NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* అమరావతి: జియో టవర్స్ ను ప్రారంభించనున్న సీఎం జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌..

* అమరావతి: యువజన, క్రీడా వ్యవహారాలపై సీఎం జగన్ ఫోకస్.. యువజన, క్రీడా వ్యవహారాలపై నేడు ఉదయం 11.30 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష

* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పర్యటన.. సిద్దిపేటలో 63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ ను మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభించనున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఐటీ టవర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి.. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్న ఇద్దరు మంత్రులు

* సిద్దిపేట : నేడు గజ్వేల్ నియోజకవర్గంలో 20 దేశాల ప్రతినిధుల పర్యటన.. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించనున్న వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చ రల్ ఆర్గనైజర్ సంస్థకు సంబంధించిన 20 దేశాల ప్రతినిధులు.. మర్కుక్ లోని రైతు వేదికలో రైతులతో కలిసి విదేశీ ప్రతినిధుల మాట ముచ్చట

* మెదక్ జిల్లాలో తెలంగాణ సీఎస్ శాంతకుమారి పర్యటన రద్దు.. షెడ్యూల్‌ ప్రకారం నేడు పల్లెప్రగతి దినోత్సవంలో పాల్గొనాల్సి ఉన్న సీఎస్.. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయినట్టు మెదక్ కలెక్టర్ ప్రకటన

* నేడు ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి దయాకర్ రావు పర్యటన

* హైదరాబాద్‌: నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు లాసెట్‌ ఫలితాలు విడుదల

* అనంతపురం : కళ్యాణదుర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .

* కడప : నేడు విద్యుత్ సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ ఎస్సీ కార్యక్రమం..

* విజయవాడ: పెంచిన విద్యుత్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా సీపీఐ అధ్వర్యంలో నేడు బెజవాడలో రౌండ్ టేబుల్ సమావేశం

* నేడు గిరిజనులతో వర్చ్చువల్ గా మాట్లాడనున్న సీఎం జగన్.. పాడేరు నియోజకవర్గం సంబంధించి జి.మాడుగుల మండలం సుబ్బులు గ్రామంలో.. అరకు నియోజకవర్గం సంబంధించి హుకుంపేట మండలం భీమవరం గ్రామాల్లో గిరిజనులతో మాట్లాడనున్న సీఎం

* అల్లూరి జిల్లా: నేడు 100 సెల్ టవర్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

* విజయవాడ: వైఎస్‌ జగన్ పై దాడి కేసులో నేడు NIA కోర్టు విచారణ.. నిందితుడు శ్రీనివాస్ ను కోర్టులో హాజరుపరచనున్న NIA అధికారులు.. ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలు చేసిన సీఎం జగన్

* కరీంనగర్: నేడు నగరంలో, కరీంనగర్ రూరల్ మండలంలో మంత్రి గంగుల కమలాకర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి గంగుల