NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు సంగారెడ్డి జిల్లాలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యటన.. కందిలోని ఐఐటీ హైదరాబాద్ లో జరిగే 12వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ఇస్రో చైర్మన్.. ఇస్రో చైర్మన్ సోమనాథ్ చేతుల మీదుగా పట్టాలు అందుకోనున్న వెయ్యి మందికి పైగా విద్యార్థులు

* ప్రకాశం : త్రిపురాంతకం మండలం లేళ్లపల్లిలో నేడు గ్రామసచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌.. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు

* బాపట్ల : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు.. సంఘీభావంగా హాజరుకానున్న పలు నియోజకవర్గాల కాపు సామాజిక వర్గ నేతలు..

* నెల్లూరు : ఇవాళ కందుకూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర..

* బాపట్ల : ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని చీరాల లోని శ్రీ భద్రావతి సమేత బావణారసి స్వామి వారి ఆలయంలో అమ్మవారికి సమర్పించే ఆషాడం సారేకు నగరోత్సవం..

* ప్రకాశం : త్రిపురాంతకంలోని ప్రసిద్ధ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి సహస్ర ఘటాభిషేకం, శాఖంబరి అలంకరణలో దర్శనమివ్వనున్న పార్వతి త్రిపురాంబ అమ్మవారు..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు వెంకటాచలం, ముత్తుకూరుమండలాలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* పోలవరం వద్ద స్వల్పంగా పెరిగిన నీటిమట్టం.. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం.. పోలవరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 27.21 మీటర్లు.. దిగువకు వెళ్తున్న 85 వేల క్యూసెక్కులు వరద నీరు..

* పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురంలో నేడు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ బస్సు యాత్ర..

* అంబేద్కర్ కోనసీమ జిల్లా : నేడు శనిత్రయోదశి సందర్భంగా మందపల్లి దేవస్థానంలో పోటెత్తిన భక్తులు.. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు.. మందపల్లి దేవస్థానంలో శనేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్న భక్తులు.. శని దోష నివారణకు నువ్వుల నూనెతో పూజలు చేసి, నల్లని వస్త్రాలను దానం చేస్తున్న భక్తులు

* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోం మంత్రి తానేటి వనిత కార్యక్రమాలు.. కొవ్వూరు టౌన్ 16 వ వార్డు ఔరంగాబాద్ లో జగనన్న సురక్ష కార్యక్రమం లో పాల్గొంటారు. చాగల్లులో, తాళ్లపూడిలో ప్రక్కిలంక గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.

* కాకినాడ: నేడు జిల్లాలో పర్యటించనున్న ఇంఛార్జి మంత్రి సీదిరి అప్పరాజు.. జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి

* అనంతపురం : వర్షాలు సమృద్ధిగా రావాలని పంటలు బాగా పండాలని కోరుతూ గుత్తి పట్టణంలోని శివాలయంలో చేయు వరుణ పూజ కార్యక్రమం.

* అనంతపురం : కళ్యాణదుర్గంలో వ్తెసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .

* అంబేద్కర్ కోనసీమ: నేడు ముమ్మిడివరంలో పర్యటించనున్న ఇంఛార్జి మంత్రి జోగి రమేష్.. జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి

* అంబేద్కర్ కోనసీమ: నేడు ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారికి ఆషాడమాస సారె సమర్పించనున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. తొలిసారి మాణిక్యాంబ అమ్మవారిని శాకాంబరి దేవి గా అలంకరణ

* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

* విశాఖ: నేడు ఎమ్మెల్యేలు, జీవీఎంసీ కార్పొరేటర్ల తో వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. తాజా రాజకీయ పరిణామాలు, స్థాయి సంఘ ఎన్నికల్లో పోటీపై చర్చ…

* పల్నాడు: నేడు నరసరావుపేటలో సాహిత్యమేళా

* నేడు చిలకలూరిపేట మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం…

* కాకినాడ: నేడు పంపా రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న మంత్రి దాడిశెట్టి రాజా.. తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలలో 12,500 ఎకరాలకు అందనున్న సాగునీరు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు చాగల్నడు, కొత్త వెంకటనగరం, తొర్రిగడ్డ, పుష్కర ఎత్తిపోతల పథకాల నుండి రైతంగానికి ఖరీఫ్ పంటకు సాగునీరు విడుదల

* తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద స్వల్పంగా పెరిగిన నీటిమట్టం.. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం.. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 8.1 అడుగులు. బ్యారేజీ నుండి 85 వేల క్యూసెక్కులు వరద నీరు సముద్రంలోకి విడుదల

* బాపట్ల : కొల్లూరు మండలం పొతర్లంక గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…

* శ్రీకాకుళం: ఉదయం 10 గంటలకు ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ దగ్గర జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. 11 గంటలకు సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని మెట్టెక్కివలస వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.