* అమరావతి: ఇవాళ సీఎం వైఎస్ జగన్ కాకినాడ పర్యటన.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించి.. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం
* అమరావతి : ఇవాళ పెన్షన్ పెంపు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. నెలకు 2,750 రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపు.. ఏటా 66.34 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం.. పెన్షన్ల పై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు..
* హైదరాబాద్: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు.. తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన సీనియర్ నేతల సమక్షంలో చర్చలు.. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 5 వందల మంది నేతలకు ఆహ్వానం.. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం..
* నేడు ఢిల్లీకి వైఎస్ షర్మిల.. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్న షర్మిల.. నేడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక.. ఆమెతో పాటు దాదాపు 40 మంది నేతలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం
* అమరావతి: సీఎంగా వైఎస్ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా నేటి నుంచి “రా కదలి రా!” పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు.. తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరణ.. పంచాయితీల సమస్యలపై నేడు సర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు, బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు
* విజయవాడ: నేటి నుంచి బెజవాడలో ట్రాఫిక్ మళ్లింపు.. ఈ నెల 5వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ సమస్య లేకుండా మళ్లింపులు.. 4200 మంది పోలీసులతో బందోబస్తు
* ప్రకాశం : యర్రగొండపాలెంలో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలను చేసిన అనంతరం నూతనంగా పెన్షన్ మంజూరు అయిన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* అమరావతి: 23వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ఏపీలో మున్సిపల్ కార్యాలయాల వద్ద 9వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు…
* బాపట్ల : చీరాలలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర చేనేత జన సమైక్య ఆధ్వర్యంలో సదస్సు..
* బాపట్ల : పంగులూరు మండలం బొల్లాపల్లి వద్ద టీడీపీ క్యాంప్ కార్యాలయంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం..
* ప్రకాశం : ఈనెల 5న కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. కనిగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు..
* ప్రకాశం : ఒంగోలులో సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా..
* తిరుమల: సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ అధికారులు
* గుంటూరు: తమ డిమాండ్ల సాధన కోసం నేడు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలపనున్న అంగన్వాడీలు… సమ్మె విరమించాల్సిందిగా కలెక్టర్ లు నోటీసులు జారీ చేయడంతో నేడు కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించనున్న అంగన్వాడీలు…
* గుంటూరు: నేడు మంగళగిరి సీకే కన్వెన్షన్ లో సర్పంచుల సంఘం, పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సదస్సు…
* బాపట్ల: నేడు భట్టిప్రోలు మండలం పెదపులి వారిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ…
* నెల్లూరులోని బృందావనం ప్రాంతంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
* గుంటూరు: నేడు అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.. కార్యాలయ ముట్టడి సాకుగా చేసుకొని అసాంఘిక శక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీస్ శాఖ.. గుంటూరు నగరంలో 30 పోలీస్ యాక్ట్ అమలు ..
* నెల్లూరు జిల్లా: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈ నెల 26న జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు.. ఇన్ శాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్న శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరుగుతున్న అనుసంధాన ప్రక్రియ
* పశ్చిమ గోదావరి: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణంలోని వీకర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ లో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభించి, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* పశ్చిమ గోదావరి: తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో పర్యటించనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అత్తిలిలో ప్రజా దీవెన యాత్ర లో పాల్గొనున్న మంత్రి..
* ఏలూరు: అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు.. ఏలూరు నగరంలో 144 సెక్షన్‌ను విధిస్తూ తహశీల్దార్ ఉత్తర్వులు..
* అనంతపురం : బుక్కరాయసముద్రం మండలం లో ఈనెల 6న వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర గవర్నర్…
* శ్రీ సత్యసాయి : నేటి నుంచి ధర్మవరం – మచిలీపట్నం ర్తెళ్ల మళ్లింపు.
* విజయనగరం: నేడు నారా భువనేశ్వరి విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తెర్లాం మండలం మోదుగ వలసలో ఓ కుటుంబాన్ని పరామర్శించి పెరుమాళి గ్రామంలో బహిరంగ సభ నిర్వహించ నున్నారు.
* నేడు కాకినాడలో పర్యటించనున్న కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల,మురుగన్.. ఆక్వా-రైతులు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఆపరేటర్లు తో నిర్వహించే సమావేశంలో పాల్గొనున్న కేంద్ర మంత్రులు
* చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లో 23వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు.. నేడు కలెక్టరెట్ కార్యాలయ ముట్టడికి పిలుపు
* కాకినాడ: రేపు కాకినాడకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మూడు రోజులు పాటు కాకినాడలోనే ఉండనున్న పవన్.. రాజమండ్రి అమలాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ కోఆర్డినేటర్లతో విడి విడి గా సమావేశం.. కాకినాడ సిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సేనాని, డివిజన్ల వారీగా రివ్యూ చేయనున్న పవన్
* కడప: ఇవాళ సాయంత్రం తాడేపల్లికి వైఎస్ షర్మిల.. మూడున్నరకి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న షర్మిల.. నాలుగున్నరకు సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్న షర్మిల.. తన కుమారుడి వివాహానికి సంబంధించి వెడ్డింగ్ కార్డును జగన్ అందించనున్న షర్మిల..
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారం ప్రారంభం.. టిక్కెట్టు ఖరారు కావడంతో ప్రచారాన్ని మొదలు పెడుతున్న ఎమ్మెల్యే రాజా.. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం చేపట్టనున్న రాజా
* తూర్పుగోదావరి జిల్లా: నేడు పట్టణ ప్రాంతాల్లో 2వ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరాలు.. గ్రామీణ ప్రాంతాల్లో మంగళ శుక్రవారాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రతి బుధవారం రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు.. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద గ్రామాల్లో మొబైల్ వైద్య శిబిరాలు
* తూర్పుగోదావరి జిల్లా: ఈనెల ఐదో తేదీ వరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ మాధవి లత ఆదేశాలు జారీ