* ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023: నేడు ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీ.. లక్నో వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్
* నేడు సామర్లకోటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. సామర్లకోట ఈటీసీ లేఅవుట్‌లో సామూహిక గృహప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం.. పైలాన్‌ను ఆవిష్కరించనున్న సీఎం జగన్.. సామర్లకోట ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్
* ఏలూరు: నేడు చేబ్రోలులో జగనన్న ఇళ్ల “గృహోత్సవాలు’ సామర్లకోట నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్.. జిల్లాలో తొలివిడతగా 25 వేల 325 ఇళ్ల నిర్మాణాలు పూర్తి.. చేబ్రోలులో పాల్గొననున్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు..
* ఏపీ: ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు విచారణ
* తిరుమల: ఎల్లుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు.
* శ్రీకాకుళం: ఆమదాలవలసలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పర్యటన.. ఉదయం 10 గంటలకు ఆముదాలవలస మండలం వేదుర్లవలస గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచి నీటికి శంకుస్థాపన కార్యక్రమం పాల్గొంటారు.. ఉదయం 10.30 గంటలకు కత్యచర్యుల పేట గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచి నల్లా కనెక్షన్‌కు శంకుస్థాపన అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు.. ఉదయం 11 గంటలకు ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని మోనింగి వారి వీధి అర్బన్ హెల్త్ సెంటర్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పొందూరు మండలం సింగూరు గ్రామాoలో , జలజీవన్ మెషిన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి కార్యక్రమానికి శంఖుస్థాపన మరియు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి నేడు వెంకటాచలంలో జరిగే జగనన్న కాలనీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు
* నెల్లూరులో నేడు కోవూరు, నెల్లూరు రూరల్, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. పాల్గొననున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. నెల్లూరు లోక్ సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి..
* నెల్లూరులోని పుర మందిరంలో జాతీయ లైవ్ స్టాక్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
* విజయనగరం: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో నిర్మించిన ఇళ్లలో నేడు సామూహిక గృహ ప్రవేశాలు.. బొబ్బిలిలో సామూహిక గృహప్రవేశాలకార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ఎస్.వి. చిన అప్పలనాయుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తదితరులు..
* నేడు విశాఖ వేదికగా జాయింట్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ మీటింగ్.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో పాల్గొనున్న వివిధ రాష్ట్రాల డీజీపీలు, సీనియర్ అధికారులు. ఏపీ నుంచి హాజరవుతున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల వ్యక్తి గత సమాచారం మార్పిడి, కేసుల ఛేదనలో పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించనున్న ఉన్నత స్థాయి సమావేశం
* అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత.. పాడేరులో 16, మినుములురులో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.. హెడ్ లైట్ల వెలుతురులో వాహనాల రాకపోకలు…
* అనంతపురం జిల్లాలో నేడు సామూహిక గృహప్రవేశాలు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె జగనన్న కాలనీలో జిల్లా స్థాయి గృహప్రవేశాల కార్యక్రమం.
* అనంతపురం : కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని తీసుకొచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఆధ్వర్యంలో సంతకాలసేకరణ కార్యక్రమం.
* పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన.. తణుకు మండలం, దువ్వ గ్రామం (ముద్దాపురం రోడ్డు) లో ఉన్న “దువ్వ లేఅవుట్” నందు జరుగు “గృహోత్సవాలు” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. తణుకు పట్టణంలోని Govt. బాయ్స్ హై స్కూల్ నందు జరుగు “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమానికి మంత్రి హాజరవుతారు.
* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణ పరిధిలోని గూబనపల్లి గ్రామ సమీపంలో జగనన్న హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* తూర్పుగోదావరి జిల్లా : నేడు 34వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. ఈనెల 19వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్
* పశ్చిమగోదావరిలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. ఉదయం 11 గంటలకు నల్లజర్ల రోడ్డులోని మున్సిపల్ పార్కులో జరిగే “కాపు నేస్తం” బహిరంగ సభ లో పాల్గొంటారు.
* ప్రకాశం : చీమకుర్తి మండలం కేవీ పాలెంలో జగనన్న లేఅవుట్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్న ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మాగుంట శ్రీనివాసుల రెడ్డి
* బాపట్ల : వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయితీ లోని కొణిజేటి చేనేతపురి కాలనీలో జరిగే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ..
* ప్రకాశం : ఒంగోలు పీటీసీ లో ఏపీఎస్ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్స్ పాసింగ్ ఔట్ పరేడ్, హాజరుకానున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు..
* ప్రకాశం : ఒంగోలు లోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం, హాజరుకానున్న మంత్రులు మేరుగ నాగార్జున, అదిమూలపు సురేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు..
* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. తాళ్లపూడి మండలం తాళ్లపూడి హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహించు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు మండలం కాపవరం జగనన్న హౌసింగ్ లే అవుట్ లో గృహోత్సవాలు కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో నిర్వహించు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడి పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం(141వ రోజు) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
* నంద్యాల: నేడు శ్రీశైలంలో త్రిఫలవృక్షం వద్ద దత్తాత్రేయస్వామికి విశేషాభిషేకం, ప్రత్యేక పూజలు
* నేడు బీజేపీలో చేరనున్న మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్.. రామగుండం నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి.. ఇటీవలే బీఆర్ఎస్ కి రాజీనామా..
* తిరుమల: 12 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,230 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,388 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు