NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐసీసీ క్రికెట్‌ వన్డే వరల్డ్ కప్‌ 2023: నేడు న్యూజిలాండ్‌తో సౌతాఫ్రికాతో ఢీ.. మధ్యాహ్నం 2 గంటలకు పుణె వేదికగా మ్యాచ్‌

* తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ.. నేడు మధ్యాహ్నం 2.30కి కల్వకుర్తి సభలో పాల్గొననున్న కాంగ్రెస్‌ నేత.. సాయంత్రం 4.30కి జడ్చర్లలో కార్నర్ మీటింగ్.. సాయంత్రం 6.15కి షాద్ నగర్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు పాదయాత్ర.. అక్కడ మీటింగ్‌లో ప్రసంగించనున్న రాహుల్‌ గాంధీ.

* ఖమ్మం: నేడు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో జరుగనున్న బీఆర్ఎస్‌ ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్

* భద్రాద్రి కొత్తగూడెం: నేడు ఇల్లందులో నియోజకవర్గ బీఆర్ఎస్‌ ఆశీర్వాద సభలో పాల్గొననున్న కేసీఆర్

* అమరావతి: ఇవాళ వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున అవార్డుల కార్యక్రమం.. కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. ఉదయం 11 గంటలకు ఏ- కన్వెన్షన్ హాల్ లో అవార్డుల ప్రదానోత్సవం..

* అమరావతి: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. ఉదయం 10.15 గంటలకు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు.. పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం.. తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించనున్న సీఎం జగన్‌

* అమరావతి: ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు.. రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవడానికి 14 గంటల పాటు ప్రయాణం చేసిన చంద్రబాబు.. ఉదయం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత.. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎక్కడ ప్రసంగించని చంద్రబాబు.. కోర్టు ఆంక్షలతో కారు దిగని చంద్రబాబు.

* తిరుపతి పర్యటన వాయిదా వేసుకున్న చంద్రబాబు.. ఈ రోజు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్న టీడీపీ అధినేత.. ఈ రోజు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసే అవకాశం

* తిరుపతి: నేడు తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటన.. తిరుపతి రేల్వే స్టేషన్ అభివృద్ది పనుల పరిశీలన.. అలిపిరిలో టీటీడీ తొలగించే ప్రయత్నంలో ఉన్న శ్రీవారి పాదాల మండపంలో గోపూజ.. తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనం.. కచ్చపి ఆడిటోరియంలో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ తిరుపతి జిల్లా సమ్మేళనం.. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న పురంధేశ్వరి

* ఢిల్లీ: ఇవాళ బీజేపీ అభ్యర్థుల జాబితా ఫైనల్.. సాయంత్రం 6 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ.. ఇప్పటికే 2 జాబితాల్లో 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మిగతా 66 స్థానాల్లో జనసేనకు ఇచ్చే స్థానాలు పోను మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ.. జనసేనకు 9 లేదా 10 సీట్లు ఇచ్చే యోచనలో తెలంగాణ బీజేపీ నేతలు.. పవన్‌ కల్యాణ్‌ విదేశాల నుంచి వచ్చాకే జనసేన పోటీ చేసే స్థానాలపై రానున్న క్లారిటీ

* ప్రకాశం : యర్రగొండపాలెంలో PACS వారి IOCL పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

* బాపట్ల : వేటపాలెం తాహశిల్దార్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం పేరిట స్పందన కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ రంజిత్ భాష..

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్..

* తిరుమల: 12వ తేదిన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..

* నెల్లూరులో వైసిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సదస్సు

* అనంతపురం : పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

* పశ్చిమ గోదావరి: తణుకులో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి .

* విశాఖ: కంటకాపల్లి రైలు ప్రమాదం ఎఫెక్ట్.. వాల్తేరు డివిజన్ పరిధిలో నాలుగో రోజు పలు రైళ్లు రద్దు.. నేడు సికింద్రాబాద్, చెన్నై, బెంగుళూరు మార్గంలో ప్రయాణించే షాలిమార్, కొరమండల్, ఫలక్ నుమా, కోణార్క్, హామ్ సఫర్, దురంతో, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు.. పలాస-విశాఖ,విశాఖ-పలాస మధ్య ప్యాసింజర్ సర్వీసు రద్దు. కిరండోల్ ప్యాసింజర్ గమ్యస్థానం కుదింపు. భద్రతా కారణాలతో ఈనెల 5వరకు దంతేవాడ-విశాఖ మధ్య నడవనున్న కిరండోల్ ఎక్స్ ప్రెస్..

* విశాఖ: రేపు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్.. అంతర్జాతీయ జలవనరుల సంరక్షణ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం.

Show comments