* ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023: నేడు భారత్‌తో తలపడనున్న పాకిస్థాన్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ .. ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరగగా.. ఏడింట్లోనూ విజయం సాధించిన టీమిండియా..
* ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023: నేటి భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కి తుది జట్లు (అంచనా).. భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/ఇషాన్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్/షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.. పాకిస్థాన్: బాబర్ (కెప్టెన్), అబ్దుల్లా, ఇమామ్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తిఖార్, షాదాబ్, నవాజ్, షాహీన్, హసన్ , రవుఫ్.
* తిరుమల: ఇవాళ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. సాయంత్రం మాడవీధులలో ఉరేగునున్న శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. రేపు ఉదయం బంగారు తిరుచ్చి పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. రేపు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై ఉరేగునున్న శ్రీవారు.
* తిరుమల: ఇవాళ, రేపు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారిచేసే టోకెన్లు రద్దు చేసిన టీటీడీ..
* తిరుమల: ఇవాళ నుంచి 23వ తేది వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.
* తూర్పుగోదావరి జిల్లా : 36వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గత నెల 9వ తేదీన అరెస్టైన చంద్రబాబు.. ఈనెల 19వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్
* తిరుమల: ఒకే సంస్థ, ఒకే వెబ్ సైట్, ఒకే మొబల్ యాప్ లక్ష్యంతో టీటీడీ వెబ్ సైట్ పేరు మార్పు .. ప్రస్తుతం వున్న tirupatibalaji.ap.gov.in బదులుగా ttdevasthanams.ap.gov.in గా మార్చిన టీటీడీ
* తిరుమల: ఈ నెల 19వ తేదీన గరుడ వాహన సేవ.. షెడ్యూల్ సమయం కంటే అరగంట ముందుగానే గరుడ వాహన సేవ.. సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభం కానున్న గరుడ వాహన సేవ.. 19వ తేదీన ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల అనుమతి నిలిపివేయనున్న టీటీడీ.
* అమరావతి: నేడు, రేపు ఏపీలో ఎస్సై పరీక్షలు నిర్వహించనున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పరీక్ష సమయానికి గంట ముందు కేంద్రంలో ఉండాల్సిందిగా సూచన.
* ప్రకాశం : పెద్దారవీడు మండలం గొబ్బురులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* బాపట్ల : చీరాల టీటీడీ కళ్యాణ మండపంలో మాజీ మంత్రి పాలేటి రామారావు వినూత్నంగా 11వ మరణ దినోత్సవ వేడుకలు..
* ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
* ప్రకాశం : గిద్దలూరులో బీసీ జన గణన, చట్ట సభల్లో బీసీ మహిళలకు ప్రాధాన్యత అంశాలపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాకాత్ కానున్న కుటుంబ సభ్యులు.. నిన్న అనివార్య కారణాలతో ములాకాత్ ను రద్దు చేసుకుని ఈ రోజు వెళ్లనున్న కుటుంబ సభ్యులు.. భువనేశ్వరీతోపాటు ములాకాత్ కు వెళ్లనున్న నారా లోకేష్, బ్రాహ్మణి .. సాయంత్రం 4 గంటలకు ములాకాత్
* ఏలూరు: నేడు, రేపు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల ఫైనల్ పరీక్షలు.. ఏలూరులో మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలు..
* పశ్చిమ గోదావరి: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన వివరాలు.. ఉదయం 10:00 గంటలకు తణుకు పట్టణంలోని సజ్జాపురం లో “బీసీ వెల్ఫేర్ అడ్వైజరీ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 3:00 గంటలకు ఇరగవరం మండలం రాపాక గ్రామం నందు 122 రోజు జరుగు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొంటారు.
* పశ్చిమ గోదావరి: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. ఉదయం 10 గంటలకు పెంటపాడు ఎస్ టి వి ఎన్ హిందూ హైస్కూల్లో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్ క్యాంపు ను సందర్శిస్తారు.
* అనంతపురం : గుంతకల్ పట్టణంలోని 33 కెవి విద్యుత్ సబ్స్టేషన్ లో మరమత్తుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం.
* అనంతపురం : తాడిపత్రిలో ఈనెల 19 న పండ్లతోటల ర్తెతు సంఘం రాష్ట్ర సదస్సు.
* అనంతపురం : నగరంలో నేటి నుంచి సీఐటీయూ రాయలసీమ ప్రాంతీయ సమావేశాలు.
* విశాఖ: నేడు, రేపు జరగనున్న ఎస్‌ఐ మెయిన్స్ రాత పరీక్ష.. జిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షలు రాయనున్న 11,365 మంది అభ్యర్థులు.. వీరిలో 9,913 మంది పురుషులు, 1452 మంది మహిళలు ఉన్నారు.
