* ఐపీఎల్ 2024: నేడు పంజాబ్‌తో బెంగళూరు ఢీ.. రాత్రి 7.30కి బెంగళూరు వేదికగా మ్యాచ్
* తిరుమల: ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుమల: ఇవాళ తుంభుర తీర్ద ముక్కోటి.. ఉదయం 11 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ..
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,532 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 29,438 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు
* చిత్తూరు: నేటి నుండి రెండు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ.. కార్యకర్తలతో సమావేశం.. రేపు హంద్రీనీవా కాల్వను పరిశీలించనున్న చంద్రబాబు.. ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో సభలు, రోడ్‌షోలు, 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్‌లో చంద్రబాబు ప్రచారం
* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* బాపట్ల : అద్దంకి మండలం శింగరకొండలో ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీప్రసన్నాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్లు, భారీగా హాజరుకానున్న భక్తులు..
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి పర్యటన.. రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు ఆత్మీయ సమావేశానికి హాజరుకానున్న ఎంపీ.. రామచంద్రపురం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ కు తన అనుచరులు సపోర్ట్ చేయాలని సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ తోట
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మనుబోలు మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
* నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* నెల్లూరు నగరంలోని సెట్టిగుంట రోడ్డు.. చాకలిపేట ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి
* నెల్లూరు: వెంకటగిరిలో వైసీపీ నేత మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల ర్యాలీ..
* నెల్లూరు: కావలి రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కొవ్వూరు, రాజమండ్రి మధ్య దెబ్బతిన్న గామన్ బ్రిడ్జ్. పరిశీలనకు నిపుణుల కమిటీ రాక.. కొవ్వూరు టోల్ గేట్. సమీపంలో. కుడివైపు దెబ్బతిన్న గామన్ బ్రిడ్జి.. బ్రిడ్జి కుడివైపు వాహనాల రాకపోకలను నిలిపివేసి.. ట్రాఫిక్ ను నియంత్రించిన అధికారులు.
* అనంతపురం : గుత్తి పట్టణంలోని కోట వీధిలోని 11 వ వార్డులో వార్డు కౌన్సిలర్లు, వైకాపా కార్యకర్తలతో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ముఖాముఖి కార్యక్రమం.
* అనంతపురం : ఇంటింటికీ వైసీపీ కార్యక్రమంలో భాగంగా పాతవూరు ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి పర్యటన.
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం. కర్నాటక నుంచి తరలిరానున్న భక్తులు.
* ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరంలో బలవన్మరణా నికి పాల్పడిన చేనేత కుటుంబ సభ్యుల పరామర్శకు నేడు టీడీపీ కమిటీ సభ్యులు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వనున్న టీడీపీ కమిటీ…
* అనంతపురం : ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 29 మందిని సస్పెండ్ చేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమి. సస్పెండ్ అయిన వారిలో 18 మంది వాలంటీర్లు.
* కర్నూలు: నేడు కోడుమూరు మండలం గోరంట్ల శ్రీ లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలలో హనుమంతోత్సవం
