* నేడు నాలుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం.. మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి, ములుగులో బీఆర్ఎస్ సభలు
* నేడు, రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన.. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తి, 1.30కి హుస్నాబాద్, సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక.. రాత్రి ఖమ్మంలో బస.. రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరు, మధ్యాహ్నం 1:30కి సత్తుపల్లి, మధ్యాహ్నం 2.40 నుండి 3.30 వరకు మధిర ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక.
* నేడు తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మధ్యాహ్నం 1.10 నుండి 1.40 వరకు ఆర్మూర్ లో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొననున్న అమిత్ షా.. 3.10 నుండి 3.40 రాజేంద్రనగర్ నియోజక వర్గంలో, 4.30 నుండి 5.10 శేరిలింగంపల్లి నియోజక వర్గంలో, 5.30 నుండి 6.10 అంబర్ పేట నియోజక వర్గంలో రోడ్ షోలలో పాల్గొననున్న అమిత్ షా
* నేడు నాలుగు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారి ఎన్నికల ప్రచారం.. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్న రేవంత్.. ఉదయం 11 గంటలకు నకిరేకల్, మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి, మధ్యాహ్నం 2 గంటలకు ఆలేరు బహిరంగసభల్లో పాల్గొననున్న పీసీసీ చీఫ్.. మధ్యాహ్నం 3.30కి కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి మాసానికి సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
* అమరావతి: నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన.. సీఎం స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్న సీఎం జగన్
* అమరావతి నేడు పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (PADA) పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం
* అమరావతి: నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర డే- 20.. బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలు.. 1. పాలకొండ- పార్వతీపురం మన్యం జిల్లా, 2. శ్రీశైలం – నంద్యాల జిల్లా, 3. జగ్గయ్యపేట- NTR జిల్లా
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రోడ్ షో లో పాల్గొననున్న కేటీఆర్
* ప్రకాశం : దొనకొండలో ఇవాళ జరగాల్సిన ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దుచేసిన కలెక్టర్ దినేష్ కుమార్..
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కోనేరులో క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా తెప్పోత్సవ కార్యక్రమం.. అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు..
* బాపట్ల : చీరాలలో రైల్వే రంగాన్ని ప్రవేటికరించటాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ ముందు నిరసన కార్యక్రమం..
* తిరుమల: ఇవాళ కైశిక ద్వాదశి ఆస్థానం, మాడవీధులలో ఉరేగుతున్న ఉగ్రశ్రీనివాస మూర్తి, సూర్యోదయం లోపు పూర్తి కానున్న ఉరేగింపు, ఏడాదికి ఒక్కసారి ఆలయం నుంచి వెలుపలికి రానున్న ఉగ్రశ్రీనివాసమూర్తి
* నెల్లూరు రూరల్ పరిధిలోని జ్యోతి నగర్ లో 60 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట ప్రాంతంలో పర్యటించనున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
* విశాఖలో నేడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన.. మధ్యాహ్నం వైజాగ్ చేరుకోనున్న పవన్.. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బోట్ల యజమానులు, వాటిపై ఆధారపడ్డ మత్స్యకార్మికులతో సమావేశం. పార్టీ తరపున ఒక్కో బోటుకు రూ.50 వేల ఆర్ధిక సాయం అందించనున్న పవన్
* అనంతపురం : శింగనమల చెరువులో గ్రామ దేవతల తెప్పోత్సవం పాల్గొననున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
* ఏలూరు : నేడు ద్వారకాతిరుమల చిన వెంకన్న తెప్పోత్సవం.. స్వామివారి నృసింహ సాగర పుష్కరిణిలో తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..
* పశ్చిమ గోదావరి జిల్లా: రేపు భీమవరం శ్రీరాంపురం బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టు భవన ప్రారంభోత్సవం.. కార్యక్రమానికి హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణ మోహన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి. శేష సాయి ..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. చాగల్లు మండలం చాగల్లు గ్రామం నాల్గవ సచివాలయం నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (165 వ రోజు) లో పాల్గొంటారు. నెలటూరు గ్రామంలో సత్యనారాయణ స్వామి గుడి దగ్గర కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు టౌన్ సత్యవతి నగర్, ఏపీ ఫైబర్ నెట్ ఎదురుగా జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.
* ఢిల్లీ: జగన్ బెయిల్ రద్దుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన ఎంపీ రఘు రామకృష్ణ రాజు.. విచారణ జరపనున్న జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం.
* నంద్యాల: నేడు శ్రీశైలంలో అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లకు ఊయల సేవ, ప్రత్యేక పూజలు
* శ్రీకాకుళం: ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన.. ఆమదాలవలస మండలం అక్కులపేట పంచాయతీ పరిధిలో మండాది మరియు ఈసర్ల పెట గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు, మధ్యాహ్నం 3 గంటలకు పాలకొండ లో సామాజిక సాధికార బస్సు యాత్ర లో పాల్గొంటారు
* రెండు రోజుల పాటు తెలంగాణలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ పర్యటన.. నేడు, రేపు తెలంగాణ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్న డీకే శివకుమార్.. నేడు స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గం కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న డీకే శివకుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ . వర్ధన్నపేట నియోజక వర్గం లో తర్వాత వరంగల్ వెస్ట్ నియోజక వర్గాలలో ప్రచార సభల్లో పాల్గొని రాత్రి అంబర్ పేట నియోజక వర్గం కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న డీకే శివకుమార్.. 25న హైదరాబాద్ లోని పలు నియోజక వర్గాలలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలో పాల్గొననున్న డీకే.
* హైదరాబాద్: రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు ఉదయం 11 గంటలకు మేడ్చల్, సాయంత్రం 4 గంటలకు కార్వాన్ నియోజకవర్గం, సాయంత్రం 5 గంటలకు కంటోన్మెంట్‌లో జరగనున్న బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు.
* కొమరంభీం జిల్లా: నేడు జిల్లాకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి శాంతన్ సర్కార్ .. కాగజ్‌నగర్ మండలం నజురుల్ నగర్ విలేజి.నెం.2 కు ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న అసోం సీఎం.
* తిరుమల: 31 కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 45,503 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,096 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు
