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిల్ ర్యాలీ..

* తిరుపతి: నవంబర్‌ 10వ తేదీ నుంచి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.. 7వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. 9వ తేదీన లక్షకుంకుమార్చన, అంకురార్పణ.. 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం.

* తూర్పుగోదావరి జిల్లా : నేడు 53వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. రేపటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు. సాయంత్రం వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును హాజరు పర్చనున్న జైలు. అధికారులు

* అనంతపురం : యాడికి మండలం రాయలచెరువు గ్రామంలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

* అనంతపురం : నేడు గుత్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.

* అనంతపురం : గుంతకల్ పట్టణంలో జి.జె రావు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పాలస్తీనాలో శాంతి కోసం సంఘీభావ సభ.

* తూర్పు గోదావరి జిల్లా : నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబ సభ్యులు.. ఉదయం 11 గంటలకు ములాఖత్‌ అనంతరం ఉత్తరాంధ్ర పర్యటనకు బయల్దేరి వెళ్లనున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. మార్గమధ్యలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించనున్న భువనేశ్వరి

* విశాఖ: నేడు ఎన్టీఆర్‌ భవన్ లో తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ సమావేశం.. టీడీపీ పరిశీలకుడుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి హాజరుకానున్న మాజీమంత్రి పడాల అరుణ.

* విశాఖ: నేడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన.. వ్యాపార, వాణిజ్య అంశాలపై బ్యాంకర్లు, పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేక సమావేశం

* నెల్లూరులో జనసేన- టిడిపి నేతల సమన్వయ సమావేశం..

* నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన మందిరంలో అఖిలపక్ష రైతు కార్మిక సదస్సు

* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెంలో అమృత్ పథకం కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

* పశ్చిమగోదావరి జిల్లా: నవంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలు.. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ఆదేశాలు

* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,654 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,978 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు

* అనంతపురం: జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలో 2 రన్.

* అనంతపురం : AITUC 104వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నగరంలో కార్మికుల మహా ప్రదర్శన.

* అనంతపురం : తాడిపత్రి మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు హుండీ లెక్కింపు

* నంద్యాల: సీపీఎం బస్సు యాత్ర.. నేడు రాజ్ థియేటర్ జంక్షన్ లో సభ

* కర్నూలు: నేడు గూడూరు మండలం కె.నాగులాపురం శ్రీ సుంకులాపరమేశ్వరిదేవి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు కుంకుమార్చనలు

* విజయనగరం: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

Exit mobile version