NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు.. నేడు ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌.. ఇవాళ సోనియా, రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం.. కర్ణాటక సీఎం ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

* కర్ణాటక: నేడు డీకే శివకూమార్ పుట్టిన రోజు.. డీకే పుట్టిన రోజు గిఫ్ట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తాందా ? లేదా అన్న టెన్షన్ లో ఆయన అనుచరులు.. తన పుట్టిన రోజు నాడు సోనియాకు గెలుపు గిఫ్ట్ ఇస్తానని గతంలో చెప్పినా డీకే..

* ఐపీఎల్‌: నేడు గుజరాత్‌తో ఢీకొననున్న హైదరాబాద్‌.. అహ్మదాబాద్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

* తిరుపతిలో కోనసాగుతునేన గంగ జాతర సందడి.. ఇవాళ గంగమ్మకు సారేలు సమర్పించనున్న మంత్రి అంబటి రాంబాబు, విఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపి గురుమూర్తి, జాయింట్ కలేక్టర్ బాలాజి

* వరంగల్‌: నేడు నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం

* హైదరాబాద్‌: నేడు తిరిగి విధుల్లో చేరనున్న జేపీఎస్‌లు..

* ప్రకాశం : యర్రగొండపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

* బాపట్ల : అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉత్సవ విగ్రహాలతో నగరోత్సవ కార్యక్రమం.

* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ఉపాలయాలు రంగనాయక స్వామి, ఆండాళ్ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పూజా కార్యక్రమం..

* కడప : నేటి నుంచి జిల్లాలో 9 పరీక్షా కేంద్రాల్లో ఈఏపీ పరీక్షలు.. 19 వరకు ఇంజనీరింగ్, 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు..

* కడప కలెక్టరేట్ లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం..

* కడపజిల్లాలో నేడు, రేపు ఎండ తీవ్రత.. 40 డిగ్రీల నుంచి రెండు, లేదా నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం పొదలకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

* విశాఖ: నేడు GVMC గాంధీ విగ్రహం దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి రౌండ్ టేబుల్ సమావేశం.. జాబ్ క్యాలెండర్ కోసం విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాలతో కలిసి నిరసన.

* వందో రోజుకు చేరిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)లో బోయరేవుల నుంచి ముత్తుకూరు, పెద్దదేవలాపురం, సంతజూటూరు, పరమటూరు మీదుగా బండిఆత్మకూరు వరకు సాగనున్న పాదయాత్ర..

* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన కార్యక్రమాలు.. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామం సీయోను ప్రేయర్ హల్ నందు జరుగు వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు మండలం సీతంపేట గ్రామం నందు కంబాల అంజిబాబు( వైసిపి కార్యకర్త) నివాళులు అర్పిస్తారు.

* అనంతపురం: కంబదూరు మండల పరిధిలోని కొత్త మిద్దెల, దేవేంద్రపురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీచరణ్

* అల్లూరి సీతారామ రాజు జిల్లా: పాడేరులో అత్యంత వైభవంగా కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి గిరిజన జాతర.. మోదకొండమ్మ దర్శనం కోసం రెండో రోజు ఏపీ, తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్ ఘడ్ నుంచి భారీగా తరలి వస్తున్న భక్తులు.

* బాపట్ల: రేపు నిజాంపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన…. వైయస్సార్ మత్స్యకార చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్.. బాపట్ల రేపు ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకొని నేడు జరగాల్సిన బాపట్ల జిల్లా కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల్లోని స్పందన కార్యక్రమం రద్దు.

* పల్నాడు: చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్ననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.

* అనంతపురం : ఈనెల 17 న అనంతపురంలో ఏపీ జేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు.

* తిరుమల: 17 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,022 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,187 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు