* నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. జహీరాబాద్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత
* నేడు నిజామాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. నిజామాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన జేపీ నడ్డా.. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ అసెంబ్లీ మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం.
* నేడు తెలంగాణకు రానున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్.. ఖైరతాబాద్ సెగ్మెంట్ లో పాదయాత్ర నిర్వహించనున్న ప్రమోద్ సావంత్.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాదయాత్ర చేయనున్న గోవా ముఖ్యమంత్రి..
* నేడు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. మధ్యాహ్నం 12 గంటలకు సిరిసిల్లలో జరిగే పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మహిళా సమ్మేళనంలో పాల్గొననున్న స్మృతి ఇరానీ
* నేడు స్టేషన్ ఘనపూర్ వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా.. మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘనపూర్, 4 గంటలకు వర్ధన్నపేట లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న అర్జున్ ముండా.
* నేడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రామకోటిలో బీజేపీ కార్యకర్తల ఇంటల్ లెక్చువల్ సమావేశంలో పాల్గొననున్న కేంద్రమంత్రి పియూష్ గోయల్.
* నేడు కొత్త గూడెం, సూర్యాపేట, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే బీజేపీ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.
* నేడు మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం
* ప్రకాశం : దొనకొండలో రేపు కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం..
* ప్రకాశం : ఒంగోలు సుందరయ్య భవన్ లో ఫేక్ డాక్యుమెంట్స్ కేసుపై చర్యలు కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం..
* విశాఖ: నేడు ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద బాధితులకు 7. 11 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించనున్న ప్రభుత్వం… ఈ ఘటనలో 30 బోట్లు పూర్తిగాను, 18 బోట్లు పాక్షికంగాను దగ్ధమైనట్టు తేల్చిన ప్ర భుత్వం.. పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సీదిరి అప్పలరాజు, వైవీ సుబ్బారెడ్డి.
* విశాఖ: నేడు స్కూల్ ఆటోలపై RTA స్పెషల్ డ్రైవ్.. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే కేసులు పెట్టాలని ఆదేశాలు.. ఇప్పటి వరకు తనిఖీల్లో 28 వాహనాలు సీజ్ చేశామంటున్న ఆర్టీఏ
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు: కొడవలూరు మండలంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
* నెల్లూరులోని జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో సిటీ నియోజకవర్గ నేతల సమావేశం
* శ్రీసత్యసాయి : నేడు పుట్టపర్తిలో సత్యసాయి 98వ జయంతి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రశాంతి నిలయం.
* కాకినాడ: నేడు ప్రత్తిపాడులో వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర, హాజరుకానున్న పలువురు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోం మంత్రి,విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. చాగల్లు మండలం చాగల్లు గ్రామం చాగల్లు సచివాలయం – 4 నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం(164 వ)లో పాల్గొంటారు.. చాగల్లు మండలం మినానగరం గ్రామం నందు వైఎస్సార్ రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.. చాగల్లు గ్రామం నాల్గొ సచివాలయం నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (164 వ ) రోజు లో పాల్గొంటారు..
* శ్రీ సత్యసాయి : తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామం నందు నేడు పరిటాల రవీంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం. పాల్గొననున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు.
* తిరుమల: ఇవాళ్టి నుంచి అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం
* తిరుమల: 5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,891 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 22,896 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు
* తిరుమల: ఈ నెల 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. 26న రాత్రి తిరుమల చేరుకోనున్న ప్రధాని మోడీ, రాత్రికి శ్రీరచనా అతిధి గృహంలో బస చేయనున్న నరేంద్ర మోడీ, 27వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని మోడీ.. అనంతరం తెలంగాణకు మోడీ.
* అమరావతి: నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
* నేడు కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు.
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డిలో, సదాశివపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి హరీష్
* నేడు సిద్దిపేట జిల్లాలో ఈటల రాజేందర్ పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఈటల
* అమరావతి: నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్ధిక సహాయం.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ .
