NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* తిరుమలలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఉదయం 8 గంటలకు శ్రీవారి దర్శించుకోనున్న ప్రధాని

* ఇవాళ ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. దర్శనాంతరం తిరిగి శ్రీరచనా అతిధి గృహానికి చేరుకోనున్న ప్రధాని.. అల్పాహరం స్వీకరించిన అనంతరం ఉదయం 9:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరనున్న మోడీ.. అక్కడి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని

* తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్‌లో విజయ సంకల్ప సభ, మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌ విజయ సంకల్ప సభలో పాల్గొననున్న ప్రధాని, సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచి కాచిగూడ వరకు నరేంద్ర మోడీ రోడ్‌ షో.. సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ

* నేడు నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటన.. షాద్‌నగర్‌, చేవెళ్ల, సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. జహీరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి హరీష్

* మంచిర్యాల: ఇవాళ చెన్నూర్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో.. 12.30 గంటలకు చెన్నూర్ కు కేటీఆర్.

* మంచిర్యాల కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. జిల్లా కేంద్రం రోడ్ షో లో పాల్గొననున్న కేంద్ర మంత్రి.

* ఆదిలాబాద్ కు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ ..

* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ తరుపున మంద కృష్ణ మాదిగ రోడ్ షో..

* నేడు బాసరకు కాంగ్రెస్ నేత థాక్రే

* భద్రాద్రి: ఇల్లందులో ఈ రోజు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రోడ్ షో.. పాల్గొనున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అభ్యర్థి కోరం కనకయ్య

* నేడు మెదక్ జిల్లాలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన.. నర్సాపూర్ లో సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభలో పాల్గొననున్న ఖర్గే

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం..

* ఒంగోలు లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మలిక గర్గ్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం..

* బాపట్ల : అద్దంకి మండలం శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజలు..

* తూర్పుగోదావరి జిల్లా: ఇవాళ కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కావడంతో రాజమండ్రిలోగోదావరి ఘాట్లలో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు , .తెల్లవారుజాము నుంచి వేలాదిగా తరలివచ్చి కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

* అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం పుష్కర్ ఘాట్లో గోదావరి నదికి ప్రత్యేకంగా పౌర్ణమి హారతి

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి కోటిలింగాల ఘాట్ లో లక్షద్వీపోత్సవం.. సిసిసి ఛానల్, పంతం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగునున్న లక్ష దీపోత్సవం

* గుంటూరు: కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు.. కోటప్పకొండ, అమరావతి ఆలయాల్లో భక్తుల కిటకిట.. సూర్యలంక తీర ప్రాంతంలో సముద్ర స్నానాలకు భారీగా హాజరైన భక్తులు.

* విశాఖ: నేటి నుంచి ఉత్తరాంధ్రలో ఎన్నికల జాబితా పరిశీలకులు జె. శ్యామల రావు పర్యటన.. జిల్లాలో పలు నియోజక వర్గాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. పోలింగ్ కేంద్రాలను, ఓటర్ల జాబితాలను తనిఖీ చేస్తారు.

* నేటి నుండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం.. ఉదయం 10:19 నిమిషాలకు రాజోలు నియోజకవర్గం పొదలాడ నుండి తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్న లోకేష్.. పొదలాడలో పాదయాత్ర ప్రారంభమై తాటిపాకలో బహిరంగ సభ, 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్న నారా లోకేష్. రేపు అమలాపురం చేరుకోనున్న యువగళం పాదయాత్ర

* తూర్పు గోదావరి జిల్లా: నేడు మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (168వ రోజు) నిర్వహిస్తారు. రాజమండ్రి సిటీ లో వెటర్నరీ ఏరియా ఆసుపత్రి వద్ద వెటర్నరీ భవనాన్ని ప్రారంభిస్తారు. చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో రేడియో రూం వద్ద జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు. కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (168వ రోజు) నిర్వహిస్తారు.

* తిరుపతి: తాడిపత్రిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన..

* తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పర్యటన

* తిరుమల: 13 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,350 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,500 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు

* అనంతపురం : తాడిపత్రి లో సామాజిక సాధికార యాత్ర.. పాల్గొననున్న జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్.

* శ్రీ సత్యసాయి : హిందూపురం నియోజకవర్గంలో నేటి నుంచి రెండు పాటు పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి.. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి కనుమ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరిగే కార్తిక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొననున్న వసుంధర.

* ప.గో: కార్తీక రెండో సోమవారం సందర్భంగా పాలకొల్లు భీమవరం పంచారామాల్లో పోటెత్తిన భక్తులు.. స్వామి వారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు.

* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..

* నంద్యాల: మహానంది లో కార్తిక పౌర్ణమి సందర్భంగా నేడు సామూహిక మహా రుద్రాభిషేకం, కేదారేశ్వర వ్రతం.. ప్రథమనంది క్షేత్రంలో కార్తిక సివోత్సవం, మహా రుద్రాభిషేకం, ప్రముఖుల ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాలు

* కర్నూలు: నేడు ఏపీఎస్పీ గ్రౌండ్ లో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం

* నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో కావలి నియోజకవర్గ బీసీ నేతల సమావేశం

* నెల్లూరులోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం..

* నెల్లూరు: కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరులోని సత్సంగ్ ఆధ్వర్యంలో ఏకాదశ రుద్ర మహాభిషేకం..

* కర్నూలు: మంత్రాలయంలో కార్తీక శోభ సంతరించుకున్న తుంగ తీరం.. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు చేసి దీపాలు వెలిగించిన భక్తులు.. భక్తులతో కిక్కిరిసిన తుంగతీరం.

* నంద్యాల : శ్రీశైలం కార్తీక రెండవ సోమవారం పౌర్ణమి కావడంతో మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తజనం .. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి, క్యూలైన్లో వేచి ఉన్న వేలాదిమంది భక్తులు దర్శనానికి సుమారు 4 గంటల సమయం

* కర్నూలు: మంత్రి జయరాం తాడిపత్రి లో బస్సు యాత్ర లో పాల్గొంటారు..

* అనంతపురం : మంత్రి ఉషశ్రీ చరణ్ తాడిపత్రిలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొంటారు.

* శ్రీకాకుళం: నేడు ఎచ్చెర్ల నియోజకవర్గం సామాజిక సాధికార బస్సుయాత్ర . పాల్గొననున్న స్పీకర్ , మంత్రులు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం(పొందూరురోడ్డులో) బహిరంగ సభ.

* శ్రీకాకుళం: నేడు స్పీకర్‌ తమ్మినేని సీతారాం పర్యటన వివరాలు.. ఉదయం 7.30 గంటలకు ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యుల పేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 3 గంటలకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర లో పాల్గొంటారు