Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* జనగామ జిల్లా: నేడు ఉదయం 11 గంటలకు జనగామకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ మైదానంలో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొననున్న అమిత్ షా.. హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు.

* ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌

* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన..

* గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న మంత్రి హరీష్ రావు

* నేడు నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.. నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్ బహిరంగసభ, మధ్యాహ్నం 3 గంటలకు పరకాల బహిరంగసభ, సాయంత్రం 6 గబటలకు ఖైరతాబాద్ రోడ్ షో, రాత్రి 8 గంటలకు నాంపల్లి రోడ్ షోలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.

* ప్రకాశం : ఒంగోలులో బీజేపీ కార్యవర్గ సమావేశం, హాజరుకానున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు ముఖ్య నేతలు..

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం, హాజరుకానున్న కలెక్టర్ దినేష్ కుమార్..

* ఒంగోలు లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం, హాజరుకానున్న ఎస్పీ మలిక గర్గ్..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయనున్న కోటేశ్వర్ రెడ్డి.. హాజరుకానున్న మంత్రి కాకాణి. ఎంపీలు ఆధాల ప్రభాకర్ రెడ్డి.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో పంటలకు సాగునీటిని విడుదల చేయనున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

* అనకాపల్లి జిల్లా: నేడు యలమంచిలి నియజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. అచ్చుతాపురం మండల కేంద్రంలో బహిరంగ సభ.. పాల్గొననున్న రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు…..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నాస్నానఘట్టాలు.. కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతోవేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. భక్తుల పుణ్య స్నానాలతో కిక్కిరిసిన పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్. స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నా భక్తులు

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి డిసెంబర్ 2 వరకు జగన్ గద్దె దిగాలని సిపిఐ జన చైతన్య యాత్ర .. మోడీ, జగన్ తో రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ప్రతి ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించనున్న సిపిఐ నేతలు

* తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్ప్రద క్షేత్రంలో మొదటి కార్తీక సోమవారం పురస్కరించుకుని గోదావరిలో అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు.

* ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో క్రికెటర్ అంబటి రాయుడు పర్యటన.. వాక్ విత్ అంబటి & కొటారు కార్యక్రమంలో భాగంగా సత్రంపాడు నుంచి వట్లురు వరకు విద్యార్థులతో ర్యాలీ .. అనంతరం ఇంజనీరింగ్ కాలేజీల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవం..

* తిరుమల: 23వ తేదీ నుంచి అలిపిరి వద్ద శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించనున్న టీటీడీ, ప్రతి నిత్యం హోమాని నిర్వహించేలా ఏర్పాట్లు చేసిన టీటీడీ.. ప్రతి నిత్యం ఆఫ్ లైన్ లో 50, ఆన్ లైన్ లో 50 టికెట్ల విక్రయం

* పశ్చిమగోదావరి జిల్లా: కార్తీకమాస తొలి సోమవారం సందర్భంగా పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం..

* పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం పంచారామ క్షేత్రంలో కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు..

* పశ్చిమగోదావరి జిల్లా: కార్తీక మొదటి సోమవారం కావడంతో అమరేశ్వర ఘాట్, వలందరరేవులో కార్తీకమాసం స్నానాలు చేసేందుకు పోటెత్తిన భక్తులు .. శివనామస్మరణతో మారుమోగుతున్న గోదావరి తీరం, భక్తులతో కిటకిటలాడుతున్న అమరేశ్వర, కపిల మల్లేశ్వరస్వామి ఆలయాలు

* అనంతపురం : జిల్లాలో నేటి నుంచి ప్రపంచ వారసత్వ వారోత్సవాలు

* ఖమ్మం: నేడు కాంగ్రెస్ నేత అజాహరుద్దీన్, మధ్యప్రదేశ్ ఎంపీ ఇమ్రాన్ తో కలసి ఎన్నికల ప్రచారం

* నంద్యాల: నేడు శ్రీశైలంలో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణిలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి

* నంద్యాల: కార్తీక సోమవారం సందర్భంగా నేడు మహానందిలో సామూహిక రుద్రాభిషేకం, కేదారేశ్వర వ్రతం, సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ.. ప్రధమనంది క్షేత్రంలో నేడు స్వామివారికి పంచామృతాభిషేకం

Exit mobile version