Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేడు కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) విలీనం.. ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్న వైఎస్‌ షర్మిల.. ఈరోజే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న షర్మిల

* ఢిల్లీ: నేడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం.. ఉదయం 11 గంటలకు విస్తృత సమావేశం. రెండు ప్రధాన అంశాలపై చర్చ.. రానున్న లోకసభ ఎన్నికలు, రాహుల్ గాంధీ “భారత్ న్యాయ యాత్ర” పై సమాలోచనలు.. 2024 లోకసభ ఎన్నికలకు సన్నాహక సమావేశం

* నేడు ఢిల్లీకి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యనేతలతో సమావేశం. రానున్న లోకసభ ఎన్నికలకు సమాయత్తంపై సమాలోచనలు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగనున్న “భారత్ న్యాయ యాత్ర” పై చర్చ.

* హైదరాబాద్‌: నేడు ఉదయం 11:30 గంటలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌..

* హైదరాబాద్‌: తెలంగాణ భవన్ లో నేడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ సన్నాహక సమావేశం

* అమరావతి: ఇవాళ ఉదయం పది గంటలకు ఏపీ బీజేపీ నేతల కీలక భేటీ. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ముఖ్యుల భేటీ. 45 మంది ముఖ్య నేతలకు మాత్రమే ఆహ్వానం. పొత్తులపై కీలక చర్చ. టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై అభిప్రాయాలు తీసుకోనున్న తరుణ్ చుగ్.

* ఏపీలో 24వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..

* ఏపీలో మున్సిపల్ కార్యాలయాల వద్ద 10వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు…

* ప్రకాశం : సింగరాయకొండలో ప్రభుత్వం పెంచిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు శంఖారావ సభ ఏర్పాట్లను పరిశీలించనున్న టీడీపీ నేతలు..

* పల్నాడు: నేడు మాచర్ల నియోజకవర్గం లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

* గుంటూరు: ప్రభుత్వం తెచ్చిన భూహక్కు చట్టాన్ని నిరసిస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ నిరసన.. ఈనెల ఐదు వరకు కోర్టు విధుల బహిష్కరణ…

* గుంటూరు: కాకుమాను లో వైయస్సార్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మేకతోటి సుచరిత…

* గుంటూరు: రైల్వే మరమ్మతుల కారణంగా దుగ్గిరాల మండలం చిలువూరు రైల్వే గేటును నేటినుండి 10వ తేదీ వరకు మూసి వేయనున్న రైల్వే అధికారులు.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు రూరల్ పరిధిలోని దర్గామిట్ట ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

* ఆత్మకూరు పట్టణంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో చంద్రబాబు పర్యటనపై నాయకులతో జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సమావేశం

* పశ్చిమ గోదావరి: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన వివరాలు.. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో ప్రజా దీవెన యాత్ర కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..

* విజయనగరం: శ్రీ శ్రీ శ్రీ జగద్గురు రాంభద్రాచార్యులు శ్రీ హనుమాన్ సేనా ట్రస్టు సంకల్పంతో నేడు అమృత రథయాత్ర… ఈ యాత్ర రథం రామనారాయణం నుంచి శోభాయాత్రగా Y జంక్షన్, RTC కాంప్లెక్స్, శ్రీ వేంకటేశ్వర దేవాలయం, TTD కళ్యాణ మండపం, కోట జంక్షన్, దాసన్న పేట రైతు బజార్ మీదుగా సాగనున్నది…

* విశాఖ: నేడు కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన.. ఫిషింగ్ హార్బర్ దగ్గర 10వ సాగర పరిక్రమ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రులు.. ఫిషింగ్ హార్బర్ లోని అభివృద్ధి పనులు పరిశీలించనున్న కేంద్ర బృందం

* విజయనగరం: జామి మండల కేంద్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాలు. పాల్గొననున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, అధికారులు…

* అనకాపల్లి: సత్యనారాయణపురం’టిడ్కో’ ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు.. లబ్ధిదారులకు ఇళ్లను అందజేయనున్న మంత్రులు అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, వైవీ సుబ్బారెడ్డి.. 202. 86 కోట్ల రూపాయలతో చేపట్టిన బృహత్తర పథకం ద్వారా 2,744 మందికి లబ్ది…

* విజయనగరం జిల్లా: భోగాపురం డెంకాడ మండల కేంద్రాలలో పెరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమం మరియు కొత్త పింఛన్లు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి

* అనంతపురం : ఈనెల 6న జెఎన్టీయూ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. మధ్యాహ్నం బుక్కరాయసముద్రం మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే వికసిత్ భారత్ సంకల్ఫ్ యాత్ర సభలో పాల్గొననున్న గవర్నర్.

* అనంతపురం : అనంతపురం పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ క్రీడాత్సోవాలు.

* కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కాకినాడ పర్యటన వాయిదా.. షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి కాకినాడలో సమీక్షలు చేయాల్సి ఉన్న పవన్.. రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశాలు ఉండడంతో జిల్లా పర్యటన వాయిదా వేసుకున్న పవన్.. త్వరలోనే పర్యటన ఉండే అవకాశం

* విజయనగరం: నగరంలోని 27 వ డివిజన్ లో శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ‌. 27వ డివిజన్ పరిధిలో జొన్న గుడ్డి పెద్దవీధి రామ మందిరం వద్ద పెంపుదలు చేసిన పింఛలను పంపిణీ కార్యక్రమం లో పాల్గొంటారు.

* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని గుట్టకింద పల్లి సర్కిల్ నుంచి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టనున్న ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్.

* కాకినాడ: నేడు యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు సమీక్షా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మత్స్య మరియు పశుసంవర్ధక శాఖా మంత్రి పురుషోత్తం రూపాలా మరియు సహాయ మంత్రి ఎల్. మురుగన్

* విజయనగరం{ నగరంలోని ఆనం దగజపతి ఆడిటోరియంలో నేడు బాలో త్సవం సందడి… కథా రచన, పద్యాలు, పాటలు, ఫ్యాన్సీ డ్రెస్ షో, లఘు నటిక, ఏకపాత్రాభినయం, మట్టితో బొమ్మలు చేయడం, జానపద నృత్యం తదితర పోటీలు నిర్వహించనున్నారు.. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు‌‌…

* పార్వతీపురం మన్యం జిల్లా: మక్కువ మండలం తూరు మామిడి పంచాయితీ లో గడపగడప కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజన్నదొర

* విజయవాడ: నేడు బీసీ సంఘం ఆత్మీయ సమావేశం.. హాజరు కానున్న సజ్జల, రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య, బీద మస్తాన్ రావు

* బెజవాడలో నేడు మాదిగల ఇంటెలెక్చువల్ ఫోరమ్ సమావేశం.. హాజరు కానున్న సజ్జల, ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్సీ మొండి తోక అరుణ్

* విజయవాడ: నేడు రెడ్డి గూడెం వెళ్లనున్న ఎంపీ కేశినేని నాని.. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేశినేని

Exit mobile version