NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* ఢిల్లీ: నేడు సిద్ధరామయ్య, డీకే శిశకుమార్‌తో మల్లికార్జున ఖర్గే భేటీ.. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన సిద్ధరామయ్య.. నేడు హస్తినకు వెళ్లనున్న డీకే

* ఐపీఎల్‌లో నేడు లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు ముంబై – లక్నో ఢీ

* హైదరాబాద్‌: వైఎస్‌ వివేకా హత్య కేసులో నేడు విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్ రెడ్డి .. ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న సీబీఐ.. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సీబీఐ.

* విశాఖ: నేడు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్.. హాజరుకానున్న కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.

* నేడు సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ కానున్న కేంద్రం ఆర్ధిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు.. ఒకరోజు పర్యటన కోసం విశాఖ, అమరావతికి కేంద్ర మంత్రి.. పోర్టు కళావాణీ ఆడిటోరియంలో రోజ్ గార్ మేళాకు ముఖ్య అతిథిగా భగవత్ కిషన్ రావు.. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొననున్న ఆర్ధిక శాఖ సహాయమంత్రి. సాయంత్రం విజయవాడకు పయనం.. రాత్రి 7గంటలకు సీఎంతో సమావేశం కానున్న భగవత్ కిషన్ రావు

* విశాఖ: నేడు స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడికి పిలుపునిచ్చిన పోరాట కమిటీ.. పెండింగ్ లో ఉన్న వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్. ముందు జాగ్రత్తగా సిఐఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేసిన అధికారులు

* విశాఖ: ఫార్మాసిటీ నిర్వాసితులకు ఎట్టకేలకు మోక్షం.. ఏపీఐఐసీ భూ సమీకరణతో నిర్వాసితులైన 200 మందికి పట్టాలు పంపిణీ. ఫార్మాసిటీ హై స్కూల్ గ్రౌండ్ లో పట్టాలు అందజేయనున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి., ఎమ్మెల్యే నాగిరెడ్డి

* విశాఖ: నేడు ఏపీ భవన నిర్మాణ కార్మికుల ఛలో కలెక్టరేట్ పిలుపు.. భవన నిర్మాణ కార్మిక సమస్యల పరిష్కారానికై -సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్….

* నేడు బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన.. నిజాంపట్నంలో నాలుగో విడత వైయస్సార్ మత్స్యకార చేయూత నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్.

* నేటి నుండి గుంటూరు మిర్చి యార్డుకు వేసవికాలం సెలవులు, జూన్ 11 వరకు నిలిచిపోనున్న మిర్చి క్రయ విక్రయాలు….

* ప్రకాశం : యర్రగొండపాలెం అంబేడ్కర్ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

* అంబేద్కర్ కోనసీమ: నేడు కాట్రీనికోన మత్స్యకార భరోసా కార్యక్రమం.. నిజాంపట్నం నుంచి పర్చువల్ ద్వారా ఓ ఎన్ జీ సి నష్ట పరిహారం తో పాటు వేట నిషేధం డబ్బులు అందజేయనున్న సీఎం.. హాజరుకానున్న జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు

* విజయవాడ: ఐదో రోజుకు చేరుకున్న శ్రీ మహాలక్ష్మీ యజ్ఞం.. రేపటితో ముగియనున్న యజ్ఞం

* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీకామాక్షితాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రావణ సేవ

* ఏపీలో నేడు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం.. ఈరోజు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రయాణాల్లో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ.

* ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.

* 101వ రోజుకు చేరిన నారా లోకేష్ యువగళం యాత్ర… నేడు బండి ఆత్మకూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం. పర్నపల్లె, ఎ.కోడూరు, కొత్తపల్లి మీదుగా మూలమట్టం వరకు సాగనున్న పాదయాత్ర

* తిరుమల: ఇవాళ దర్మగిరి వేదపాఠశాలలో అఖండ సుందరాకాండ పారాయణం.. పాల్గొననున్న కంచి పిఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిజీ

* ఇవాళ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర.. రాత్రి 2 గంటలకు అమ్మవారి విశ్వరూప దర్శనంతో ముగియనున్న గంగమ్మ జాతర ఘట్టం

* కర్నూలు: మంత్రాలయంలో గ్రామ దేవత మంచాలమ్మకు నేడు కుంకమ అర్చన, తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.

* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన.. కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో జరుగు అభయాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొంటారు.. కొవ్వూరు టౌన్ 4 వ వార్డు నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్య క్రమం లో పాల్గొంటారు.

* అనంతపురం : కంబదూరు మండల పరిధిలోని తిప్పేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషాశ్రీచరణ్.

* అనంతపురం : నేటి నుంచి రెండు రోజుల పాటు జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు.

* అనంతపురం : జిల్లాలో నేటి నుంచి విత్తన వేరుశనగకు రిజిస్ట్రేషన్లు.

* జగిత్యాల రూరల్ ఎస్సై అనీల్ ను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ నేడు కోరుట్ల పట్టణ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు…