Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,130.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,700.. కిలో వెండి ధర రూ.78 వేలు

* కాకినాడ: నేడు అన్న వరం సత్యదేవుని ఆలయంలో ప్రసాద్ స్కీం పనులు పర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆలయ అభివృద్ధి కి ప్రసాద్ స్కీమ్‌ కింద రూ.20.06 కోట్లు కేటాయించిన కేంద్రం.. అన్నదానం నూతన భవనం, ఇతర అభివృద్ధి పనులుకి శ్రీకారం

* నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. 4వ విడత చేయూత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

* నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌.. కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ మీటింగ్‌కు హాజరుకానున్న రేవంత్, ఉత్తమ్.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై చర్చించే అవకాశం

* నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌జోషి, రాజ్‌కుమార్‌ సింగ్‌తో భేటీకానున్న భట్టి.. పర్యావరణం, అటవీశాఖ కార్యదర్శులను కలవనున్న భట్టి విక్రమార్క..

* నేడు మరోసారి ఏపీ బీజేపీ నేతలతో బీజేపీ అగ్రనేతల భేటీ.. నేటి సమావేశంలో పొత్తులపై చర్చ.. క్లారిటీ వచ్చే అవకాశం.

* నేడు 11 గంటలకు సికింద్రాబాద్​ ఆర్మీ కాలేజీ ఆఫ్​ డెంటల్ సైన్సెస్​ స్నాతకోత్సవంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌ రెడ్డి..

* హైదరాబాద్​–కరీంనగర్​ రాజీవ్​ రహదారిపై సిక్స్​ లేన్​ ఎలివేటేడ్​ కారిడార్​ నిర్మాణానికి అల్వాల్​ లోని టిమ్స్​ సమీపంలో భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌..

* హైదరాబాద్‌: నేడు మధ్యాహ్నం 1.30 కి బంజారాహిల్స్ లో డాక్టర్‌​ బాబు జగ్జీవన్​ రామ్​ భవన్​ ప్రారంభోత్సవం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి.

* నేడు ఖమ్మంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న కేటీఆర్..

* నేడు బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు రవి చంద్ర అభినందన సభ

* కాకినాడ: నేడు ఉదయం 11 గంటలకు ముద్రగడ నివాసానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి.. జిల్లా పార్టీ నేతలతో కలిసి కిర్లంపూడికి మిథున్ రెడ్డి.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించునున్న వైసీపీ బృందం.. ముద్రగడ కుమారుడు గిరికి ఎలక్షన్ కోడ్ రాకముందే నామినేటెడ్ పదవి హామీ ఇచ్చే అవకాశం.

* ప్రకాశం : ఒంగోలు జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా జెడ్పీ సర్వ సభ్య సమావేశం.. హాజరుకానున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు..

* ఒంగోలు లోని పలు డివిజన్లలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ఒంగోలులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..

* బాపట్ల : మేదరమెట్ల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిద్దం సభ స్థలాన్ని పరిశీలించనున్న వైసీపీ ముఖ్య నేతలు..

* ప్రకాశం : నాగులుప్పలపాడు మండలంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున..

* ప్రకాశం : కొండేపిలో మంత్రి ఆదిములపు సురేష్ ఆద్వర్యంలో నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా.. హాజరుకానున్న 50 కార్పోరేట్ కంపీణీలు, మూడు వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పర్యటన.. కోంతమూరు గ్రామంలో 2 కోట్ల రూపాయలతో అనేక‌‌ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల కార్యక్రమం, పంచాయతీ కార్యాలయం కోంతమూరు నందు పాల్గొంటారు. కాతేరు గ్రామంలో కోటి రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల కార్యక్రమం, శాంతినగర్ వాటర్ ట్యాంక్ వద్ద నుండి కాతేరు నందు పాల్గొంటారు.

* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లోని టిడిపి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు.. సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో నిర్వహించనున్న మహిళా దినోత్సవ వేడుకలు

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పొదలకూరు..మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరులోని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో కోదండరామిరెడ్డి స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించనున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

* నెల్లూరు: కోవూరులో వైసీపీ నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

* నెల్లూరు నగరంలోని తడికల బజార్ సెంటర్లో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించనున్న మాజీ మంత్రి నారాయణ

* అనంతపురం : తాడిపత్రిలో రూ.24 కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వ్తెద్య సేవలు.

* అనంతపురం : తాడిపత్రి లోని పురాతన ఆలయం శ్రీ శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వస్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా నేడు నరమృగ వాహనం సేవ.

* అనంతపురం : తాడిపత్రి మండలంలో జెసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యువ చైతన్య బస్సు యాత్ర.

* ఏలూరు: మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. రాళ్లగుంట గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. సత్తెన్నగూడెం గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశమవుతారు. ద్వారకా తిరుమల గ్రామం కాపు కళ్యాణ మండపంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. తిరుమల గ్రామం కాపు కళ్యాణ మండపంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.

* శ్రీసత్యసాయి : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లేపాక్షిలో మహాశివరాత్రి పురస్కరించుకుని నేటి నుంచి ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు.. మహాగణపతి, సుదర్శన హోమాలు, గ్రామోత్సవం, ధ్వజారోహణ కార్యక్రమాలు

* తిరుపతి: నేడు పద్మావతి వర్శిటి 21వ స్నాతకోత్సవం… హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

* కర్నూలు: మంత్రాలయం పాత ఊరిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామివారిని రథంపై ప్రాకారం చుట్టూ ఉరేగింపు.

* నేడు సంగారెడ్డి మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్ష.. BRS పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సెన్ విజయలక్ష్మి పై అవిశ్వాసం పెట్టిన BRS, కాంగ్రెస్, BJP కౌన్సిలర్లు.. నేడు 11 గంటలకు అవిశ్వాస పరీక్ష

* విజయవాడ : నేడు నగరానికి రానున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.. లయోలా కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్

* గుంటూరు : నేడు తెనాలిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న జనసేన తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయం నుండి మార్కెట్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించనున్న నాదెండ్ల మనోహర్….

* పల్నాడు: నేడు చిలకలూరిపేటలో సిద్ధం సభ సమావేశం, రీజినల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అధ్వర్యంలో జరగనున్న సన్నాహక సమావేశం.. హాజరు కానున్న మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు, తదితరులు….

* ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు. ఢిల్లీ బీజేపీ పెద్దలని కలవనున్న చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికలకు పొత్తులో భాగంగా ఢిల్లీలో కీలక మంతనాలు జరపనున్న చంద్రబాబు. పవన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం. నిన్ననే చంద్రబాబు – పవన్ భేటీ.

* తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,887 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,532 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.14 కోట్లు

* తిరుమల: ఇవాళ వేములవాడ ఆలయానికి టీటీడీ తరపున పట్టువస్ర్తాల సమర్పణ..

* పల్నాడు: నేడు సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు బుల్లెట్ యాత్ర… సత్తెనపల్లి, నందిగం, బట్లూరు ,అబ్బూరు, తదితర ప్రాంతాల్లో పర్యటించనున్న మంత్రి అంబటి…

Exit mobile version