NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐసీసీ క్రికెట్‌ వన్డే వరల్డ్‌ కప్‌ 2023: ఆస్టేలియాతో బంగ్లాదేశ్‌ ఢీ.. ఉదయం 10.30 గంటలకు పుణె వేదికగా మ్యాచ్‌.. ఇంగ్లాడ్‌తో తలపడనున్న పాకిస్థాన్‌.. కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌

* నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ.. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మాదిగల విశ్వరూప బహిరంగసభలో పాల్గొననున్న ప్రధాని.. ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు చేరుకోనున్నారు. ఆ తర్వాత 5.40 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి సాయంత్రం 6 గంటల తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న ప్రధాని.

* నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన.. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్న సీఎం.. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంకు చేరుకుంటారు, అక్కడ మైనారిటీస్‌ వెల్పేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్న సీఎం

* నంద్యాల: నేడు శ్రీశైలంలో మాస శివరాత్రి సందర్భంగా మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం, బిల్వార్చన, ప్రత్యేక పూజలు

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

* నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా నేతల సమావేశం.

* శ్రీ సత్యసాయి: సత్యసాయి బాబా జయంతి పురస్కరించుకుని ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పుట్టపర్తిలో సాయికుల్వంత్ మందిరంలో అఖండభజన.

* అనంతపురం : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ నియామకానికి సెర్చ్ కమిటీని నియమించిన ఉన్నతవిద్యామండలి.. ఈ నెల 24న ముగియనున్న ప్రస్తుతం ఉన్న వీసీ రామకృష్ణారెడ్డి పదవీకాలం.

* తూర్పగోదావరి జిల్లా: నేటి ఉదయం 9 గంటల నుంచి రోడ్ కం రైల్ వంతెన రహదారి పై వాహనాల రాకపోకలకు అనుమతి.. రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 10 వ తేదీ వరకు నిలిచిపోయిన రాకపోకలు.. 2 కోట్ల 10 లక్షల రూపాయాల వ్యయంతో చేపట్టిన పనులు మరమత్తు పనులు పూర్తి.

* బెజవాడలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. దుర్గమ్మను దర్శించుకుని నేరుగా శ్రీశైలం వెళ్లనున్న డీకే

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: శనిత్రయోదశి సందర్భంగా కొత్తపేట మండలం మందపల్లిలోని ప్రముఖ శైవక్షేత్రం శనేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దేశంలోనే శనిచేత ప్రతిష్ఠంచిన ఏకైక శివాయం మందపల్లిలో శనేశ్వరస్వామి.. అర్ధరాత్రి నుంచి ఆలయానికి దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు రాక.. శనిదోష నివారణ కోసం తైలాభిషేకాలు చేయించుకుంటున్న భక్తులు.. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు

* విజయవాడ: నేటితో నగరంలో ముగియనున్న కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్.. గత 3 రోజులుగా సిటీలో సినిమా షూటింగ్ లో పాల్గొన్న కమల్ హాసన్, దర్శకుడు శంకర్

* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (159వ రోజు) నిర్వహిస్తారు.. కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తారు.

* తిరుపతి: దీపావళి నేపథ్యంలో 13వ తేదీన స్వీమ్స్ ఓపీలకు సెలవు

* అనంతపురం : నేడు నగరంలోని శివకోటి – శ్రీపీఠం రాజగోపుర శిఖర కుంబాభిషేకం.

* అనంతపురం – హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా మహలక్ష్మీ శ్రీనివాసులను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేటి నుంచి టూరిజం శాఖ కార్మికుల సమ్మె.. మూతబడునున్న బొర్రా గుహలు, పర్యాటక కేంద్రాలు, టూరిజం శాఖ అతిథి గృహాలు.. రిజర్వేషన్లు చేసుకున్న టూరిస్టుల్లో టెన్షన్.. 2017నుంచి పెండింగ్ లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న టూరిజం కార్మికులు.

* తిరుపతి: పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం పెద్దశేషవాహనం, రాత్రి హంసవాహన సేవలు…

* అల్లూరి సీతారామ రాజు జిల్లా ఏజెన్సీని వణికిస్తున్న చలిగాలులు.. పాడేరులో 12, మినుములూరు వద్ద 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.. పాడేరు మేఘాల కొండపై పెరిగిన పర్యాటకుల రద్దీ.. సెలవులతో పర్యాటక కేంద్రాలకు పెరుగుతున్న తాకిడి

* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,978 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,617 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.87 కోట్లు