* హైదరాబాద్: నేడు పాలకుర్తి, నాగార్జున సాగర్(హలియ), ఇబ్రహీంపట్నంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం
* హైదరాబాద్: నేటి నుంచి భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం.. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న కోటి దీపోత్సవం
* అమరావతి: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు.. 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం. నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ. ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టే ఇంటింటి ప్రచారంపై సమీక్ష.
* అమరావతి: ఇవాళ్టి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జనసేన వరుస ప్రెస్ మీట్లు.. జగన్ ప్రభుత్వంలో వివిధ అంశాల్లో కుంభకోణాలు జరిగాయంటూ వరుస ప్రెస్ మీట్లు పెట్టనున్న జనసేన. టోఫెల్, ఐబీ ఒప్పందాలు, జగనన్న పాల వెల్లువలో అవినీతి జరిగిందంటూ ఇప్పటికే జనసేన విమర్శలు.
* హైదరాబాద్: ఇవాళ స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. ఉదయం 11 గంటలకు స్టేషన్ ఘనపూర్ బహిరంగసభ.. మధ్యాహ్నం 1 గంటలకు వర్ధన్నపేట బహిరంగసభ.. సాయంత్రం 4 గంటల నుంచి కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న రేవంత్ రెడ్డి.. రెడ్డిపేట్, ఇసాయిపేట్, చుక్కాపూర్, మాచారెడ్డి, ఫరీద్ పేట్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
* ప్రకాశం : ఒంగోలులో బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం, హాజరుకానున్న పలువురు రాష్ట్ర నేతలు..
* ప్రకాశం : గిద్దలూరులో టీడీపీ, జనసేన నేతల ఉమ్మడి సమావేశం, నియోజకవర్గంలో కార్యాచరణపై సమీక్ష..
* ప్రకాశం : మార్కాపురంలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ..
* తిరుమల: ఇవాళ శ్రీవారి కాసుల హారం ఉరేగింపు.. శ్రీవారి ఆలయం నుంచి తిరుచానురుకి ఉరేగింపు.. రాత్రి పద్మావతి అమ్మవారి గజవాహన సేవలో కాసుల హారం అలంకరణ
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సహకార వారోత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో జరిగే సాగునీటి సలహా బోర్డు సమావేశానికి హాజరవుతారు.. సాయంత్రం పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ.. ఇది బాబు గ్యారెంటీ కార్యక్రమం
* నెల్లూరులోని జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రధాన భవనంలో గ్రంథాలయ వారోత్సవాలు
* అనంతపురం : తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు 2కే రన్ కార్యక్రమం.
* పశ్చిమ గోదావరి జిల్లా: కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు..
* పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరం పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు.. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి దర్శనానికి బారులు తీరిన భక్త జనం..
* అమరావతి: ఉదయం 11 గంటలకు సచివాలయంలో దేవదాయ ధర్మదాయ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి కార్తీక మాసం ఆరంభం.. రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్న స్నానఘట్టాలు.. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. పుణ్య స్నానాలతో కిక్కిరిసిన పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ .. శివనామ స్మరణతో మారుమోగుతోన్న స్నానఘట్టాలు
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తిలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం.
* అనంతపురం : నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం.
* అనంతపురం : నేటి నుంచి జిల్లాలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.
* నంద్యాల: నేటి నుండి డిసెంబర్ 12 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. భక్తుల రద్దీ దృష్ట్యా సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల.. కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో కూడా స్పర్శ దర్శనాలు రద్దు.. రద్దీ రోజుల్లో భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతి.. కార్తీకమాసం సాధారణ రోజులలో స్పర్శ దర్శనానికి 4 విడతలుగా అనుమతి
* కాకినాడ: నేడు టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, హాజరు కానున్న మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, యనమల
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కొవ్వూరు మండలం, పెనకనపెట్ట గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు బరోసా కేంద్రం ప్రారంభోత్సవం.. కార్యక్రమానికి హాజరు కానున్న మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత
* విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ ప్రకటన.. ఈ నెల మొదటి వారంలో ఏయూలో పర్యటించిన ఏడుగురు సభ్యుల గల న్యాక్ బృందం.. ఐదేళ్లపాటు కొనసాగనున్న గ్రేడింగ్.
* గుంటూరు: నేడు మిర్చి యార్డ్ లో రైతు సంఘాలు, ముఠా కార్మికులతో, అధికారుల సమావేశం.. మచ్చు కాయల వివాదంపై చర్చించనున్న పాలకవర్గం…
* నేడు గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఓటర్ల సహాయ కేంద్రం ను ప్రారంభించనున్న , మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
* పల్నాడు: రేపు మాచర్లలో వరికిపూడిసెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో బాలల దినోత్సవం కార్యక్రమం.. జిల్లా మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ , జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో జరుగనున్న బాలల దినోత్సవం
* గుంటూరు: రేపు పొన్నూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర హాజరుకానున్న పలువురు మంత్రులు వైసిపి ప్రజాప్రతినిధులు…
* కాకినాడ: సామర్లకోట పంచారామ క్షేత్రం కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు.
* విజయనగరం: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై రాజీవ్ స్టేడియం లో నేడు అవగాహన సమావేశం.. గ్రంథాలయ వారోత్సవాలను గురజాడ కేంద్ర గ్రంథాలయంలో డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి నేడు ప్రారంభించనున్నారు..
* బాపట్ల : నేడు రేపల్లె లో టిడిపి, జనసేన పార్టీ ల నియోజకవర్గస్థాయి సమన్వయ సమావేశం…
* విజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి ఉయ్యాల కంబాల నేడు జరగనుంది. ఇందుకు చదురుగుడి ప్రాంగణంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు.. ఉదయం పంచామృతాభిషేకాలు, అర్చనల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు..
* గుంటూరు : నేడు పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో టిడిపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం.. హాజరుకానున్న ఇరు పార్టీల శ్రేణులు ,ముఖ్య నాయకులు..
* విశాఖ: నేటి నుంచి టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాలు.. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల సమన్వయ సమావేశాలు.. నేటి నుంచి 16వ తేదీ వరకు జరగనున్న సమావేశాలు.. 14న భీమిలి, విశాఖ పశ్చిమ, 15న గాజువాక, విశాఖ ఉత్తరం, 16వ తేదీన విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయం..
* అంబేద్కర్ కోనసీమ: ద్రాక్షరామ పంచారామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు
* తిరుమల: 24 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,902 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,858 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.24 కోట్లు
* విజయవాడ: రేపు నగరానికి సీపీఎం అగ్రనేతలు రాక.. సీపీఎం మహా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొననున్న సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు
* చిత్తూరు: కార్తిక మాసం ప్రారంభం సదర్భంగా శ్రీకాళహస్తి దేవస్తానం లో దర్శనం వేళలో మార్పులు.. ఉదయం 4 గంటలకు ఆలయం తెరిచి 5 గంటలకు భక్తులకు దర్శనం ప్రారంభం.. రాత్రి 9 గంటలకు భక్తులకు దర్శనం ముగింపు
