* శ్రీ సత్యసాయి : నేడు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం.. సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వేడుకలు.. ముఖ్యఅతిథిగా పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ . 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పతకాలు అందజేయనున్న యూనివర్సిటీ.. భారీ బందోబస్తు ఏర్పాటు
* నేడు ఐదు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. నిజామాబాద్ రూరల్, నారాయణ్ ఖేడ్, గజ్వేల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్.. ఉ. 11 గంటలకు నిజామాబాద్ రూరల్ బహిరంగసభ, మధ్యాహ్నం 12.30 గంటలకు నారాయణ్ ఖేడ్ బహిరంగసభ, మధ్యాహ్నం 2 గంటలకు గజ్వేల్ బహిరంగసభ, సాయంత్రం 4.30 గంటలకు కూకట్ పల్లి రోడ్ షో, సాయంత్రం 6 గంటలకు శేరిలింగంపల్లి రోడ్ షో
* నేడు నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు.. మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో రోడ్‌షోలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
* అమరావతి: నేడు వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే -18.. బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలు.. ఒంగోలు- ప్రకాశం జిల్లా, విశాఖపట్నం సౌత్- విశాఖ జిల్లా, బనగానపల్లె – నంద్యాల జిల్లా
* నేడు సిద్దిపేట, మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం.. నియోజకవర్గంలోని మిరుదొడ్డి, అక్బర్ పేట్- భూoపల్లి, నార్సింగి మండలాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* నేడు సిద్దిపేట జిల్లాలో బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పర్యటన.. దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండలంలో ఎన్నికల ప్రచారం చేయనున్న ఈటల
* నేడు సిద్దిపేట జిల్లాలో MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటన.. దుబ్బాకలో బీజేపీకి మద్దతుగా రోడ్ షో లో పాల్గొననున్న మందకృష్ణ
* ప్రకాశం : ఒంగోలులో సామాజిక, సాధికార యాత్ర, హాజరుకానున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, విడదల రజనీ..
* ప్రకాశం : ఒంగోలులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడులో యూత్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* నెల్లూరు: కోవూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
* తిరుమల: రేపటి నుంచి అలిపిరి వద్ద శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.. ఇవాళ్లి నుంచి ఆఫ్ లైన్ విధానంలో టికెట్ల విక్రయాలు ప్రారంభం
* కాకినాడ: రత్నగిరికి పెరిగిన భక్తుల తాకిడి.. వరుసగా ఆరు రోజులు పర్వ దినాలు ఉండడంతో అర్ధరాత్రి నుంచి దర్శనము, వ్రతాలకి అనుమతి.. సుమారు 30 వేలు వ్రతాలు జరుగుతాయని అంచనా
* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో మహా చండీయాగం. పవన్ కల్యాణ్‌కు రాజ్యాధికారం రావాలని, ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యాగానికి ఏర్పాట్లు. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు.
* అనంతపురం : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ లో నేడు వ్తెఎస్సార్ విగ్రహా ఆవిష్కరణ. హాజరు కానున్న వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఎంపీ మాధవ్ , ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.
* అనంతపురం : నేడు బొమ్మనహాళ్ లో జగనన్నకు చెబుదాం కార్యక్రమం. పాల్గొననున్న జిల్లా కలెక్టర్ గౌతమి.
* విశాఖ: నేడు విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర. పాల్గొననున్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రి వేణు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
