NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* అమరావతి: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన.. అర్హులైన 357 మంది విద్యార్థుల విదేశీ విద్యకు ప్రభుత్వ ఆర్థిక సహాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.45.53 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం

* హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రాత్రి నుంచి గ్యాప్‌ లేకుండా దంచికొడుతోన్న వాన.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

* తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. కొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.. రాష్ట్రంలో కొనసాగుతోన్న రెడ్‌ అలర్ట్‌

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. కాకాణి గోవర్ధన్ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు

* నెల్లూరు నగరంలో జరగనున్న రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించనున్న ఎం.ఎల్.ఏ.కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

* నెల్లూరులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆసుపత్రిలో వివిధ విభాగాలను ప్రారంభించనున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

* ప్రకాశం : పెద్దారవీడు మండలం గోబ్బురులో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : నారా లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం.. ఒంగోలు శివారు క్యాంప్ సైట్ లో జయహో బీసీ సదస్సు నిర్వహించనున్న నారా లోకేష్..

* ప్రకాశం : ఇవాళ జిల్లాకు భారీ వర్షా సూచన జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. అత్యవసర పరిస్థితులకు టోల్ ఫ్రీ నంబర్ 1070, 18004250101 ఏర్పాటు..

* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన.. రాజమండ్రి, శాటిలైట్ సిటీలో జరుగు బుర్రకథ చిత్రకారుడు విబుతి బాబురావు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు.. తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు.

* ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తం గా కురుస్తున్మ వర్షాలు.. నాగావళికి వరద ముప్పు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసొన అధికార యంత్రాంగం.. మత్సకారులు చేపల‌వేటకు వెల్ల వద్దంటూ‌ సూచన.

* బాపట్ల: నేడు అమృతలూరు మండలం ఎలవర్రులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…

* గుంటూరు: ఈనెల 30న మిర్చి యార్డ్ లో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు.

* గుంటూరు: ఈనెల 31 వరకు జడ్పీ సమావేశ మందిరంలో ఏపీ సాధికారికత సంస్థ ఆధ్వర్యంలో పెట్టుబడి రహిత సాగుపై రైతులకు శిక్షణ తరగతులు..

* గుంటూరు: ప్రభుత్వ హాస్పిటల్ లో ఓపీ రిజిస్టర్‌ సమయాన్ని పెంచిన అధికారులు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్లు..

* గుంటూరు: నేడు ఉమ్మడి జిల్లాలో పీఎఫ్ ఖాతాదారుల సమస్యల పరిష్కార కార్యక్రమం…

* తూర్పుగోదావరి జిల్లా: గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన ఇరిగేషన్ అధికారులు.. బ్యారేజీ నుండి 10 లక్షల 5వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల.

* ఎగువ ప్రాంతాలతోపాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గంట గంటకు పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. వర్షాలు, వరదలు కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నది పరివాహక ప్రాంత ప్రజలు అతలాకుతలం .

* అంబేద్కర్ కోనసీమ: గోదావరి, సముద్ర తీర ప్రాంత వాసులు ఈ నెల 28వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలి, తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఐదు రోజుల పాటు సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లరాదని సూచించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా..

* వాయుగుండం కారణంగా బంగాళాఖాతంలో సముద్రం అల్లక ల్లోలంగా ఉంది.. వరద నేపథ్యంలో గోదావరి రేవుల వద్ద అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశం.

* ఏలూరు: అధిక వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయిగూడెం మండలాలలోని పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు ఈ రోజు, రేపు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్.

* పోలవరం ప్రాజెక్టుకు భారీ వరద.. ప్రాజెక్ట్ స్పీల్ వే 48 గేట్ల నుంచి దిగువకు 10,40,546 క్యూసెక్కుల వరద ప్రవాహం..

* పల్నాడు: పులిచింతల ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన నీటి ప్రవాహం.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పులిచింతలకు చేరుకుంటున్న వరద నీరు.. పులిచింతలకు 18, 239 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, పులిచింతల ప్రస్తుత నీటిమట్టం 21.88 టీఎంసీలు,

* తిరుమల: ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేసిన టీటీడీ

* అనంతపురం : తాడిపత్రి మున్సిపల్ కమీషనర్ వ్తెఖరిని నిరసిస్తూ కార్యాలయంలో నిద్రించి నిరసన తెలిపిన జెసి ప్రభాకర్ రెడ్డి. ప్రోటోకాల్, నిబంధనాలకు విరుద్ధంగా పనుల ప్రారంభించడంపై కమీషనర్ సమాధానం చెప్పాలంటున్న జేసీ

* కర్నూలు: వర్షం కారణంగా నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు

Show comments