NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐసీసీ వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023: నేడు సౌతాఫ్రికాతో తలపడనున్న ఆప్ఘనిస్థాన్‌.. మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌

* తెలంగాణ శాసన సభ ఎన్నికల నామినేషన్ల దాఖలకు ఇవాళ చివరి రోజు.. మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్న నామినేషన్ల గడువు.. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు.. ఈనెల 30న పోలింగ్, డిసెంబర్‌ 3న కౌంటింగ్.. నిన్నటి వరకు 1,129 నామినేషన్లు దాఖలు.. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం.

* నేడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలుచేయనున్న పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.. కామారెడ్డిలో కాంగ్రెస్ సభ.. హాజరుకానున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ఈ రోజు సిద్ధరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ విడుదల

* ప్రకాశం : ఒంగోలులో టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బీసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం, హాజరుకానున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ..

* ఒంగోలుతో పాటు జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలు..

* పశ్చిమ గోదావరి: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. ఉదయం 9:30 గంటలకు ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తదనంతరం దేవస్థానంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం 4 గంటలకు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

* నెల్లూరు జిల్లా: కోవూరు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ నేతల సమావేశం

* పశ్చిమ గోదావరి: నేడు నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం..

* నేడు గుంటూరులో గాంధీ పార్కును ప్రారంభించనున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి..

* నేడు పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతిలో.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. హాజరుకానున్న ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు..

* గుంటూరు: నేడు ప్రత్తిపాడు మండలం పెద గొట్టిపాడు లో పర్యటించనున్న జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి.. పోలీసు ఉన్నతాధికారులు. 2018 నూతన సంవత్సర వేడుకల్లో చోటుచేసుకున్న వివాదంలో, ఎస్సీ వర్గాల వారిని సాంఘిక బహిష్కరణ చేశారన్న ఆరోపణలు.. ఈ ఘటన పై హైకోర్టు ఆదేశాలతో, నేడు పెదగొట్టిపాడులో విచారణ చేయనున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు.. విచారణ అనంతరం నివేదికను హైకోర్టుకు సమర్పించనున్న కలెక్టర్, ఎస్పీలు…

* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో కరెంటు ఆఫీస్ సమీపంలో నిర్వహించే క్రైస్తవ మహాసభలు పాల్గొంటారు. 3:30 గంటలకు కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (158వ రోజు) నిర్వహిస్తారు.

* తిరుమల: 13 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,723 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 21,778 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు

* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు పార్వతీపురంలో సామాజిక సాధికార యాత్ర.. బస్సు యాత్రలో హాజరుకానున్న వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం రాజన్న దొర, ఇన్చార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.

* కడప: రెండో రోజు పులివెందులలో సీఎం జగన్‌ పర్యటన.. ఇడుపులపాయ ప్రాంతంలో ఆర్కే వ్యాలీ, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్న సీఎం జగన్.. అనంతరం వేముల మండల స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం.. మధ్యాహ్నం 12.30 కు కడప విమానాశ్రయం నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణంకానున్న సీఎం జగన్

* విశాఖ: రేపు ఋషికొండ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల లడ్డూ ప్రసాదం అమ్మకాలు.. కళ్యాణ లడ్డూ రూ.200., సాధారణ లడ్డూ రూ.50కు విక్రయాలు.

* తూర్పు గోదావరి జిల్లా: రేపు ఉదయం 9 గంటల నుంచి రోడ్ కం రైల్ వంతెన రహదారిపై వాహనాల రాకపోకలు అనుమతి.. రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 10 వ తేదీ వరకు నిలిచిపోయిన రాకపోకలు.. 2 కోట్ల 10 లక్షల రూపాయాల వ్యయంతో చేపట్టిన పనులు మరమత్తు పనులు పూర్తి.

* కొమరంభీం: నేడు జిల్లాకు రానున్న బండి సంజయ్. సిర్పూర్ టి మండల కేంద్రములో బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరుకానున్న సంజయ్

* నిర్మల్‌: నేడు నిర్మల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరుకానున్న నేతలు..

* నేడు మెదక్ జిల్లాలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటన.. నర్సాపూర్‌లో బీజేపీ అభ్యర్థి మురళీధర్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఈటల

* నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. నర్సాపూర్ BRS అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు