NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో నేడు సర్వే చేపట్టనున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా

* అమరావతి: నేడు ఆర్ 5 జోన్‌లో ఇళ్ల శంఖుస్థాపన.. 50,793 ఇళ్ల నిర్మాణాలకు శంఖుస్థాపన చేయనున్న సీఎం జగన్.. రూ.1,829.57 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం.. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలోవ్యయంతో అన్ని మౌలిక వసతులతో చేపట్టనున్న 50,793 ఇళ్ల నిర్మాణానికి, 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్ లో శంఖుస్థాపన చేయనున్న సీఎం జగన్.. 71, 811 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు

* నేడు అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పలువురు జనసేన నాయకుల హౌజ్ అరెస్ట్ ….. ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామని జనసేన హెచ్చరికల నేపథ్యంలో పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు…

* ప్రకాశం : 164వ రోజుకు చేరిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. చీమకుర్తి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించి.. చీమకుర్తిలో బహిరంగ సభలో మాట్లాడనున్న లోకేష్.. అనంతరం పలు గ్రామాల మీదుగా సంతనూతలపాడు శివారు విడిది కేంద్రం చేరుకుని బస.

* ప్రకాశం : మద్దిపాడులో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం..

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు, వసతి టికెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

* ప్రకాశం : ఇవాళ ఒంగోలుకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, స్వాగతం పలకనున్న అభిమానులు.. నగరంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న బాలినేని..

* తిరుమల: రేపు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన అదనపు కోటా విడుదల.. రోజుకి 4 వేల చొప్పున టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైన టీటీడీ.. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్న టిటిడి

* అల్లూరి సీతారామ రాజు జిల్లా: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలతో ఏవోబీలో హై అలెర్ట్. విస్తృతంగా పోలీసు తనిఖీలు. ఈ నెల 28 నుంచి ఆగ‌స్టు మూడు వ‌ర‌కూ జరగనున్న మావోయిస్టు అమ‌ర‌వీరుల వారోత్సవాలు..

* విశాఖ: నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంజనీరింగ్ కౌన్సిలింగ్.. APEAP సెట్లో ర్యాంకులు పొందిన వారికి వెబ్ ఆధారిత కౌన్సిలింగ్..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని వినుకొండలో జరిగే వివిధ కార్యక్రమంలో పాల్గొంటారు

* తూర్పు గోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత కార్యక్రమాలు.. చాగల్లు మండలం ఉనగట్ల గ్రామం నందు జరుగు జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు, చాగల్లు గ్రామం నందు జరుగు జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు, తాళ్లపూడి మండలం తిరిగుడుమెట్ట గ్రామం నందు జరుగు జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు.

* తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,792 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 29,656 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.2 కోట్లు

* నేడు అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గుంటూరు ,పల్నాడు జిల్లాల లో పోలీసు కార్యాలయాల లో స్పందన కార్యక్రమం రద్దు …

* నేడు సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్ లో జాతీయ నూతన విద్యా విధానంపై సమావేశం.. పాల్గొననున్న ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ VC జగదీశ్వర రావు