* అమరావతి: అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం.. ఏటా రెండు పర్యాయాలు జనవరి- జూన్, జూలై- డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన వారికి డిసెంబర్ / జనవరిలో అందజేత. ఆగస్టు- డిసెంబర్, 2023 మధ్య అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 68,990 అర్హులకు రేపు లబ్ది.. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్
* ఢిల్లీ: నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం.. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన మరో 1800 కోట్లు విడుదల చేయాలని కోరనున్న సీఎం. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని సైతం తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో ఈరోజు ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్‌ను కలవనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
* ప్రకాశం : కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. కనిగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు.. ప్రారంభ కార్యక్రమంగా కనిగిరిలో లక్ష మందితో భారీ బహిరంగసభ నిర్వహించేలా టీడీపీ ఏర్పాట్లు..
* ఏపీలో 25వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్యాలయాల వద్ద 11వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు…
* ప్రకాశం : జరుగుమల్లిలో జగనన్నకు చెబుదాం పేరిట కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం..
* తిరుమల: నేటితో శ్రీవారి ఆలయంలో ముగియనున్న అధ్యాయనోత్సవాలు
* విశాఖ: నేడు తెలుగుదేశం పార్టీ ‘నిజం గెలవాలి యాత్ర’.. చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నారా భువనేశ్వరి ఓదార్పు.. దక్షిణ, ఉత్తర, గాజువాక నియోజకవర్గాల్లో ఆరు కుటుంబాలను కలవనున్న నారా భువనేశ్వరి
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం.. ముత్తుకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు నగరంలోని మండపాల వీధి ప్రాంతంలో జనం కోసం జనసేన కార్యక్రమం.. పాల్గొననున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు మను క్రాంత్ రెడ్డి
* నెల్లూరు: రాపూర్ లో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర
* నెల్లూరు: చేజర్ల మండలంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* తూర్పు గోదావరి జిల్లా: నేటి నుంచి రాజానగరం గైట్ కాలేజీలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. తెలుగుదనంతో వుట్టిపడుతున్న గైట్ ఆవరణ.. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజులు పాటు జరగనున్న 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
* విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి దివ్య ఆశీస్సులతో తెలుగు మహాసభల అంకురార్పణ.. తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు వచ్చే-తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు “ఆన్ డ్యూటీ’ సౌకర్యం.. ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తూ. ఉత్తర్వులు జారీ
* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..
* ఏలూరు: ఏలూరు ఇండోర్ స్టేడియంలో పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించనున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి..
* అనంతపురం : పెద్దపప్పూరు మండలం లోని చీమల వాగుపల్లి, నరసాపురం, పసలూరు గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాల భవనాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* శ్రీ సత్యసాయి: సోమందేపల్లి మండలం క్రీస్తు జ్యోతి స్కూల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వెంకట్ రాముడు అనే వ్యక్తి మృతి.
* విజయనగరం జిల్లా: పూసపాటిరేగ మండలం కనిమెళ్ళ గ్రామములో పెరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమం .. కొత్త పింఛన్లు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాలు
*అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలంలో పలు గ్రామాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు.. పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేయనున్న డిప్యూటీ సీఎం
* విశాఖ: నేడు అరకు వ్యాలీ మండలం కొత్త బల్లు గూడలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్
* తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59,522 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 18,544 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు
