* ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న కేంద్రం.. నేడు ఉభయ సభల్లోని పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ
* అమరావతి: నేడు ఆర్ధిక శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉదయం 11:30 కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేటి సమీక్షకు ప్రాధాన్యత
* హైదరాబాద్: ఉదయం 9 గంటలకు బాపు ఘాట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి.. గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించనున్న సీఎం రేవంత్
* అమరావతి: నేడు సాయంత్రం ఎస్ఐపీబీ సమావేశం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరుగనున్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. పలు పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించనున్న ఎస్ఐపీబీ.. సాయంత్రం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
* ఖమ్మం: నేడు హైకోర్టులో తేలనున్న డీసీసీబీ చైర్మన్ అవిశ్వాస తీర్మానం వివాదం.. అవిశ్వాసానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన డీసీసీబీ చైర్మన్ కురకులా నాగభూషణం.. ఈ నెల 27న జరిగిన అవిశ్వాసం.. హాజరు కానీ చైర్మన్.. చైర్మన్‌కు వ్యతిరేకంగా 13 మందిలో 11 మంది ఓటు.. నేటి తీర్పుతో అవిశ్వాసంపై వీడనున్న ముడి
* రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో నేటి నుండి ఐదు రోజులపాటు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవంలు.. ఉత్సవాలను ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
* నేడు జీవీఎంసీ ధర్నాచౌక్ దగ్గర మాజీ ఐపీఎస్ లక్ష్మీ నారాయణ నిరసన దీక్ష.. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన డిమాండ్.. ద్వారకా బస్ స్టేషన్ నుంచి జీవీఎంసీ వరకు పాదయాత్రగా వెళ్లనున్న లక్ష్మీనారాయణ.. సొంత పార్టీ పెట్టిన తర్వాత విశాఖలో తొలిసారిగా రోడ్డెక్కుతున్న జేడీ.
* విశాఖ: నేడు జేయూ ఫార్మాసిటీలో ల్యాండ్ ఫిల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ.. పరవాడ (మం) తాడి గ్రామం సర్వేనెంబర్ 116 లో 50 ఎకరాల్లో ఫార్మా ఘన వ్యర్ధాలు శుద్ధి కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు.. ల్యాండ్ ఫిల్ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తాడి గ్రామస్థులు. మద్దతు పలుకనున్న జనసేన, వామపక్ష పార్టీలు. ఫార్మా కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న తాడి గ్రామం తరలింపు కు హామీ ఇచ్చిన ప్రభుత్వం….
* విశాఖ: నేడు నగరంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం,దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణ.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన.. రాజమండ్రి రూరల్ వెంకాయమ్మ పేట గ్రామంలో స్వచ్ఛత-మన భాద్యత శానిటేషన్ పై స్పేషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం మీడియా సమావేశం
* తూర్పు గోదావరి జిల్లా: ఉభయ గోదావరి జిల్లాల నుంచి అయ్యోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 7, 10, 11, 14 తేదీలలో రాజమండ్రి, సామర్లకోట స్టేషన్స్ నుంచి ప్రత్యేక రైళ్లు.. రాజమండ్రి-అయోధ్య, అయోధ్య ధామ్-రాజమండ్రి, సామర్లకోట-అయోధ్య, గుంటూరు-అయోధ్య -గుంటూరు, విజయవాడ – అయోధ్య – విజయవాడ రూట్స్లో ప్రత్యేక రైళ్లు
* ప్రకాశం: కొండేపిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఆదిములపు సురేష్.. ముండ్లమూరులో వైఎస్ఆర్ అసర కార్యక్రమంలో పాల్గొననున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైసీపీ ఇంచార్జీ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* బాపట్ల : వేటపాలెం మండలం చల్లారెడ్డిపల్లిలో 5.60 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఇంచార్జీ కరణం వెంకటేష్..
* ప్రకాశం : ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొదటి రోజు నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర.. పర్చూరు మండలం చిననందిపాడు, యద్దనపూడి, ఒంగోలు మండలం ముక్తినూతలపాడులలో చంద్రబాబు అరెస్టుతో కలత చెంది మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్న నారా భువనేశ్వరి..
* తిరుమల: ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హిందు ధార్మిక సదస్సు.. హజరుకానున్న 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు
* తిరుమల: ఫిబ్రవరి 16వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఒకే రోజు సప్తవాహనాలు పై మాడవీధులలో విహరించనున్న శ్రీవారు.. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీ
* అనంతపురం : పుట్లూరు మండలం మడుగు పల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, సమన్వయకర్త వీరాంజనేయులు.
* విజయనగరం జిల్లా: నెల్లిమర్ల ఫుడ్ బాల్ గ్రౌండ్ లో వైయస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం.. హాజరుకానున్న ఎమ్మెల్యే అప్పలనాయుడు
* విజయనగరం: నేడు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం కార్యాలయ సమావేశ మందిరంలో జరుగనుంది.. సలహా మండలి సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు హాజరు కావాలని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.
* తూర్పుగోదావరి జిల్లా: జాతీయ కోవిడ్ అమర వైద్యుల సంస్మరణ దినం సందర్భంగా రాజమండ్రి ఐఎంఎ ఆధ్వర్యంలో ర్యాలీ.. జెండాఊపి ర్యాలీని ప్రారంభించిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. రాజమండ్రి కఠారినగర్ రామాలయం సెంటర్ నుండి సుబ్రహ్మణ్య మైదానం వరకు ర్యాలీ.. అనంతరం సుబ్రహ్మణ్య మైదానంలో సభ
* శ్రీ సత్యసాయి : మడకశిరలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. హాజరుకానున్న సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి.
* పార్వతీపురం మన్యం జిల్లా: మక్కువ మండలం శంబర పోలమాంబ అమ్మవారి రెండవ వారం జాతర.. ఉదయం 4 గంటల నుండి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు. లక్ష మంది వస్తారని అంచనా వేసిన దేవాదాయశాఖ అధికారులు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో 4వ విడత ఆసరా కార్యక్రమం.. హాజరుకానున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు
* ఏలూరు: ఫిబ్రవరి మూడో తేదీన ఏలూరులో జరగనున్న సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు.. నేడు పరిశీలించనున్న జిల్లా నాయకులు, ఎంపీ మిథున్ రెడ్డి..
* నేడు గుంటూరులో పర్యటించనున్న ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి… గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో పాల్గొననున్న పురంధేశ్వరి.
* గుంటూరు: నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ స్థాయి సంఘం సమావేశం…
* గుంటూరు: నేడు దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ను పరిశీలించనున్న అధికారుల బృందం.. కోల్డ్ స్టోరేజ్ ప్రమాద ఘటనకు సంబంధించి విచారణ చేయనున్న బృందం…
* గుంటూరు : నేడు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..
* గుంటూరు నుండి రేపు అయోధ్యకు బయలుదేరాల్సిన ప్రత్యేక రైలు.. రైళ్ల రద్దీ కారణంగా వాయిదా..
* గుంటూరు: రేపు మంగళగిరిలో వైసిపి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర..
* నెల్లూరు జిల్లా: వాస్తవ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: ఆత్మకూరులో జరిగే ఆశ్రమ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో సిటీ నియోజక వర్గ నేతల సమావేశం
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,082 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 20,912 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.79 కోట్లు