Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఏపీలో నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు.. రేపటి నుంచి నగరాలు, పట్టణాల్లో కార్యక్రమానికి శ్రీకారం.. తొలి దశ సురక్షలో 60 లక్షల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం అందించిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌

* అమరావతి: ఆర్ధిక శాఖ పై నేడు సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం

* అమరావతి: ఇవాళ మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఉదయం 11 గంటలకు కార్మిక సంఘాలతో జీవోఎం భేటీ.. సచివాలయంలోని సెకెండ్ బ్లాక్ లో సమావేశం ..

* నేడు మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబ సమేతంగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరి వెళ్లనున్న YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కడప విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయ ఎస్టేట్ లోని YSR ఘాట్ వద్దకు షర్మిల ఫ్యామిలీ.. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి గారి వివాహ పత్రికను ఉంచి నివాళులు అర్పించనున్న షర్మిల.

* బాపట్ల : చీరాల మండలం వాడరేవులో సాగర్ పరిక్రమ కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తం రూపాల.. మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించనున్న కేంద్ర మంత్రి రూపాల..

* తిరుమల: శ్రీవారి ఆలయంలో పూర్తి అయిన వైకుంఠ ద్వార దర్శనం.. నిన్న అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేసిన అర్చకులు.. ఇవాళ్టి నుంచి సర్వదర్శనం భక్తులుకు, నడకదారి భక్తులుకు తిరుపతిలో టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ.. ఇవాళ్లి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పున:ప్రారంభం

* ప్రకాశం : ఒంగోలు అంబేడ్కర్ భవన్ లో దళిత, గిరిజన, క్రైస్తవ, బీసీ, మైనారిటీ సంఘాల నేతలతో కాంగ్రెస్ పార్టీ సమాలోచన సమావేశం.. హాజరుకానున్న సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పులరాజు, కేంద్ర మాజీమంత్రులు జేడీ శీలం, చింతా మోహన్, ఏఐసీసీ కార్యదర్శి సిరివెళ్ల ప్రసాద్, మాజీ పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్..

* అమరావతి: ఏపీలో 22వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..

* అమరావతి: మున్సిపల్ కార్యాలయాల వద్ద 8వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు…

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు నగర నియోజకవర్గంలోని కోటమిట్ట ప్రాంతంలో పర్యటించనున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో తెలుగు భాషా వైభవ శోభా యాత్ర.. ఈ నెల 5, 6, 7తేదీల్లో జరుగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలకు సంఘీభావంగా తెలుగు భాషా వైభవ శోభా యాత్ర.. రాజమండ్రి దండి మార్చ్ సర్కిల్ నుండి తెలుగు భాషా వైభవ శోభా యాత్ర ప్రారంభమై పుష్కర ఘాట్ వద్ద రాజరాజనరేంద్ర విగ్రహం వరకు సాగనున్న యాత్ర

* పశ్చిమ గోదావరి: నేడు భీమవరం కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా పర్యటన.. జిల్లాలోని ఆక్వా-రైతులతో, ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఆపరేటర్లతో ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు..

* అమరావతి: సచివాలయంలో ఉదయం 11 గంటల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.

* పశ్చిమ గోదావరి జిల్లా, తణుకుప్రజాదీవెన యాత్ర పేరుతో మంత్రి కారుమూరు నాగేశ్వర రావు పాదయాత్ర.. వైసీపీ ప్రభుత్వంలో చేసిన మేలును ప్రజలకు వివరించేందుకు అత్తిలి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న మంత్రి..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ లో నూతనంగా నిర్మించిన భోజనశాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

* విజయనగరం జిల్లా గుర్ల మండలం ఆనందపురంలో నేడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం.. పాల్గొన్న జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు..

* బాపట్ల: నేడు నిజాంపట్నం హార్బర్ ను సందర్శించనున్న కేంద్ర మత్స్యకార శాఖ మంత్రి, పురుషోత్తం రూపాల.. పదవ సాగర పరిక్రమ కార్యక్రమం లో భాగంగా హార్బర్ ఆధునికరణ పై అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న కేంద్ర మంత్రి.. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తరపున హాజరుకానున్న మంత్రి సీదిలి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ…

* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణంలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* అనంతపురం : కుందుర్పి మండలంలో నేడు గ్రామ- గ్రామానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, అభివృద్ధి బాటసారి రఘువీరారెడ్డి ని గెలిపించాలని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు

* అనంతపురం : యాడికి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో నిర్వహించే భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

* గుంటూరు: సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు కొనసాగించనున్న అంగన్వాడీలు..

* పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాం నియోజకవర్గంలో 22వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె.. అంగన్వాడీలకు లబ్ధిదారులు మద్దతు .

* పార్వతీపురం మన్యం జిల్లా: కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె.. మద్దతు పలుకుతున్న వాటర్ వర్క్స్ కార్మికులు

Exit mobile version