NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* టీ-20 వరల్డ్‌ కప్‌: నేడు శ్రీలంకతో బంగ్లాదేశ్ ఢీ.. న్యూజిలాండ్‌ – ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మ్యాచ్‌

* ఢిల్లీ: ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం.. దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితులు, ఎన్నికల్లో సాధించిన సీట్లు , వైఫల్యాలు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చ.

* ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో పాల్గొననున్న రేవంత్..

* నేడు భువనేశ్వర్‌లో జరగనున్న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం.. ఒడిశా సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది

* హైదరాబాద్‌: నేడు మృగశిర కార్తె.. చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజల నుంచి భారీ డిమాండ్‌.. నిన్నటి నుంచి చేపలు కొనుగోలు

* హైదరాబాద్‌: మృగశిర కార్తె నేపథ్యంలో.. నేడు, రేపు పబ్లిక్‌ గార్డెన్‌లో చేప ప్రసాదం పంపిణీ..

* హైదరాబాద్‌: రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించనున్న విద్యాశాఖ.. మల్టీజోన్‌-1లో శనివారం నుంచి ఈ నెల 22 వరకు, మల్టీజోన్‌-2లో శనివారం నుంచి ఈ నెల 30 వరకు చేపట్టనున్న అధికారులు

* ప్రకాశం : మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఒంగోలు టీడిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి..

* దర్శి టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశంలో పాల్గొననున్న నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి..

* బాపట్ల : అద్దంకి మండలం శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు..

* నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో సిటీ నియోజకవర్గ టిడిపి నేతలతో ఎమ్మెల్యే నారాయణ సమావేశం

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుండి ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక లో “గేమ్ చేంజర్ “. సినిమా షూటింగ్.. హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ .. ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న గేమ్ చేంజర్ సినిమా. మూడు రోజులపాటు జరగనున్న సినిమా షూటింగ్…

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: మెగా హీరో రామ్ చరణ్ సినిమా షూటింగ్ నిమిత్తం వాడపల్లి రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. బొబ్బర్లంక – రావులపాలెం రహదారిలో ట్రాఫిక్ మళ్లింపు.. ప్రజలు సహకరించాలని కోరిన ఆత్రేయపురం పోలీసులు

* తిరుమల: 18వ తేది నుంచి ఆన్ లైన్ లో సెప్టంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

* తిరుమల: 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,830 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 30,810 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.2 కోట్లు