Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ.. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.. 6వ సారి ప్రపంచకప్‌ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత్‌

* హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రో కబడ్డీ మ్యాచ్ లు.. ఈ రోజు మూడు మ్యాచ్ లు.. దబాంగ్ ఢిల్లీ vs యూ ముంబా, తెలుగు టైటాన్స్ vs యూపీ యోధా, బెంగుళూరు బుల్స్ vs తమిళ్ తలైవాస్

* తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.62,950.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,200

* 40వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరసనలు.. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్న అంగన్వాడీలు

* నేడు అరకు, అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘రా.. కదలిరా’ సభలు.. అరకు, మండపేటల్లో చంద్రబాబు బహిరంగ సభలు

* ఈ నెల 22న స్టాక్‌ మార్కెట్లకు సెలవు.. అయోధ్యలో బాలరాముడి విగ్రహ పటిష్ట సందర్భంగా సెలవు.. నేడు యథావిథిగా పనిచేయనున్న స్టాక్‌ మార్కెట్లు

* అనంతపురం: నేడు ఉరవకొండకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ఎన్టీఆర్‌ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొననున్న పురంధేశ్వరి

* నేడు ఇడుపులపాయకు వైఎస్‌ షర్మిల.. రేపు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల.. 4 గంటలకు వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల ప్రత్యేక ప్రార్థనలు.. ఇవాళ రాత్రికి ఇడుపులపాయలో బస చేయనున్న షర్మిల, రేపు కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు షర్మిల.. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టనున్న షర్మిల

* విశాఖ: నేడు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ గా బాధ్యతలు చేపట్టనున్న PVGD ప్రసాద్ రెడ్డి….

* ప్రకాశం : చీమకుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సంతనూతలపాడు వైసీపీ ఇంచార్జీగా మంత్రి మేరుగ నాగార్జున పరిచయ కార్యక్రమం, హాజరుకానున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, దర్శి ఇంచార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..

* ప్రకాశం: మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అయోధ్య ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా వికాస తరంగణి వారిచే హనుమాన్ చాలీసా పారాయణం..

* తిరుమల: ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ నెలకు సంబంధించిన టికెట్లు విడుదల.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కేట్లను విడుదల చేయనున్న టీటీడీ

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు: వెంకటాచలం మండలం గొలగమూడిలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

* అంబేద్కర్ కోనసీమ: నేడు మండపేటలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్న శెట్టిబలిజ సంఘ నాయకుడు వాసంశెట్టి సుభాష్.. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుభాష్…

* పశ్చిమ గోదావరి: రెబల్ స్టార్, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు జయంతి సందర్భంగా మొగల్తూరులో నేడు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు.. కృష్ణంరాజు సతీమణి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు.

* పశ్చిమగోదావరి జిల్లా: పాలకొల్లులో నేడు ఆక్వా రైతుల ర్యాలీ.. ఆక్వా రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు 2కే ర్యాలీ నిర్వహించనున్న రైతులు..

* అనంతపురం: ఈనెల 23న ఉరవకొండలో పర్యటించనున్న సీఎం జగన్.. వైఎస్‌ఆర్‌ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. ఇవాళ సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించనున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యాటన నేపధ్యంలో అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసు ఆంక్షలు అమలు.. సబ్ డివిజన్ పరిధిలో అంతటా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు .. ఫైర్ క్రాకర్స్ కాల్చడo నిషేధo.

* శ్రీ సత్యసాయి : పరిగి మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .

* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..

* కర్నూలు: మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషకం, పంచామృతాభిషేకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామివారిని రథంపై ఉరేగింపు.

* తిరుమల: 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 26,034 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు

Exit mobile version