Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐపీఎల్‌: నేడు బెంగళూరుతో కోల్‌కతా ఢీ.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్‌

* తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,320.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,710.. కిలో వెండి ధర రూ.80,600

* కర్నూలు: నేడు 2వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర.. నాగలాపురం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం.. కోడుమూరు, గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరు చేరుకోనున్న బస్సు యాత్ర.. ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ.. కర్నూలు పార్లమెంటులో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ.. రాత్రి పత్తికొండ మండలం రాతన లో జగన్ బస

* నంద్యాల: నేడు చంద్రబాబు బనగానపల్లి పర్యటన.. ప్రజాగళం సభలో పాల్గొననున్న చంద్రబాబు..

* ఇవాళ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న కడియం శ్రీహరి, కడియం కావ్య.. వరంగల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా కడియం కావ్య..!

* శ్రీ సత్యసాయి : సోమందేపల్లి మండలంలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* నేడు సిద్దిపేట జిల్లాలో BRS పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు.. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో సమావేశాల్లో పాల్గొననున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు

* కాకినాడ: నేడు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్న నివాస్

* హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం.. చైర్మన్‌ మధుయాష్కీ అధ్యక్షతన గాంధీభవన్‌లో భేటీ.. హాజరుకానున్న మున్షి, మంత్రి పొంగులేటి

* కాకినాడ: రేపటి నుంచి మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన.. తొలి రోజు పురుహూతికా అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు.. బషీర్ బీబీ దర్గా దర్శనం, క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనున్న పవన్ కల్యాణ్‌.. సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో బహిరంగ సభలో ప్రసంగించనున్న పవన్

* ప్రకాశం : ఒంగోలులో వైసీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం: గిద్దలూరులో వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధి కుందూరు నాగార్జున రెడ్డి అధ్వర్యంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశం, హాజరుకానున్న ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి..

* నెల్లూరు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి.. వింజమూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు.

* నెల్లూరు: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు

* నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం ప్రాంతంలో ఎన్నికల ప్రచార నిర్వహించనున్న నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయసారెడ్డి

* నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనపర్తిపాడులో వైసీపీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి

* నెల్లూరు: కలిగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచార నిర్వహించనున్న ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

* అనంతపురం : మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈనెల 30న జిల్లాకు రానున్న సీఎం జగన్. కర్నూలు నుంచి గుత్తికి రానున్న సిఎం. పామిడి , రాప్తాడు , ఇటుకలపల్లి మీదుగా రోడ్ షో.

* కడప : రేపు కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన.. మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటన ఉండేలా గతంలో ఏర్పాట్లు.. మైదుకూరులో చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు.. ప్రొద్దుటూరు పట్టణంలో మాత్రమే పర్యటించనున్న చంద్రబాబు నాయుడు..

* అన్నమయ్య: రేపు రాజంపేట పార్లమెంట్ పరిధిలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన.. మదనపల్లెలో రోడ్ షో చేపట్టినున్న కిరణ్ కుమార్ రెడ్డి

* కర్నూలు: నేడు ఉమ్మడి జిల్లాలో సీఎం, మాజీ సీఎం పర్యటన.. కర్నూలు జిల్లాలో జగన్ బస్సుయాత్ర, ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ.. బనగానపల్లెలో మాజీ సీఎం చంద్రబాబు ప్రజా గళం సభ

* రేపు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న కేకే, హైదరాబాద్‌ మేయర్ విజయలక్ష్మి… రేపు కేకే ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి

Exit mobile version