NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

* నేడు రాజమండ్రి నుంచి ఢిల్లీకి పురంధేశ్వరి.. ఉదయం 7.35 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న బీజేపీ ఏపీ చీఫ్‌

* ఢిల్లీ: రేపు మరోసారి ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్.. రేపు రాష్ట్రపతి ముర్మును కలవనున్న ఎన్డీఏ నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు

* ప్రకాశం : రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం.. మార్కాపురంలో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం.. ఈదురు గాలుల కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం..

* ప్రకాశం : ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో ఎంఎల్ఏ దామచర్ల జనార్దన్ సమావేశం..

* కనిగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఎంఎల్ఏ ఉగ్ర నరసింహారెడ్డి సమావేశం..

* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు జులై 20వ తేదీన పాలకవర్గం ఎన్నికలు.. జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ. ఎన్నికల అధికారిగా కొవ్వూరు డివిజనల్ సహకార అధికారి, వి కృష్ణ కాంత్

* తిరుపతి ఎంపి సీటుపై బిజెపిలో ఆసక్తికరమైన చర్చ.. ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచిన ఎంపి సీటు ఓడిపోవడానికి గల కారణాలపై అన్వేషణ.. 14 వేల ఓట్లు కూటమీ నుండి క్రాస్ ఓటింగ్ జరగడమే ఓటమి కారణం… అత్యధికంగా గూడురులో 24 వేలకుపైగా క్రాష్ ఓటింగ్…

* అనంతపురం : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి ఈనెలలో రాజీనామా చేస్తానని ప్రకటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి. రాష్ట్రంలో టిడిపి,బిజెపి,జనసేన కూటమి అధికారంలోకి రావడంతో తన నిర్ణయం ప్రకటించిన జేసీ.

* అనంతపురం : యాడికి మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లఘించిన 30 మందిప్తె కేసులు నమోదు.

* అనంతపురం : తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో నిన్న 9 మంది వ్తెసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవాళ మరికొంత మంది వ్తెసీపీ నాయకులు , కార్యకర్తలను అరెస్ట్ లు చేసే అవకాశం.