Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023లో నేడు రెండు మ్యాచ్‌లు.. నేడు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ ఢీ.. ఉదయం 10.30కి ధర్మశాల వేదికగా మ్యాచ్‌… నెదర్లాండ్స్‌తో బంగ్లాదేశ్‌ ఢీ.. మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతాలో మ్యాచ్‌

* నేడు కొమురం భీం 83 వ వర్ధంతి.. జోడేఘాట్ లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. నివాళులర్పించేందుకు తరలి రానున్న ఆదివాసీలు. వివిధ రాష్ట్రాల కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాలు.

* తిరుమల: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం 8 గంటల పాటు మూసివేత.. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 3:15 గంటల వరకు ఆలయం మూసివేత.. ఇవాళ సహస్రదీపాలంకరణ సేవ, వయోవృద్దులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

* నేడు విశాఖకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. ఆంధ్రా మెడికల్ కాలేజ్ శతాబ్ది ఉత్సవంలో ముఖ్య అతిథిగా వైస్ ప్రెసిడెంట్.. ఉపరాష్ట్రపతితో కలిసి వేడుకలకు హాజరుకానున్న గవర్నర్.

* విశాఖ: పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మరోసారి మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదా.. నేడు భారత ఉపరాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలకనున్న మంత్రి

* విశాఖ: నేడు భీమిలి నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర.. 12 గంటలకు మీడియా సమావేశం.. మధ్యాహ్నం 12:45 గంటలకు చంద్రపాలేం హై స్కూల్లో నాడు నేడు పనులు పరిశీలన.. మధ్యాహ్నం 2:30 గంటలకు బోయిపాలెం నుంచి బైక్ ర్యాలలీ ప్రారంభం, మ. 3 గంటలకు తగరపువలస ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ.. బస్సు యాత్రలో పాల్గొననున్న రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బా రెడ్డి, బొత్స సత్యనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు….

* ప్రకాశం : పుల్లలచెరువులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్.

* బాపట్ల : అద్దంకి మండలం శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో లక్ష తమలపాకులతో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు..

* ప్రకాశం : ఒంగోలులో ఉమ్మడి జిల్లా టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం.. హాజరుకానున్న ఇరుపార్టీల ముఖ్య నేతలు..

* ప్రకాశం : గిద్దలూరులో జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం

* నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

* నేడు బాపట్ల లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్ర.. పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు నుంచి భారీ బైక్ ర్యాలీ, చందోలు, కర్లపాలెం మీదుగా బాపట్ల మార్కెట్ యార్డు వరకు సాగనున్న బైక్ ర్యాలీ.. సాయంత్రం బాపట్ల అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో భారీ బహిరంగసభ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, శాసనసభ్యులు కోన రఘుపతి తదితరులు.

* గుంటూరు: నేడు చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రముఖ దేవాలయాల మూసివేత…

* పల్నాడు: క్రోసురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా…

* తూర్పుగోదావరి జిల్లా : నేడు 50వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు..

* నేడు చంద్రబాబుతో ములాకాత్ కానున్న కుటుంబ సభ్యులు నారా లోకేష్ , భువనేశ్వరీ, మరో టిడిపి సీనియర్ నేత.. ఉదయం 11 గంటలకు ములాకాత్

* అనంతపురం : చంద్రగ్రహణం కారణంగా ఇవాళ సాయంత్రం 7:00 గంటల నుంచి కసాపురం ఆంజనేయస్వామి ఆలయం మూసివేత.

* అనంతపురం : గుంతకల్లులో పర్యటించనున్న కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాదయశో నాయక్ .

* అనంతపురం : నేడు జిల్లాలో పర్యటించనున్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ .

* శ్రీ సత్యసాయి : చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయం మూసివేత.

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు చంద్ర గ్రహణం కారణంగా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో రాత్రి 7.30 వరకూ మాత్రమే స్వామి వారి దర్శనాలు.. సంప్రోక్షణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున నుండి యధావిధిగా ఆర్చనాది కార్యక్రమాలు.. ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు

* ఏలూరు : నేడు చంద్రగ్రహణం కారణంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం మూసివేత.. మధ్యాహ్నం 1 గంటకు ఆలయం మూసివేత.. రేపు తెల్లవారుజామున ఆలయం తెరచి శుద్ధి, అర్చనాది కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం

* ఏలూరు : ద్వారకాతిరుమలలో 5 వ రోజు ఘనంగా ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు.. నేడు రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న.. ఉదయం చక్రస్నానం, ధ్వజఅవరోహణ

* శ్రీ సత్యసాయి : లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశ్వేశ్వర వీరభద్ర స్వామి దేవాలయం నేడు మూసివేత.. మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయ తలుపులు మూసివేత… రేపటి రోజు ఉదయం 7 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం భక్తులకు యధావిధిగా దర్శనాలు.

* అనంతపురం : నగరంలోని కేఎస్ ఎన్ కళాశాలలో నేడు రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి ఉత్సవాలు.

* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,404 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,659 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు

* నంద్యాల: నేటి సాయంత్రం పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయం మూసివేత.. సాయంత్రం 5 నుంచి రేపు ఉదయం 5 వరకు ఆలయ ద్వారాలు మూసివేత.. ఈరోజు మధ్యాహ్నం 3.30 వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి.. గ్రహణం కారణంగా రాత్రి జరిగే శ్రీస్వామి అమ్మవారి నిత్య కల్యాణం నిలుపుదల.. శ్రీశైలం ప్రధానాలయం, పరివార ఆలయాలు కూడా మూసివేత

* కర్నూలు: నేడు కోడుమూరులో టిడిపి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం

* నంద్యాల: చంద్రగ్రహణం సందర్భంగా నేటి సాయంత్రం 6 గంటలకు మహానంది ఆలయం మూసివేత

* నంద్యాల: అవుకు (మం) ఎర్రమల కొండల్లో వెలసిన శ్రీ కంబగిరి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో నేడు విశేష పూజలు

* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోంమంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. చాగల్లు మండలం చాగల్లు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (150వ రోజు) నిర్వహిస్తారు. కొవ్వూరు పట్టణంలో లిటరరీ క్లబ్ లో కొవ్వూరు టౌన్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గృహా సారథులు, వాలంటీర్స్ తో  సమావేశం నిర్వహిస్తారు.. కొవ్వూరు రూరల్ మండలం మద్దూరు లో నిర్వహించు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మద్దూరు జడ్పీ హైస్కూల్లో వంటగది నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు

* కర్నూలు: నేటితో ముగియనున్న హాళగుంద మండలం దేవరగుట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు.. దేవరగుట్టు నుండి నెరణీకి చేరుకోనున్న శ్రీ మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు

* ఆదిలాబాద్ జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటన. ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజక వర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్న మంత్రి. ఉదయం ఉట్నూర్ లో మధ్యాహ్నాం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించ నున్న సభల్లో పాల్గొననున్న మంత్రి హరీష్‌రావు

Exit mobile version