* ఐపీఎల్‌లో నేడు చెన్నైతో తలపడనున్న గుజరాత్.. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా ప్రారంభం కానున్న మ్యాచ్
* ఢిల్లీ: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు మరో 2 రోజుల కస్టడీ కోరే అవకాశం
* తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,810.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240.. కిలో వెండి ధర రూ.80,900
* జగిత్యాల జిల్లా : నేడు ధర్మపురి శ్రీ వెంకటేశ్వర నరసింహస్వామి తెప్పోత్సవం-డోలోత్సవం.. సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో పూజలు అందుకోనున్న యోగలక్ష్మీ నరసింహస్వామి
* నేడు సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.. హాజరుకానున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు
* నిజామాబాద్: నేడు డీసీసీబీ చైర్మన్ ఎన్నిక.. చైర్మన్ గా రమేష్ రెడ్డి ఎన్నిక లాంఛనం.. ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. మాజీ స్పీకర్ పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పదవి ఖాళీ
* ప్రకాశం : కొండేపి మండలం అనకర్లపూడి, ముప్పరాజుపాలెంలలో పల్లె పల్లెకు సిద్దం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిములపు సురేష్..
* ఒంగోలు నగరంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* తిరుమల: ఇవాళ రాత్రి తిరుమల చేరుకోనున్న సీజేఐ చంద్రచూడ్ దంపతులు.. శ్రీరచనా అతిధి గృహంలో బస చేయనున్న సీజేఐ చంద్రచూడ్ దంపతులు, రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ చంద్రచూడ్
* కాకినాడ సమద్ర తీరంలో నేటి నుంచి ఇండో అమెరికన్ సంయుక్త నావికాదళ విన్యాసాలు.. పాల్గొనున్న ఇండియా రక్షణాదళాలు, అమెరికా రక్షణాదళాలకు చెందిన 800 మంది అధికారులు.. ఇరుదేశాలు యుద్ధనౌకలు యుద్ధ ట్యాంకర్లతో విన్యాసాలు.. ఈ నెల 31 వరకు జరగనున్న విన్యాసాలు, నాలుగు రోజులు పాటు బీచ్ రోడ్డు మూసివేత
* నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని కోటమిట్ట ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి
* నెల్లూరు: ఏ.ఎస్.పేట.. ఆత్మకూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న కలెక్టర్ ఎం. హరి నారాయణన్
* నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నేతల సమావేశం
* శ్రీ సత్యసాయి : పరిగి మండలం ఊటుకూరు పంచాయతీలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న మంత్రి ఉషాశ్రీచరణ్
* శ్రీ సత్యసాయి : ధర్మవరం మండలంలోని గొల్లపల్లి, బడన్నపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి…
* అనంతపురం : శింగనమల వైసీపీలో ఆరని అసమ్మతి మంటలు. అభ్యర్థి వీరాను మార్చాలంటూ పట్టు బడుతున్న అసమ్మతి వర్గం నేతలు. నచ్చజెప్పే ప్రయత్నాలు చేసిన పార్టీ పెద్దలు. ఇవాళ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న అసమ్మతి నేతలు.
* తిరుమల: 15 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,731 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,156 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు
* కడప : కడప నగరంలోని కింగ్ ప్యాలెస్ లో జనసేన ఆత్మీయ సమావేశం…
* చిత్తూరు: కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన .. డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్న చంద్రబాబు.. రాజుపేట హాంద్రీ నీవా ప్రాజెక్టు పరిశీలన.. నాలుగు మండలాల నేతలతో సమావేశాలు..
* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో పొత్తుల రాజకీయం.. పొత్తుల భాగంగా బీజేపీ నాయకుడు సత్యకుమార్ కు ధర్మవరం టిక్కెట్ ఖరారు అయిందంటూ ప్రచారం. ధర్మవరం టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే సూర్యానారాయణకు కేటాయించాలంటూ ఇవాళ ర్యాలీకి పిలుపు నిచ్చిన మద్దతు దారులు. ఇప్పటికే ధర్మవరం టిక్కెట్ శ్రీరామ్‌కు కేటాయించాలంటూ ర్యాలీ నిర్వహించిన టిడిపి కార్యకర్తలు.
* కడప : నేడు కమలాపురంలో టీడీపీ నేత సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం…
* కడప: ఒంటిమిట్టలో ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుటుంబానికి న్యాయం చేయాలంటూ కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన..
* నేడు ఉమ్మడి కడప జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
* తిరుమల: ఇవాళ తిరుమలకు మెగా కుటుంబం.. రేపు రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్న రాంచరణ్, ఉపాసన దంపతులు
