* నేడు మధ్యప్రదేశ్, 230 అసెంబ్లీ స్థానాలకు, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్.. భారీ బందోబస్తు ఏర్పాటు.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత, వెబ్ క్యాస్టింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలల్లో 2,533 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వీరిలో 252 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5 కోట్ల 59 లక్షల 83 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 64,626 పోలింగ్ కేంద్రాలు, 700 కంపెనీల కేంద్ర బలగాలతోపాటు 2లక్షల మంది రాష్ట్ర పోలీస్ లు బందోబస్తు కాయనున్నారు.
* నేడు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. 70 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్.. కొన్నినియోజకవర్గాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మరికొన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్. 70 స్థానాల్లో 958 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.. 18,833 పోలింగ్ కేంద్రాలు, 90,272 మంది సెక్యూరిటీ
* వరంగల్: నేడు నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటన.. మధ్యాహ్నం 1.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు చేరుకోనున్న రాహుల్.. నర్సంపేట బహిరంగ సభలో పాల్గొని నర్సంపేట నుంచి హెలికాప్టర్‌లో 3.40 గంటలకు మామునూరు విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్.. వరంగల్ చౌరస్తా నుంచి జేపీఎన్ రోడ్డు, మండిబజారు మీదుగా పోచమ్మమైదాన్ వరకు పాదయాత్రలో పాల్గొనున్న రాహుల్.. అనంతరం పోచమ్మమైదాన్ సెంటర్‌లో జరిగే కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్న రాహుల్.. సాయంత్రం 5.15 గంటకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
* వరంగల్: నేడు పరకాలలో సీఎం కేసీఆర్ సభ.. పరకాల శివారులో సీఎం సభకు ఏర్పాట్లను పూర్తి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మ రెడ్డి.. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బందోబస్తును పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేసిన వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఘా
* ఈ రోజు ఉదయం 11 గంటలకు టీపీసీసీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే చేతుల మీదుగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్న కాంగ్రెస్
* ఈరోజు రాత్రికి తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రేపు ఉదయం 10.30కి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. గద్వాల్, నల్గొండ , వరంగల్ ల్లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొన నున్న అమిత్ షా.. రేపు సాయంత్రం హైదరాబాద్ లో ఎంఆర్‌పీఎస్ జాతీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొననున్న అమిత్ షా.
* ప్రకాశం : కంభంలో ప్రత్యేక స్పందన కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ దినేష్ కుమార్..
* బాపట్ల : చీరాల మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కరణం బలరాం సమీక్ష సమావేశం..
* ప్రకాశం : ఒంగోలులో రబీలో సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత అంశంపై జిల్లా ఇరిగేషన్ సలహా మండలి సమావేశం, హాజరుకానున్న కలెక్టర్ దినేష్ కుమార్..
* తిరుమల: ఇవాళ నాగుల చవితి సందర్భంగా పెద్ద శేష వాహన ఉరేగింపు.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులో జరిగే బీజేపీ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
* నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ నేతల సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కులగణనపై పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు హోటల్ మంజీరలో మేధావి వర్గం , కుల సంఘాల నేతలు హాజరై విలువైన సూచనలు అందచేయాలని కోరుతున్న జిల్లా కలెక్టర్ మాధవీలత
* అనంతపురం : పెద్ద వడుగూరు మండలం పరిధిలోని దిమ్మగుడి, కండ్లగూడూరు, గంజికుంటపల్లి గ్రామాలలో పర్యటించనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* అనంతపురం : యాడికి మండలం గుడిపాడు గ్రామంలో పెన్నా సిమెంట్స్ మైన్స్ తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ.
* అనంతపురం : ఉరవకొండలో అర్దరాత్రి ఇద్దరు యువకులు మద్య ఘర్షణ, కత్తులు తో దాడి చేసుకున్న యువకులు, ఇద్దరి కి గాయాలు,చికిత్స కోసం హాస్పటల్ కు తరలింపు.
* పశ్చిమగోదావరి: భీమవరం పంచారామ క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్ధన స్వామివార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు.. నాగుల చవితి పర్వదినం సందర్బంగా స్వామివారికి అభిషేకాలు. స్వామి అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు..
* ఈ నెల 23న సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారు.. పలాసలో నూతనంగా నిర్మించిన 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ , వై.యస్.ఆర్ సుజల ధార ప్రాజెక్టు లను సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు
* శ్రీకాకుళం: నేడు పలాసలోని ప్రగతి భవన్ (మంత్రి క్యాంపు) కార్యాలయ ఆవరణలో పలాస నియోజక పరిధిలోని మూడు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన ముఖ్య నాయకులతో ప్రత్యేక సన్నాహక నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం.. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో సమీక్ష
* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. 11 గంటలకు జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత మెడికల్ క్యాంపును పరిశీలించనున్న మంత్రి.
* అనంతపురం : ‘కుల’ గణన అంశంపై జిల్లా కలెక్టర్ గౌతమి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో సమావేశం.
* అనంతపురం : నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలని నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,494 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,666 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు
* అనంతపురం : నగరంలోని సర్వజన ఆసుపత్రిలో నూతన లేబర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ (ఈఓటీ)ని ప్రారంభించనున్న అధికారులు.
* పల్నాడు: నేడు నరసరావుపేటలో జాబ్ మేళా, హాజరుకానున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని.
* గుంటూరు: నేడు పొన్నూరులో విధ్వంసానికి వంద రోజులు పేరుతో టీడీపీ, జనాసేన ఆధ్వర్యంలో నిరసన దీక్షలు…
* గుంటూరు: ప్రతినెల మూడో శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల స్పందన కార్యక్రమం నేడు రద్దు..
* గుంటూరు: నేడు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు… 2023 -24 సవరణ బడ్జెట్ తో పాటు 2024 -25 అంచనా బడ్జెట్ లను ప్రతిపాదించనున్న సమావేశం….
* గుంటూరు: నేడు గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గ సమావేశం…
