* తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఆధ్వర్యంలో భారీగా చేరికలు. నేడు బీజేపీ లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ లు లక్ష్మా రెడ్డి, జైపాల్‌రెడ్డి.. అమిత్‌షాతో సమావేశమై ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకొనున్న నేతలు.. తదుపరి విడతలో, మరో వారంలో సుమారు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
* భద్రాచలం వద్ద 54.20 అడుగులు చేరుకున్న గోదావరి, కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
* నేడు గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క .. ఉదయం 10.00 గంటలకు భద్రాచలం లో స్థానిక ఎమ్మెల్యే పోదెం వీరయ్యతో కలిసి గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న భట్టి విక్రమార్క.. వైరా నుండి ఉదయం 08:00 గంటలకు బయలుదేరనున్న భట్టి విక్రమార్క.
* నెల్లూరులో నేటి నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ.. వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులు, విస్తృతంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
* నెల్లూరు: స్వర్ణాల చెరువు వద్ద నేటి నుంచి రొట్టెల పండుగ.. హాజరుకానున్న ప్రజాప్రతినిధులు… అధికారులు
* ప్రకాశం : దోర్నాల మండలం కటకానిపల్లిలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంబించి అనంతరం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. మద్ధిపాడు మండలం గుండ్లాపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.. అనంతరం పలు గ్రామాల మీదుగా అద్దంకి శివారు విడిది కేంద్రం చేరుకుని బస..
* నెల్లూరులోని పుర మందిరంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య ఆరాధన సమితి ఆధ్వర్యంలో అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలు
* రేపు ఉదయం 6 గంటల 30 నిముషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-56 రాకెట్ ప్రయోగం.. సింగపూర్ కు చెందిన ఉపగ్రహాలను కక్షలోకి పంపనున్న ఇస్రో.. ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్, శ్రీహరికోటకు చేరుకుని ప్రయోగ ప్రక్రియను పరిశీలిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్
* తిరుమల: ఆగస్టు 7వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం, 8వ తేదీతో ముగియనున్న టీటీడీ పాలకమండలి గడువు
* తిరుమల: ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. నెల రోజులు పాటు పుష్కరిణి హరతీ రద్దు చేసిన టీటీడీ
* తిరుమల: అధిక మాసం కావడంతో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు.. సెప్టంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 14 నుంచి 22వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
* అనంతపురం : కళ్యాణదుర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* తూర్పుగోదావరి జిల్లా : ఈ అర్థరాత్రి నుండి మళ్లీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. తగ్గినట్లే తగ్గి మళ్లీ వరద ఉధృతి పెరగడంతో నది పరివాహక ప్రాంత ప్రజల్లో భయాందోళనలు, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పొంగిపొర్లుతున్న వైనతేయ, వశిష్ఠ , గౌతమి , వృద్ధగౌతమి నదులు.. జలదిగ్భంధంలో చిక్కుకున్న 22 లంక గ్రామాలు, వరద ఉధృతి కి నీట మునిగిన కాజ్ వేలు. నిలిచిన రాకపోకలు..
* అనంతపురం : అధిక శ్రావణమాసం సందర్భంగా నగరంలోని హౌసింగ్ బోర్డులోని భక్తాంజనేయస్వామి ఆలయంలో 500 కేజీల తేనెతో అభిషేకం.
* అనంతపురం : ఈనెల 30 న తెదేపా ఆధ్వర్యంలో మ్తెనారిటీల సదస్సు.
* అనంతపురం : జిల్లా బాస్కెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో అండర్ – 16 బాలబాలికల పోటీలు.
* గుంటూరు: రేపు మిర్చి యార్డు పాలకమండలి ప్రమాణ స్వీకారం, హాజరుకానున్న పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు …
