Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఖమ్మం: నేడు మధిర, వైరాలో బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశీర్వాద సభలు

* అమరావతి: నేడు సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్.. వాకాడు మండలం రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన.. 94 కోట్లతో పులికాట్ సరస్సు సముద్ర ముఖద్వారం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్, ONGC పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని బాధితులకు ఆర్ధిక సహాయం

* నేడు నాలుగు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ ఎన్నికల ప్రచారం.. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం 12గంటలకు వనపర్తి బహిరంగసభ, మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూల్ బహిరంగసభ, మధ్యాహ్నం 3.30 గంటలకు అచ్చంపేట బహిరంగసభ, సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ షోలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.

* అమరావతి: నేడు ఢిల్లీకి టీడీపీ బృందం.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం. ఓటర్ల జాబితాలో వైసీపీ చేస్తున్న అక్రమాలు, ఫాం-6, 7 అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ. ఢిల్లీకి వెళ్లే టీడీపీ నేతల బృందంలో యనమల, అచ్చెన్న, పయ్యావుల,

* నేడు సిద్దిపేట జిల్లాలో ఈటల రాజేందర్ పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఈటల రాజేందర్

* నేడు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి కేటీఆర్ పర్యటన.. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో

* నేడు మెదక్ జిల్లాలో సినీ నటి, టీ-కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ విజయశాంతి పర్యటన.. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ కి మద్దతుగా రోడ్ షోలో పాల్గొననున్న విజయశాంతి

* సిద్దిపేట జిల్లా కోహెడ చిగురుమామిడి అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు

* ప్రకాశం : ఒంగోలులో ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ పర్యటన.. ఓటర్ల జాబితా ప్రక్రియపై ఎరార్వో లు, ఏఈఆర్ఓ లతో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం.. పోలింగ్ కేంద్రాలను సందర్శించే అవకాశం..

* ప్రకాశం : ఒంగోలులో రేపు సామాజిక, సాధికార యాత్ర, హాజరుకానున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, విడదల రజనీ..

* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి..

* తిరుమల: ఎల్లుండి నుంచి అలిపిరి వద్ద శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభం

* తిరుమల: 21 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,198 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,452 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు

* కాకినాడ: నేడు మత్స్యకారులకు ఓఎన్జీసీ పరిహారం తిరుపతి నుంచి డీబీటీ ద్వారా అందించనున్న సీఎం జగన్.. ఉమ్మడి జిల్లాలో 23458 మందికి 161.86 కోట్లు లబ్ది.. తాళ్లరేవు మండలం కోరంగిలో జరిగే మత్స్యకార భరోసా వేడుకల్లో పాల్గొనున్న మంత్రులు ఎమ్మెల్యేలు

* శ్రీ సత్యసాయి : మున్సిపల్ అధికారుల వ్తెఖరికీ నిరసనగా హిందూపురంలో మార్కెట్ బంద్  ప్రకటించిన వ్యాపారులు

* అనంతపురం : శెట్టూరు మండల పరిధిలోని కైరేవు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయంను, రైతు భరోసా కేంద్రంను, ఆరోగ్య ఉపకేంద్రంను ప్రారంభించనున్న మంత్రి ఉషాశ్రీచరణ్.

* తూర్పు గోదావరి జిల్లా : నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. ఆకివీడు మండలం చినిమిల్లిపాడు లోని సీబీసీఎన్ సీ బాప్టిస్ట్ చర్చ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కొవ్వూరు టౌన్ లోని నందమూరు రోడ్డులో పెరుమాళ్ల ఉమా గార్డెన్స్ లో జరిగే ఆర్య, వైశ్య సంఘం వారి వన సమారాధనలో పాల్గొంటారు.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తడ మండలం మాంబట్టులో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో పాల్గొంటారు.

* నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన నిర్మాణ పనులకు సంబంధించి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

* పశ్చిమ గోదావరి: భీమవరం పంచారామ క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు.. కార్తీక మాసం రెండవ మంగళవారం( నవమి) సందర్భంగా స్వామివారికి అభిషేకాలు.. స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

* తిరుపతి జిల్లా: నేడు తడ మండలంలోని మాంబట్టులో జరిగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్.. వాకాడు మండలం రాయదొరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన.. పులికాట్ సరస్సు ముఖ ద్వారం పునరుద్ధరణ పనులకు శ్రీకారం.. రూ. 35 కోట్లతో కాలంగి నదిపై నాలుగు లైన్ల వంతెన …రూ.20 కోట్లతో కాలంగి గ్రాయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

* సూళ్లూరుపేట లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవం..

* అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.

* శ్రీకాకుళం: శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేటి కార్యక్రమాలు.. ఉదయం 7.30 గంటలకు పొందూరు మండలం కేశవదాస్ పురం భగవాన్ దాస్ పేట గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు

* నంద్యాల: నేడు శ్రీశైలంలో నందీశ్వరస్వామికి విశేషాభిషేకం, ప్రత్యేక పూజలు

* కర్నూలు: నేడు పత్తికొండలో శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి వారికి సుప్రభాత సేవ, అభిషేకాలు , మంగళ హారతి, తులసి అర్చన, ప్రత్యేక పూజలు.

Exit mobile version