Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐసీసీ క్రికెట్‌ వన్డే వరల్డ్ కప్‌ 2023: నేడు బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్‌.. మధ్యాహ్నం 2 గంటలకు పుణె వేదికగా మ్యాచ్‌.. నాల్గో విజయంపై గురిపెట్టిన భారత్‌

* తిరుమల: నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం.. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ.. గరుడ వాహన సేవ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ.. 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.. భక్తుల కోసం ప్రతి ఐదు నిమిషాలకు బస్టాండ్ లో ఓ బస్సు నడపనున్న టీటీడీ..

* తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం దాదాపు మూడు వేల మందితో తిరుమల, తిరుపతిలో భారీ భద్రత ఏర్పాటు చేసినా అర్బన్ పోలీసులు ..

* తెలంగాణలో రాహుల్ గాంధీ రెండో రోజు బస్సు యాత్ర.. భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర.. నిరుద్యోగుల బైక్ ర్యాలీలో పాల్గొననున్న రాహుల్ గాంధీ.. కాటారం పక్కనే రైతులతో సమావేశం.. అక్కడే భోజనం.. మంథని బైపాస్ నుండి నేరుగా పెద్దపల్లికి రాహుల్.. అక్కడ బహిరంగ సభ.. రాత్రి కరీంనగర్ లో రాహుల్ బస

* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం చెల్పూర్ కే.టి.పీ.పీ (గోదావరి గెస్ట్ హౌస్) లో నేడు రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు మరికొంద మంది రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. అనంతరం బస్సు యాత్ర కేటీకే 5వ గని నుండి బాంబులగడ్డ వరకు బైక్ ర్యాలీ.

* కేటికే 1.వ గని వద్ద సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించనున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడానున్న రాహుల్ గాంధీ..

* కర్నూలు: నేడు సీఎం వైఎస్‌ జగన్ జిల్లా పర్యటన.. ఎమ్మిగనూరులో చేదోడు లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్.. ఉదయం 9.45 కి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకొనున్న సీఎం.. హెలికాఫ్టర్ లో బయల్దేరి 10.15 గంటలకు ఎమ్మిగనూరు చేరుకోనున్న సీఎం జగన్.. వీవర్స్ కాలనీ మైదానంలో ఉదయం 11 నుంచి 11.55 వరకు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్‌.

* నేడు జగనన్న చేదోడు కార్యక్రమం.. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 25వేల లబ్దిదారులకు ప్రయోజనం.. రజక, నాయి బ్రాహ్మణ, టైలరింగ్ చేసే వారికి ప్రభుత్వం చేయూత.. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల ఆర్ధిక చేయూత.. 325 కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కార్యక్రమం

* నేడు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్.. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల ప్రత్యేక భేటీలు.. తెలంగాణలో రూట్ మ్యాప్, అభ్యర్థుల ఖరారుపై చర్చలు.. అన్ని కుదిరితే ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం..

* రాజమండ్రి: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు.. వర్చువల్ విధానంలో ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుకానున్న చంద్రబాబు

* కాకినాడ: నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిలతో కాకినాడలో సమావేశం నిర్వహించనున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

* ప్రకాశం : త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు.. గురువారం – 5వ రోజు, అలంకారము- శ్రీ స్కందమాత, పల్లకి సేవ-మయూరవాహనం

* ప్రకాశం : కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు నూతన గదులను, తురిమెళ్ళలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు.

* ప్రకాశం : మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శరన్నవరాత్రుల భాగంగా నాల్గవ రోజు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న రాజ్యలక్ష్మి అమ్మవారు..

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆరోమా ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కోసం బస్సు యాత్రను ప్రారంభించనున్న కలెక్టర్ దినేష్ కుమార్..

* శ్రీ సత్యసాయి : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాప్తాడు , చెన్నేకొత్తపల్లిలలో పంటలను పరిశీలించనున్న సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ.

* అనంతపురంలో నేడు వైఎస్సాఆర్ సీపీ సమావేశం. సామాజిక బస్సు యాత్ర రూట్ మ్యాప్‌పై చర్చించనున్న నేతలు. హాజరు కానున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ముత్తుకూరులోని వైసీపీ కార్యాలయంలో జరిగే పార్టీ నాయకులు.. కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

* ఏలూరు: నేడు ఏలూరు నగరపాలక సంస్థ సర్వ సభ్య సమావేశం ..

