NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేటి నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రేపు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్ధిక మంత్రి

* స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.78 వేలు

* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్‌ భేటీ.. సీఎం వైఎస్‌ జగన్ అధ్యక్షతన జరుగనున్న మంత్రి మండలి సమావేశం..

* నేడు కాకినాడకు గవర్నర్ అబ్దుల్ నజీర్.. జేఎన్టీయూ 10వ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్న గవర్నర్, టీసీఎస్‌ చైర్మన్ రాజన్నకి యూనివర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్, విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్లు ప్రదానం

* ప్రకాశం జిల్లాలో రెండవ రోజు నిజం గెలవాలి పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన.. దర్శి, కొండేపి నియోజకవర్గాల్లో చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి..

* గుంటూరు: నేడు మంగళగిరిలో సామాజిక సాధికార బస్సుయాత్ర ముగింపు సభ.. మంగళగిరి బస్టాండ్ సెంటర్ లో వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించనున్న ఎంపీ విజయసాయి రెడ్డి.. హాస్పిటల్ రోడ్డు మీదుగా మిద్ది సెంటర్ వీటీజీఎం డిగ్రీ కాలేజ్ వద్ద బహిరంగ సభ.. హాజరుకానున్న పలువురు మంత్రులు, వైసీపీ ప్రజా ప్రతినిదులు.

* తూర్పుగోదావరి: రేపటి నుంచి పది రోజులు పాటు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేత.. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆదేశాలు.. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల ప్రతిపాదనలతో మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్న ఇరిగేషన్ అధికారులు

* ప్రకాశం : తాళ్లూరులో వైఎస్సార్‌ ఆసర కార్యక్రమంలో పాల్గొననున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైసీపీ ఇంచార్జీ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. దర్శిలో తన క్యాంపు కార్యాలయంలో అనుచరులతో సమావేశం కానున్న ఎమ్మెల్యే మద్ధిశెట్టి వేణుగోపాల్..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నన్నయ్య విశ్వావిద్యాలయం 13,14 ,15వ స్నాతకోత్సవం.. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరుకానున్న ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్.. మధ్యాహ్నం 1 గంట నుండి కార్యక్రమాలు ప్రారంభం

* తిరుమల: ఫిబ్రవరి 16వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఒకే రోజు సప్తవాహనాలుపై మాడవీధులలో విహరించనున్న మలయప్పస్వామి

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం.. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉదయం 9.30 గంటల నుంచి పోటీలు.. హాజరుకానున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు

* బాపట్ల : సంతమాగులూరులో ప్రత్యేక స్పందన కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ రంజిత్ పాషా..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యాక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు: రైతుల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా

* నెల్లూరు: చేజర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విక్రం రెడ్డి ఆధ్వర్యంలో విజయీ భవయాత్ర

* గుంటూరు: నేడు జడ్పీ సమావేశ మందిరంలో, రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ ఆధ్వర్యంలో సదస్సు…

* బాపట్ల: రేపల్లెలో తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ, నేడు వెలుగు వివో ఏల మహాధర్నా.

* అనంతపురం : తాడిపత్రి పట్టణంలోని 25 వ వార్డులో పర్యటించనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

* అనంతపురం : అంబేడ్కర్ భవనంలో నేడు మాదిగల మహా సమ్మేళనం.. చట్టసభలలో ప్రాతినిథ్యంపై చర్చ

* పశ్చిమగోదావరి జిల్లా: రేపు భీమవరం నుంచి బీజేపీ ఎన్నికల శంఖారావం.. హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించిన కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్న రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి..

* అనంతపురం : పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరు గ్రామంలో శ్రీ పప్పూరమ్మ దేవత ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం.

* అనంతపురం : పెద్దపప్పూరు మండలం దేవుని ఉప్పలపాడు, చెర్లోపల్లి గ్రామాలలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనంల ప్రారంభోత్సవ కార్యక్రమం.

* తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,135 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,004 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు

* తిరుమల: ఫిబ్రవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు హిందు ధార్మిక సదస్సు.. హాజరుకానున్న మఠాధిపతులు, పిఠాధిపతులు.. ఏర్పాట్లను పరిశీలించనున్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి

* తిరుమల: సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్న తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ లక్ష్మిషా.. ఇవాళ తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మిషా

* హైదరాబాద్‌ : ఆదాయానికి మించి ఆస్తులు కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ.. శివ బాలకృష్ణను 8 రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఏసీబీ కోర్టు.. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు నుండి ఫిబ్రవరి 7 వరకు కస్టడీలో విచారించనున్న ఏసీబీ.. చంచల‌గూడ జైలు నుండి శివ బాలకృష్ణను ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