NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐపీఎల్‌ 2024: నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్‌.. రాత్రి 7.30 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్‌

* నేడు ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.. అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి బయలుదేరి వెళ్లనున్న ప్రధాని మోడీ

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు విధింపు.. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు

* అనకాపల్లి జిల్లా: నేడు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం. తాళ్లపాలెం దగ్గర కూటమి భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. భారీ జనసమీకరణ, విస్తృతమైన ఏర్పాట్లు చేసిన కూటమి పార్టీలు.

* ఢిల్లీ: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు.. ఈడీ, సీబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కవిత.. రెండు కేసుల్లోనూ ముగిసిన వాదనలు.. ఇవాళ కవిత బెయిలుపై తీర్పు వెలువరించనున్న రౌస్ ఎవిన్యూ కోర్టు

* హైదరాబాద్‌: నేడు అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. సాయంత్రం 5గంటలకు అంబర్ పేట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్, రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్, రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

* నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు భజన్ లాల్ శర్మ , పుష్కర్ సింగ్ ధామి, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై.. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న నేతలు

* నేడు ఉదయం 11 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ గోదావరిఖనిలో, మధ్యాహ్నం 12.30 గంటలకి భువనగిరి పార్లమెంట్ చౌటుప్పల్ లో, మధ్యాహ్నం 3.30 గంటలకు నల్గొండలో బహిరంగ సభల్లో పాల్గొననున్న జేపీ నడ్డా..

* ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జమ్మికుంట బహిరంగ సభలో, 3 గంటలకు కల్వకుర్తిలో బహిరంగ సభ, సాయంత్రం 6 గంటలకు సనత్ నగర్ నుండి పద్మారావు నగర్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొననున్న బీజేపీ తమిళనాడు అధ్యక్షులు అన్నామలై

* ఈ రోజు ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ లో యువ సమ్మేళనం, మధ్యాహ్నం 12.30 గంటలకు నర్సంపేట లో బహిరంగ సభ, సాయంత్రం 5.30కి మహబూబ్‌నగర్‌లో మేధావులతో సమావేశంలో పాల్గొననున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ

* ఈ రోజు సాయంత్రంసికింద్రాబాద్ ఇంపిరియల్ గార్డెన్ లో ప్రవాసి సమ్మేళనంలో పాల్గొననున్న భజన్ లాల్ శర్మ

* ప్రకాశం : ఒంగోలు రూరల్ మండలం ముక్తినూతలపాడులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం: దర్శిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న వైసిపి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..

* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ సుడిగాలి పర్యటన.. వరుసగా ఉమ్మడి జిల్లాలో, రెండు నియోజకవర్గాల్లో, మేమంతా సిద్ధం బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం జగన్.. ఉదయం 10 గంటలకు, బాపట్ల జిల్లా రేపల్లెలో, మధ్యాహ్నం ఒంటిగంటకు మాచర్లలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు

* నెల్లూరు: దుత్తలూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఉదయగిరి టిడిపి అభ్యర్థి సురేష్
.
* నెల్లూరు: తోటపల్లి గూడూరు… పొదలకూరు మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి

* నెల్లూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి

* అనంతపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొనసాగతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. జిల్లా వ్యాప్తంగా 26,150 పోస్టల్ బ్యాలెట్ గాను మూడవరోజు 7,588 మంది ఓటు హక్కు వినియోగం,

* చిత్తూరు జిల్లా వెదరు కుప్పం మండలం వేణుగోపాలపురం ఎన్నికల ప్రచారంలో పిల్లనా గ్రోవీ ఊదుతు డాన్స్ వేసిన డిప్యూటీ సీఎం

* చిత్తూరు: తిరుపతి జిల్లాలో రెండో రోజు కొనసాగనున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ.. జిల్లా వ్యాప్తంగా 22145 పోస్టల్ బ్యాలెట్ గాను తోలి రోజు 16వేల మంది ఓటు హక్కు వినియోగం… చిత్తూరు జిల్లాలో మొత్తం 12136 ఓట్లలో పోలైన 9027 ఓట్లు

* చిత్తూరు: నేటి నుండి రెండు రోజుల పాటు హోం ఓటింగ్.. హోం ఓటింగ్ కు నమోదు చేసుకున్న సుమారు 610 మంది ఓటర్లు…

* తిరుపతి: రేపు సాయంత్రం తిరుపతిలో లీలా మహల్ నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ల రోడ్ షో.. నాలుగు కాళ్ల మండపం వద్ద బహిరంగ సభ

* వేంపల్లి : పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం బాలదిమ్మయ్య గారి పల్లెలో ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించనున్నారు…

* శ్రీ సత్యసాయి : హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

* కడప : జిల్లావ్యాప్తంగా రెండవ రోజు ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. నేడు ఓటు హక్కు వినియోగించుకొనున్న 8141 ఎన్నికల అదనపు సిబ్బంది.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.. భారీ భద్రత నడుమ కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.

* కడప: నేడు ఓటు హక్కు వినియోగించుకోనున్న పొలీస్, ఆరోగ్య సిబ్బంది, ఫొటో, విడియో గ్రాఫర్, మీడియా, డ్రైవర్ లు, టెండర్లు నేడు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం .. మూడు రోజులపాటు కొనసాగునున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ.. జిల్లావ్యాప్తంగా 13865 మంది ఓటర్లలో ఇప్పటికే ఓటుహక్కు వినియోగించుకున్న 4647 మంది పీవోలు, అదనపు పీవోలు…