* పశ్చిమ గోదావరి: మంత్రి కొట్టు సత్యనారాయణ షెడ్యూల్..తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..

* పశ్చిమ గోదావరి: భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా మహోత్సవాలు.. నేడు శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు..

* నంద్యాల: నేడు శ్రీశైలంలో 5వ రోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం స్కందమాత అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. శేషవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న శ్రీస్వామి, అమ్మవారు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆది దంపతుల గ్రామోత్సవం

* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దసరా మహోత్సవాల్లో ఐదవ రోజు మహాచండీదేవిగా దర్శనం.. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు.. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించినది.. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు.. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అపి భక్తుల విశ్వాసం

* కర్నూలు: నేటి నుంచి హోళగుంద మండలం దేవరగట్టు లో శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు.. 28వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలు.. శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు కంకణదారణ, నిశ్చితార్థం, ధ్వజా రోహణ తో దసరా బన్ని ఉత్సవాలు ప్రారంభం..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు 41వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు.. ఇవాళ చంద్రబాబును వర్చువల్ విధానంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్న జైలు అధికారులు.. స్కిల్ కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు

* తూర్పుగోదావరి జిల్లా : నేడు 5వ రోజు ఘనంగా జరుగుతున్న రాజమండ్రి దేవిచౌక్ లోని బాలత్రిపూర సుందరి శరన్నవరాత్రి వేడుకలు.. శ్రీ మహాలక్ష్మిదేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.. తెల్లవారుజామున నుండి ప్రారంభమైన కుంకుమ పూజలు..

* విశాఖ: నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం.. వివాదాస్పద అంశాలను అజెండాగా పెట్టుకోవడంతో కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ. ఎమ్మెల్యేలకు వ్యక్తిగత ప్రయోజనాలను చేకూర్చే అంశాలను అజెండాలో పాలకమండలి చేర్చడంపై ఆందోళనకు సిద్ధమైన విపక్షాలు.. వందల కోట్ల TDRలపై నిలదీయనున్న విపక్షాలు.

* తూర్పు గోదావరి జిల్లా : నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. చాగల్లు మండలం చాగల్లు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (147వ రోజు) నిర్వహిస్తారు. చాగల్లు సచివాలయం -5లో మీనానగరంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు రూరల్ మండలం కుమారదేవంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు టౌన్ లో పరిమి కళ్యాణ మండపంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు. చాగల్లు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం(147వ రోజు) నిర్వహిస్తారు.

* విజయనగరం: బండారు వీధిలో కామాక్షమ్మ కోవెలలో నేడు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఎన్ సి ఎస్ రోడ్డులో గాయత్రీ దేవి ఆలయం దేవీ నవరాత్రులు ఉత్సవాల్లో పాల్గొంటారు. రింగ్ రోడ్డు రైతు బజార్ సమీపంలో నూతనంగా వేసిన బీటీ రోడ్డును నేడు ప్రారంభించనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.

* విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు.. ఐదవ రోజు లలితా త్రిపురసుందరి అవతారంలో రాజశ్యామల అమ్మవారు

* అనంతపురం: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ వైద్యశాల ను ప్రారంభించనున్న ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి.

* గుంటూరు: ఓ పి ఎస్ సాధనకై యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నేటి నుండి జిల్లా స్థాయి నిరవధిక దీక్షలు.

* ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులపై నేడు జడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం..

* గుంటూరు: రేపు పట్టాభిపురం ముస్లిం షాది ఖానాలో, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో, జాబ్ మేళా…

* బాపట్ల: నేడు రేపల్లెలో, సామూహిక జగనన్న గృహప్రవేశాల కార్యక్రమం, హాజరుకానున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు.

* గుంటూరు: ఈనెల 21న తెనాలి కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్..

* భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్య సన్నిధిలో ఘనంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. నవరాత్రుల్లో భాగంగా నేడు ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.

Exit mobile version