Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ 2023: నేడు న్యూజిలాండ్‌తో బంగ్లాదేశ్ ఢీ.. చెన్నైలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌..

* అమరావతి: ఆరోగ్య శాఖపై సమీక్ష చేయనున్న సీఎం జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ జరుగుతున్న తీరును సమీక్ష చేయనున్న సీఎం జగన్‌.. కొత్త మెడికల్ కాలేజీల పనుల పురోగతి, హాస్పిటళ్ళల్లో నాడు -నేడు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పై సమీక్ష

* భారత్‌-పాకిస్థాన్‌ మధ్య రేపు హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢీ.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌.. ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌ గడ్డపై పాకిస్థాన్‌తో మ్యాచ్‌

* ఢిల్లీ: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రానున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్‌

* నేడు బీఆర్ఎస్‌లో చేరనున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి.. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొనున్న శశిధర్ రెడ్డి.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్ పేటలోని స్వగృహంలో చేరిక కార్యక్రమం

* తూర్పుగోదావరి జిల్లా: 35వ రోజుకు చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్ట్‌.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ చీఫ్‌.

* రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో నేడు కుటుండ సభ్యుల ములాకత్‌.. నారా భువనేశ్వరీతో పాటు ములాకత్ కు వెళ్లనున్న టీడీపీ నాయకులు.. సాయంత్రం 4 గంటలకు ములాకత్

* నెల్లూరులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయ సాయి రెడ్డి పర్యటన.. నెల్లూరు సిటీ.. ఉదయగిరి.. సర్వేపల్లి.. కావలి నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న సాయిరెడ్డి

* నెల్లూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని వీఆర్ కళాశాల మైదానంలో జరిగే సింహపురి సేంద్రీయ మేళాను ప్రారంభిస్తారు. అనంతరం తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సర్వేపల్లి నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణు

* తిరుమల: రేపు నవరాత్రి బ్రహ్మోత్సవాలుకు అంకురార్పణ.. రేపు సాయంత్రం మాడవీధులలో ఉరేగునున్న శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు.. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఎల్లుండి ఉదయం బంగారు తిరుచ్చీ మాడవీధులలో ఉరేగునున్న శ్రీదేవీ భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఎల్లుండి సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న స్వామివారి వారి వాహన సేవలు

* ప్రకాశం : పామూరులో జగనన్నకు చెబుదాం పేరిట ప్రత్యేక స్పందన కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ దినేష్ కుమార్..

* ప్రకాశం : ఒంగోలు అంబేడ్కర్ భవన్ లో సీపీఎం ఆధ్వర్యంలో నేటి విద్యా రంగం, ప్రత్యామ్నాయ విధానం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు.. హాజరుకానున్న పలువురు ముఖ్య నేతలు..

* అనంతపురం : నేటి నుంచి ఏపీ అంతర జిల్లాల టేబుల్ టెన్నిస్ స్టేట్ ఛాంపియన్ షిప్ – 2023 పోటీలు.

* శ్రీ సత్యసాయి : చెన్నేకొత్తపల్లి మండలంలోని ప్యాదండి లో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

* శ్రీ సత్యసాయి : ఈనెల 15 నుంచి కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దసరా వేడుకలు.

* నేడు గుంటూరులో పర్యటించనున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు.. డాక్టర్ కాసరనేని సదాశివరావు శతజయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం పలు రంగాల్లో నిష్ణాతులకు అవార్డులు ప్రదానం చేయనున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

* నేటి మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. ఉదయం 10 గంటలకు విజయవాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులను సహచర కమిటీ సభ్యులతో కలిసి పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్ క్యాంపును సందర్శిస్తారు.. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెదతాడేపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.

* తిరుమల: భక్తుల రద్దీ దృష్యా ఇవాళ, రేపు, ఎల్లుండి తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసిన టీటీడీ

* తిరుమల: ఎల్లుండి నుంచి తొమ్మిది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.

* తిరుపతి: గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేదాంత దేశికర్‌ ఆలయంలో అక్టోబ‌రు 14 నుండి 23వ తేదీ వ‌ర‌కు సాల‌క‌ట్ల ఉత్సవం

* నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత ఆంజనేయులు సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు

* అల్లూరి: ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగ మంచు.. పాడేరు 17, మినునులురు 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు..

* విశాఖ: కోడికత్తితో దాడి కేసులో నేడు NIA కోర్టులో విచారణకు హాజరుకానున్న నిందితుడు శ్రీనివాస్

* తిరుమల: 22 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,937 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,101 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు

Exit mobile version