* నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. నేడు ఆదిలాబాద్, రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న ప్రధాని.. రూ.7వేల కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శ్రీకారం..
* నేడు ఆదిలాబాద్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. తెలంగాణలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.. ఎన్టీపీసీ రామగుండం రెండో యూనిట్, అంబారి- ఆదిలాబాద్ పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ
* హైదరాబాద్: ఈ రోజు ఇంటర్ పరీక్షకు పేపర్ సెట్ బీ ఎంపిక
* తిరుమల: ఇవాళ శ్రీశైలం మల్లన్నకు టీటీడీ తరపున పట్టువస్ర్తాల సమర్పణ
* నెల్లూరు రూరల్ మండలం కొత్త వెల్లంటిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* నెల్లూరులోని పుర మందిరంలో ఓటు ప్రాధాన్యంపై సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సిటీ వైసీపీ ఆధ్వర్యంలో సుబ్రమణ్యం మైదానంలోని సిద్ధం భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. రాజమండ్రి వైసీపీ అభ్యర్థి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
* ఏపీ: నేడు పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేయనున్న విద్యాశాఖ.. https://bse.ap.gov .in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో హాల్ టికెట్లు.. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు
* ఏలూరు: గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి తానేటి వనిత..
* విజయవాడ: ఎమెస్కో సాహిత్య వేదిక ను నేడు ప్రారంభించనున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
* మచిలీపట్నం కలెక్టరేట్ దగ్గర ఏపీ సర్పంచుల సంఘం అధ్వర్యంలో నేడు ధర్నా.. విధులు, నిధులు, అధికారులు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో ధర్నా
* అనంతపురం : కళ్యాణదుర్గం టీడీపీ కార్యలయంలో కార్యకర్తలతో నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు నేడు సమావేశం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం.
* శ్రీ సత్యసాయి : పెనుకొండ మండలంలోని పలు గ్రామాలలో కార్యకర్తలతో నాయకులతో సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో రా కదిలి రా ముగింపు బహిరంగ సభ. హాజరుకానున్న చంద్రబాబు నాయుడు. జాతీయ రహదారి పక్కన కియా పరిశ్రమ ఎదురుగా బహిరంగ సభ ఏర్పాటు.
* విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీ TLN హాలులో నేడు పాలనలో కొత్త పంథా_మన కోసం-మన వద్దకు సదస్సు.. ముఖ్య అతిథిగా సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం
* విశాఖ: నేడు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీ శక్తి వందన్ మార్తాండ్ ర్యాలీ..
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 4వరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పణ.. సాయంత్రం మయూరవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు.. రాత్రి క్షేత్ర వీధుల్లో శ్రీస్వామి అమ్మవారికి వైభవంగా గ్రామోత్సవం
* మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో జరిగే కళ్యాణానికి బ్రహ్మానంద స్వామిని ఆహ్వానించడానికి నేడు నంద్యాలకు కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు
* తిరుమల: 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,876 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 23,424 మంది భక్తులు.. హుండీ ఆదాయం 4.2 కోట్లు
* విజయవాడ: నేడు వసంత వ్యతిరేక నేతల ఉమ్మడి కార్యక్రమం.. ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో కలిసి పాల్గొంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, బొమ్మ సాని సుబ్బారావు
* విజయవాడ: ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని టీడీపీ అధ్వర్యంలో నేడు పోస్ట్ కార్డ్ ఉద్యమం.. హాజరుకానున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని
