* విశాఖ: నేటి నుంచి భారత్-ఆస్ట్రేలియా టీ20 టికెట్ల విక్రయాలు.. ఈనెల 23న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. ఈనెల 15, 16 తేదీల్లో పేటీఎం ద్వారా టికెట్ల విక్రయాలు
* తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,600, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,550, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000
* అమరావతి: నేటి నుంచి ఏపీలో కుల గణన ప్రక్రియ ప్రారంభం.. 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన ప్రారంభం.. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొదలు.. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన.. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన
* అమరావతి: నేడు సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా మాచర్ల పర్యటన.. వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. మాచర్ల చెన్నకేశవ కాలనీ సభాస్ధలి వద్ద వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్ధాపన కార్యక్రమంలో వద్ద సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్
* తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్… నేడు మెదక్, బోధన్, నిజామాబాద్, ఎల్లారెడ్డిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్
* ఆదిలాబాద్: నేడు ఉమ్మడి జిల్లాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన.. బోథ్, నిర్మల్ నియోజకవర్గాల్లో విజయభేరి సభల్లో పాల్గొననున్న రేవంత్.
* గుంటూరు: నేడు పొన్నూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర. ముఖ్య అతిధులుగా పాల్గొననున్న గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు,, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ, ఎంపీలు నందిగం సురేష్, అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ తదితరులు.
* ప్రకాశం : కొత్తపట్నం మండలం బంకింగ్ హమ్ కెనాల్ బ్రిడ్జి వద్ద నుండి బీచ్ వరకు 2.75 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో కులగణన సర్వేపై వివిధ కులసంఘాల నేతలతో కలెక్టర్ దినేష్ కుమార్ రౌండ్ టేబుల్ సమావేశం..
* ఒంగోలు లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 2020లో చేపట్టిన నియామకాలకు సంబంధించిన అవకతవకలపై జెడ్పీ సీఈవో జాలిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ..
* ప్రకాశం : ఒంగోలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు.
* తిరుమల: ఎల్లుండి నాగుల చవితి సందర్భంగా శ్రీవారి ఆలయంలో పెద్దశేష వాహన ఉరేగింపు.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వైసీపీ ప్రధాన నేతలతో సమావేశం కానున్న ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి
* నెల్లూరు ఆటోనగర్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా
* తిరుమల: రేపటి నుంచి ఆన్ లైన్ లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల విక్రయాలు ప్రారంభించనున్న టీటీడీ.. 23వ తేదీ నుంచి అలిపిరి వద్ద హోమాని ప్రతి నిత్యం నిర్వహించనున్న టీటీడీ.
* శ్రీ సత్యసాయి : హిందూపురం లో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. హాజరుకానున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రులు.
* శ్రీ సత్యసాయి : నేటి నుంచి రెండు రోజుల పాటు హిందూపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.
* అనంతపురం: కంబదూరు మండలం కుర్లాపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం, భయాందోళనలో రైతులు.
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తిలో టీడీసీ – జనసేన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం.
* తూర్పుగోదావరి జిల్లా: ఈనెల 17వ తేదీన కులగణనపై పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం.. మేధావి వర్గం, కుల సంఘాల నేతలు విలువైన సూచనలు ఇవ్వాలని సూచన.. నేటి సాయంత్రంలోగా ఆర్డీవోలకు పేర్లు ఇవ్వాలని సూచన.
* పశ్చిమ గోదావరి: భీమవరం కలెక్టరేట్‌లో సాగునీటి సలహా మండలి సమావేశం. హాజరుకానున్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు,
* పశ్చిమ గోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. 11 గంటలకు జడ్పీ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం భీమవరంలో జరిగే సాగునీటి సలహా మండలి సమావేశానికి హాజరు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాంతీయ జైళ్ల శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. రాజమహేంద్రవరం ఇన్నీసు పేటలో జైళ్ల శాఖ, HPCL ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. కలెక్టరేట్ లో నిర్వహించే ఇరిగేషన్ అడ్వైజరి బోర్డ్ సమావేశంలో పాల్గొంటారు. కొవ్వూరు రూరల్ మండలం పెనకనమెట్ట సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (162వ రోజు) నిర్వహిస్తారు.
* ప.గో: పాలకొల్లులో టీడీపీ-వైసీపీ హోర హోరీ నిరసనలకు పిలుపు.. టిడ్కో ఇళ్ల వేదికగా కార్యక్రమాలు తలపెట్టిన వైసీపీ, టీడీపీ.. ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో నవంబర్ 15 పాలకొల్లు చూడు అంటూ వంటావార్పు బహిరంగ సభకు పిలుపు.. నిజనిర్ధారణ టిడ్కో హౌసెస్ కు ర్యాలీ అంటూ వైసీపీ పిలుపు.. రెండు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు కార్యక్రమంలో ప్రజలు పాల్గొనవద్దంటూ పట్టణ పోలీస్ హెచ్చరిక..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి రౌండ్ టేబుల్ సమావేశాలు
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తిలో టిడిపి – జనసేన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం.
* తిరుమల: 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,041 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,415 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు
* విజయవాడ: ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో నేడు ధర్నా చౌక్ లో ధర్నా.. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల అమలు వంటి సమస్యల పరిష్కారం కోసం ధర్నా
* విజయవాడ: నేడు బెజవాడలో సీపీఎం భారీ ర్యాలీ, బహిరంగ సభ.. హాజరు కానున్న సీపీఎం అగ్ర నేతలు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రజా సంరక్షణ యాత్ర పేరిట కార్యక్రమం
* నేడు వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే 14.. బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలు.. నర్సన్నపేట – శ్రీకాకుళం జిల్లా, పొన్నూరు – గుంటూరు జిల్లా, హిందూపూర్ – శ్రీసత్య సాయి జిల్లా
* నేడు మూడు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటన.. బోథ్, నిర్మల్, జనగాం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.. ఉదయం 11గంటలకు బోథ్, మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్, సాయంత్రం 4 గంటలకు జనగాం బహిరంగసభల్లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి