Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* పశ్చిమ గోదావరి: ఈ రోజు భీమవరంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ.. అంబేద్కర్‌ సెంటర్ వద్ద బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు.. తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం.. భీమవరం నుంచి పవన్ పోటీ చేయాలని కోరుతున్న అభిమానులు, పార్టీ శ్రేణులు..

* నేడు ఖమ్మంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన.. రాహుల్ గాంధీ పర్యటన పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమీక్ష

* నేడు కొమురం భీం జిల్లాకు సీఎం కేసీఆర్.. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాల పంపిణీ చేయనున్న సీఎం.. కొమురం భీం పోరు గడ్డ నుంచే పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్న సీఎం.. సాయంత్రం బహిరంగ సభ.

* 107వ రోజుకు చేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. పాలేరు నియోజకవర్గం తల్లంపాడు గ్రామం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. తల్లంపాడు, మద్దులపల్లి కోదాడ క్రాస్ రోడ్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.. తల్లంపాడు గ్రామం దాటిన తర్వాత పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత కార్నర్ మీటింగ్ జరుగుతుంది.

* నేడు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటన.. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా మీటింగ్ లో పాల్గొననున్న ఈటల రాజేందర్

* మంచిర్యాల జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురం భీం జిల్లా పర్యటన నేపథ్యంలో కోటపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల విస్తృత తనిఖీలు..

* వరంగల్: శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో భాగంగా 12వ రోజు ఉదయం బలాకా క్రమం, సాయంత్రం విజయా క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు..

* నేడు మహబూబాబాద్ జిల్లా లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. పోడు భూములు పంపిణీ చేయనున్న కేటీఆర్.. తహసీల్దార్‌ కార్యాలయంలో 50 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి పనుల పైలాన్ ఆవిష్కరించనున్న కేటీఆర్.. వెజ్ అండ్ నాన్ వెజ్ మోడల్ మార్కెట్ ను ప్రారంభిస్తారు.. రామచంద్రపురం కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ప్రారంభిస్తారు.. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభలో పాల్గొని 24,100 గిరిజన కుటుంబాలకు పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తారు

* ప్రకాశం : త్రిపురాంతకం మండలం దూపాడులో గ్రామసచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం ప్రారంభించి.. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌.

* బాపట్ల : చీరాలలో విద్యుత్ చార్జీలు పెంపు, టారిఫ్ చార్జీలను రద్దు చేయాలని విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా..

* తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు బర్డ్ హస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేటివ్ ఆర్థో ప్లాస్టి సమ్మిట్.. హాజరుకానున్న 200 మంది ఆర్దోపెడిక్ డాక్టర్లు, సమ్మిట్ లో లైవ్ సర్జరీలు నిర్వహించనున్న డాక్టర్లు.

* పశ్చిమగోదావరి: ఉదయం 10 గంటలకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రెస్ మీట్..

* భీమవరంలో పవన్ బహిరంగ సభ నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. పలు రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపు..

* విశాఖ: సింహాచలం గిరి ప్రదక్షిణకు పూర్తయిన ఏర్పాట్లు.. చందనోత్సవం వైఫల్యాలతో మరింత అప్రమత్తంగా ప్రణాళిక.. జులై 2న (ఆదివారం) ప్రారంభమై మరుసటి రోజు ముగియనున్న అధ్యాత్మిక యాత్ర.. 32 కిలోమీటర్ల సింహాగిరి ప్రదక్షిణలో పాల్గొనున్న వేలాది మంది భక్తులు.. అడవివరం, హనుమంతవాక, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార మీదుగా సింహాచలం చేరుకోనున్న భక్తులు.

* విశాఖ: నేడు ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ చైతన్యయాత్ర.. భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో పాల్గోనున్న పార్టీ ముఖ్యనాయకత్వం..

* విశాఖ: ఆదానీ గంగవరం పోర్టులో ముదురుతున్న వివాదం.. సామూహికంగా విధులను బహిష్కరించిన కార్మికులు. దశలవారీగా ఆందోళనలు ఉధృతం చేయాలని అఖిలపక్షం నిర్ణయం.. నేడు పోర్టు జంక్షన్‌లో నిరసన ప్రదర్శన, ర్యాలీ..

* శ్రీ సత్యసాయి : ఏకాదశి పండుగ పురస్కరించుకుని చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎర్రచిన్నన్నగారి పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవ కార్యక్రమం.

Exit mobile version