Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ 2023: బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఢీ.. ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌

* మహబూబ్ నగర్: నేడు దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణ పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన.. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న బీఆర్ఎస్‌ అధినేత

* అమరావతి: ఈ రోజు జగనన్న సురక్షా క్యాంపెయిన్‌పై కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశం కానున్న సీఎం జగన్

* రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన.. ఉదయం 10.00 గంటలకు సిరిసిల్ల తెలంగాణభవన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్ వింగ్ ను ప్రారంభిస్తారు. ఉదయం 10.30 గంటలకు తెలంగాణభవన్ లో పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు వేములవాడ పట్టణంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు .. మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.

* తిరుమల: 7 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,389 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,466 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు

* అమరావతి: వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే 9.. ఈ రోజు బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలు.. గాజువాక- విశాఖపట్నం జిల్లా, కాకినాడ రూరల్ – కాకినాడ జిల్లా, మార్కాపురం – ప్రకాశం జిల్లా

* నేడు కాకినాడలో వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్ర.. సర్పవరం జంక్షన్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

* ప్రకాశం : మార్కాపురంలో సామాజిక, సాధికారిక బస్సు యాత్ర కార్యక్రమం.. ముఖ్య అతిధులుగా పాల్గొననున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ వై విజయసాయిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి పార్థసారథి, రాష్ట్ర మైనారిటీ నాయకులు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.. లాయర్లు, టీచర్స్, ఐటీ ఉద్యోగులు, బీసీ, ఎస్సీ నేతలతో సమావేశం.. మీడియా సమావేశం.. పూల సుబ్బయ్య కాలనీలో బీసీ భవన్ శంకుస్థాపన కార్యక్రమం.. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద బహిరంగ సభ…

* విశాఖ: నేడు గాజువాకలో సామజిక చైతన్ బస్సు యాత్ర.. పాల్గొనున్న మంత్రులు

* ప్రకాశం : ఒంగోలు వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్ పాదయాత్ర చేపట్టి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం : పామూరు మండలం మోపాడు వద్ద రిజర్వాయర్ ఆయకట్టు రైతులతో నీటి పారుదల శాఖ అధికారుల సమావేశం..

* కోనసీమ ను అతలాకుతలం చేసిన అతి పెద్ద తుపాన్ వచ్చి నేటికి 27 ఏళ్ళు పూర్తి.. సుమారు 215 కిలో మీటర్ల వేగం తో వీచిన గాలులు, ప్రాణాలు కోల్పోయిన 1077 మంది.. 78 సెంటిమీటర్ల వర్షపాతంతో నాశనం అయిన 40 వేలుకి పైగా ఇళ్లు, నిరాశ్రయులయిన 2.33 లక్షలు కుటుంబాలు

Exit mobile version